వికీపీడియా చర్చ:వికీ బడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను వికీ బడి అనే శీర్షికన క్రియాశీలక సభ్యులకు వికీపాఠాలు నిర్వాహించదలచుకున్నాను. ఇవి కొత్తసభ్యులను ఉద్దేశించినవి కావు. ఆసక్తి ఉన్నవారు ఈ దిగువన పేరు జతచేయండి. అందరికీ తగిన సమయం చూసి అంతర్జాల తరగతులను నిర్వహించగలను --వైజాసత్య (చర్చ) 05:00, 12 సెప్టెంబర్ 2013 (UTC)

  • మంచి ఆలోచన. ఉదాహరణగా మొదటి కార్యక్రమానికి పాఠాల శీర్షికలు తెలిపితే ఆసక్తిగలవారు పేరు చేర్చటానికి సులభమవుతుంది.--అర్జున (చర్చ) 05:33, 12 సెప్టెంబర్ 2013 (UTC)
వికీలో నేర్చుకోవాల్సినది చాలా ఉన్నది. నన్ను మీ బడిలో విద్యార్థిగా నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 05:38, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నేను కూడా,ఇలాంటివి నాకు తెలియవు.పాలగిరి (చర్చ) 07:18, 12 సెప్టెంబర్ 2013 (UTC)


ఇవి నాకు ప్రస్తుతానికి తోచిన కొన్ని అంశాలు. ఇంకా ఏవైనా మీకు తోచితే జోడించగలరు. --వైజాసత్య (చర్చ) 06:44, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నాకూ మీ బడిలో పాథాలు నేర్చుకోవాలనుంది. నన్నూ చేర్చుకోగలరు. దీనికి ఒక పేజీ తయారు చేసి అందులో రాస్తే బావుంటుందిగా. చర్చా పేజీలో వీటికి సంభందించిన చర్చలు రాయొచ్చు..విశ్వనాధ్ (చర్చ) 06:59, 12 సెప్టెంబర్ 2013 (UTC)
"వికీ బడి" అనేది మంచి ఆలోచన. వికీలో రచనలు చేసే విధానం చాలా మందికి తెలియవలసిన అవసరం ఉంది. మూలాలు, లింకులు చేర్చడం, దస్త్రాలను దిగుమతిచేయడం , కాపీహక్కులు , తెవికీ మార్గదర్శకాల గూర్చి తెలుసుకోవలసిన అవసరం నాకున్నది. నేను తెవికీ లో అనేక రంగాలలో రచనలు చేయగలను. కానీ విధివిధానాలు స్పష్టంగా తెలుసుకోవాలని ఉంది.అందువలన తెవికీ బడిలో నన్ను చేర్చుకోండి.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 10:13, 12 సెప్టెంబర్ 2013 (UTC)
విధివిధాన పరిజ్ఞానము కొరకు నేను కూడ "వికీ బడి" లో చేరాలని వుంది. Bhaskaranaidu (చర్చ) 11:24, 12 సెప్టెంబర్ 2013 (UTC)
వికీబడి శిక్షణ అనేది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా భావిస్తున్నాను. చాలా కాలం నుంచి తెవికీలో నిర్వహణ అనేది సమస్యగా మారింది. "కాసే చెట్లకే దెబ్బలు అన్నట్లు" నిర్వహణ చేసే వారికే చివాట్లు రివార్డులుగా లభిస్తున్నాయి. దాంతో నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదు! సభ్యులందరికీ నిబంధనలపై అవగాహన ఉంటే నిర్వహణ చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వికీశిక్షణ అనేది అందరూ ఆనందంగా స్వాగతించాల్సిన ఒక శిక్షణా కార్యక్రమం. అయితే ఈ అంతర్జాల తరగతులు ఎక్కడ నిర్వహిస్తారు? ఎలా నిర్వహిస్తారు? అనేది తెలిస్తే పూర్తిగా విశ్లేషించడానికి వీలవుతుంది. నా అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే దీన్ని తెవికీలోనే నిర్వహించాలి. ఛాట్ రూపంలో అయితే ఆ సమయంలో మనకు వేరే వ్యాపకాలుండవచ్చు. తెవికీ పేజీలోనే అక్షరరూపంలోనే వారానికి ఒక పాఠం చొప్పున రోజూ వివరించాలి. సభ్యుల అభిప్రాయాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే భవిష్యత్తులో చేరే సభ్యులకే కాకుండా ఇప్పటి సభ్యులకు ఏమైనా అనుమానాలువచ్చినప్పుడు మరోసారి ఆ పేజీని దర్శించడానికి వీలవుతుంది. దీనికి అదనంగా వీడియో ఉన్నా మంచిదే. కొన్ని సందర్భాలలో యానిమేషన్ చిత్రాలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి బాగా తోడ్పడతాయి. అలాగే "నిర్వాహక హోదా, అధికారి హోదాల సమీక్ష, పరిమితులు, పద్ధతులు. నిర్వాహకత్వ బాధ్యతలు" అనే విషయాన్ని చివరి పాఠంగా పెట్టారు, అసలు దాన్నే మొదటిపాఠంగా పెడితే బాగుంటుంది. క్రియాశీలకంగా ఉండే సభ్యులు చాలా వరకు నిర్వాహకులై ఉంటారు. కాబట్టి వారి ప్రధాన బాధ్యత అయిన నిర్వహణ ఎలా చేయాలి? నియమాలు ఎలా ఉపయోగించాలి? ప్రస్తుతమున్న నియమాలు ఏమిటి? ఒక నియమానికి మరో నియమానికి ఘర్షణ వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చూపించాలి? ప్రస్తుతం నిర్వహణ ఎలా ఉంది? దీనిలో లోటుపాట్లేమి? దీన్ని సరిదిద్ది భవిష్యత్తులో నిర్వహణ ఎలా మెరుగుపర్చాలి? నియమాలు స్పష్టంగా లేనప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలి? తదితర విషయాలు ప్రారంభంలోనే తెలియపర్చి ఆ తర్వాత మీరు పాఠాలు ప్రారంభిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మొదటి పాఠానికి ఎలాగూ రెండు వారాల సమయం అవసరమంటున్నారు కాబట్టి అంతకు ముందే నిర్వాహకత్వ బాధ్యతలు పాఠం ప్రారంభిస్తే సరిపోతుంది. ఒక పాఠానికి సంబంధించి వివరించేటప్పుడు ప్రస్తుత నిబంధనలు, ఆ విషయంపై ఇప్పటివరకు జరిగిన చర్చలు (ఎక్కడెక్కడో ఉన్నాయి, అవన్నీ వెదకాల్సిఉంటుంది), చర్చలపై తీసుకున్న నిర్ణయాలు, మారిన పరిస్థితులకనుగుణంగా మళ్ళీ చేయాల్సిన మార్పులు-చేర్పులు, సోదర వికీలలో ఇవే అంశానికి సంబంధించి నియమాలు ఎలా ఉన్నాయి (పరిశీలనకు మాత్రమే), వికీ పురోవృద్ధితో పాటు మారాల్సిన నిబంధలు ఏమిటి? నియమాలు ఏ సభ్యులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇలా అనేక అంశాలు పాఠ్యాంశంలోకి తీసుకోవాలి. అన్నింటికంటే ముందుగా (నిర్వాహక బాధ్యతల తర్వాత) వికీ మూల నియమాలు ఏమిటి? వాటిని ఎలా వర్తింపజేయాలి? వాటికి భిన్నంగా ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటివి కూడా తొలిదశలోనే శిక్షణ ఇస్తే బాగుంటుంది. పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడిస్తే సమీక్షించడానికి వీలవుతుంది. ఆ పిదప శిక్షణా కార్యక్రమ ఎజెండాను ఖరారుచేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:21, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నిర్వహణ పాఠం నుండి మొదలుపెట్టడానికి అభ్యంతరమేమీ లేదు. నేనింకా ఈ పాఠాలకు పూర్తిగా ప్రణాళిక వేసుకోలేదు. కాకపోతే వీటిలో ఏ ఏ అంశాలను ప్రస్తావించాలన్న విషయంపై స్థూలంగా కొన్ని ఆలోచనలున్నాయి. వీటిని పాఠ్యప్రణాళిక తయారుచేసుకొనే క్రమంలో మరింత పరిపుష్ఠం చేస్తాను. సూత్రప్రాయంగా వికీ గురించిన చర్చలు, సమావేశాలు వీలైనంతగా వికీలోనే జరగాలి, కానీ ఈ పాఠాలు కేవలం పాఠాలు మాత్రమే, వికీ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు కాబట్టి ఇది బయట జరిగినా పెద్ద ఇబ్బంది లేదు. అదీగాక వికీలో పొందుపరచి వ్రాయాలంటే ఎంతో కొంత ప్రామాణికత ఉండాలి. నియమనిబంధనలు మొదలైన విషయాలు ఇప్పటికే వికీలో ఏదో ఒక చోట ఉన్నవి (తెలుగులో కాకపోయినా) వీటికి నేను కొత్తగా జోడించే విషయాలేవీ లేవు. కాకపోతే నాకున్న అనుభవాలతో వీటిని సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. విష్ణు గారు వీటి ఆధారంగా కొన్ని చిన్న చిన్న వీడియోలు, బోధక వనరులు ప్రొఫెషనల్స్‌తో తయారు చేయించే ప్రయత్నం చేస్తానన్నారు. ఇవి వికీపీడియన్లకు బోధకాలుగా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. యూట్యూబు యుగంలో నిబంధనలు వ్రాతలో తెలుసుకొనే అలవాటు కొరవడినట్టుంది. నా ఆలోచన ప్రకారం ఈ పాఠాలు ప్రధానంగా పవర్‌పాయింట్ స్లైడ్లు, నా వ్యాఖ్యానంతో ఒక అంతర్జాలపు పాఠంగా కొనసాగుతాయి. ఈ క్రమంలో తయారైన విషయాన్నంతా (పాఠ్యం, స్లైడ్ల ఫీడిఎఫ్ ఫైలు, వీలైతే వీడియో కూడా) వికీపీడియాలో ఎక్కించగలను. వీటి ఆధారంగా కొన్ని బైట్ సైజ్ బోధనా వీడియోలు తరువాత తయారుచేయిస్తారు. నేను పాఠ్యపు ప్రణాళిక, సంబంధిత సమాచారం ముందస్తుగానే వికీలో పెట్టగలను కానీ, పైన చెప్పినట్టుగా నియమాల విషయంలో నేను వికీకి కొత్తగా అందించగలిగేది ఏమీ లేదు. ఏదైనా విషయం వివరించేటప్పుడు ఇప్పటిదాకా జరిగిన చర్చలు మొదలైనవి తప్పకుండా ప్రస్తావిస్తాను కానీ నిర్ణయాలు తీసుకోవటం వంటివి ఈ బడి పరిధిలోకి రావు. చర్చలు, పాఠాలు సంబంధించిన విషయాలే కానీ వీలైనంతగా వాటిని వేరుగా ఉంచితేనే మంచింది. వికీ పద్ధతులపై చర్చలు సాధారణ పద్ధతిలో రచ్చబండపై జరిగితేనే మంచిది. --వైజాసత్య (చర్చ) 04:52, 13 సెప్టెంబర్ 2013 (UTC)
మీ ఆలోచన ప్రకారము చేయండి. ఎలా చేసిననూ ఫలితం మాత్రం ప్రస్తుతం ఉన్న దాని కంటె మెరుగుపరితే చాలు. మీ వ్యాఖ్యప్రకారం చూస్తే తెవికీనే కాకుండా ఇతర వికీ నిబంధనలు కూడా తెలియజేసే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ముందుగానే ఇతర వికీల నియమాలు కేవలం పరిశీలనకే అని చెబితే బాగుంటుంది, లేనిచో రేపు ఏదైనా చర్చలో మీ పాఠాన్ని ఉదహరించే అవకాశమూ ఉంటుంది. ఆ నిబంధన తెవికీ నియమానికి విరుద్ధంగానూ ఉండవచ్చు. ఇదివరకు నేను చేసిన చర్చలలో ఆంగ్లవికీ నియమాలు కూడా తెలియజేశారు. తెవికీకి విరుద్ధంగా ఉన్న ఇతర వికీ నియమాలతో భవిషత్తులో ఇబ్బందులు రావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 13 సెప్టెంబర్ 2013 (UTC)
అవును, నేను వీటిని వికీలో అధికారిక పాఠాలుగా పెట్టడానికి సముఖంగా లేకపోవడానికి అది కూడా ఒక కారణం. విరుద్ధమైన పాలసీ అభిప్రాయాలను మాత్రం తప్పకుండా ఉదహరిస్తాను --వైజాసత్య (చర్చ) 06:32, 14 సెప్టెంబర్ 2013 (UTC)
నాకు ఆసక్తి ఉంది వైజాసత్య గారూ..మీ బళ్ళో నన్నూ చేర్చుకోండి.
వికీ బడి ప్రతిపాదన వైజాసత్య గారు చేసారు, చంద్రకాంతరావు గారు ముఖ్య సూచనలిచ్చారు. చాలా బావుంది. సభ్యులు నేర్చుకోవాలనే ఉత్సాహంతో చేరారు, చాలా చాలా బావుంది. శుభం. అలాగే వ్యాసాలు వ్రాసే సభ్యులు, నిర్వాహకులూ వికీ నియమాలను తప్పనిసరిగా పాటించాలనే నియమం కూడా పెట్టి, ప్రతి సభ్యుని పేజీలోనూ సూచించండి. వికీ బడిలో నేనూ చేరుతున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 20:23, 24 సెప్టెంబర్ 2013 (UTC)