Jump to content

వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/వ్యాసం

వికీపీడియా నుండి

వ్యాసం ఈసరికే ఉందా?

తెలుగు వికీపీడియాలో 1,02,177 వ్యాసాలున్నాయి. అంచేత మీరు రాయదలచిన విషయంపై ఈసరికే వ్యాసం ఉందేమో చూడడం మంచిది. అది వేరే పేరుతో, కొద్ది మార్పులతో ఇదే పేరుతోనో ఉండి ఉండవచ్చు. లేదా ఈ విషయానికి సంబంధించిన వేరే పెద్ద వ్యాసంలో భాగంగా ఉండి ఉండవచ్చు. పదం చివర పూర్ణానుస్వారం బదులు "ము" ఉండి ఉండవచ్చు. (ఉదా: "యుద్ధం" అని మాత్రమే కాకుండా "యుద్ధము" అనే పేరుతో కూడా వెతకాలి)

దాని గురించి మీరు ఈసరికే వెతికి ఉండకపోతే, కింద చూపిన స్థలంలో వివిధ పేర్లను ఇచ్చి వెతకండి. దొరక్కపోతే తిరిగి ఈ పేజీకి రండి. కానీ కూలంకషంగా వెతకండి.


నేను తలపెట్టిన వ్యాసం వేరేపేరుతో ఈసరికే ఉంది   (దారిమార్పు పేజీని సృష్టించండి)

నేను తలపెట్టిన వ్యాసం వికీపీడియాలో లేదు   (మార్గసూచీ వెంట ముందుకు సాగండి)

మీరు రాయదలచిన వ్యాస విషయం వికీపీడియాకు అనుగుణమైనదేనా?

మీకు తెలుసా?

వికీపీడియాకు అనుగుణంగా లేని వ్యాసాలను సత్వరమే తొలగించేస్తారు. ఈ మార్గసూచీని జాగ్రత్తగా అనుసరిస్తే దాన్ని నివారించవచ్చు.

మీరు తలపెట్టిన వ్యాస విషయంపై ఇప్పటికే వ్యాసం లేనంత మాత్రాన, ఈ విజ్ఞానసర్వస్వానికి ప్రతిదీ అనుకూలంగా ఉన్నట్లేమీ కాదు. వికీపీడియాలో రాసే వ్యాసాలు "విషయ ప్రాముఖ్యతా మార్గదర్శకాల"పై ఆధారపడి ఉంచబడమో, తొలగించడమో జరుగుతుంది. వికీపీడియాకు ఏవి అనువైనవో, ఏవి కావో ఈ మార్గదర్శకాలు నిర్ణయిస్తాయి. ఈ సూచీ తరువాతొఇ అంగలో, ఈ మార్గదర్శకాల గురించి మరిన్ని వివరాలు ఉంటాయి.

కింది విషయాల గురించిన వ్యాసాలు రాయకండి:

  • మీ గురించి, మీ సంస్థ గురించి. (Conflict of Interest)
  • మీ స్నేహితులు, మీ భక్త బృందం, మీ సంగీత బృందం, మీ వెబ్‌సైటు. (విషయ ప్రాముఖ్యత)
  • మీ వ్యక్తిగత కక్షలు, మీ ప్రచారాలు. (తటస్థత)

మీరో, మీ సంస్థో, మీ బృందమో, మీ స్నేహితులో, మీ వెబ్‌సైటో ప్రాముఖ్యత కలవేనని మీకు అనిపిస్తే, ఎవరైనా తటస్థ వ్యక్తిని (వ్యాస విషయంతో సంబంధం లేని, ఇలాంటి వ్యాసాలు రాసిన వాడుకరి ఎవరైనా), ప్రతిపాదిత వ్యాసం గురించి సంప్రదించండి. విషయపు ప్రాముఖ్యత గురించి మీకు స్పష్టత లేకుంటే, దాన్ని సహాయ కేంద్రంలో చర్చించండి.

ఈ సూచీ ద్వారా సమర్పించే వ్యాసాలను తనిఖీ చేసే వాడుకరులంతా స్వచ్ఛందంగా పనిచేసేవారే. అంచేత వారి సమయాన్ని వృథా చెయ్యకండి – మీరు తలపెట్టిన వ్యాసానికి విషయ ప్రాముఖ్యత ఉందని నిర్ధారించుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చెయ్యండి..


మీరు తలపెట్టిన వ్యాసం దేని గురించి?

కింది వికల్పాల్లో ఒకదానిపై నొక్కి ముందుకు సాగండి:

నేనొక సంస్థ గురించి రాయాలనుకుంటున్నాను నా గురించే రాయాలనుకుంటున్నాను వేరొకరి గురించి రాయాలనుకుంటున్నాను వెబ్‌సైటు గురించి రాయాలనుకుంటున్నాను కొత్త పదం గురించి రాయాలనుకుంటున్నాను ఇటీవలి ఘటన ఒకదాని గురించి రాయాలనుకుంటున్నాను సంగీతకారుడు / బృందం / ఆల్బం / పాట గురించి రాయాలనుకుంటున్నాను వేరే విషయం గురించి రాయాలనుకుంటున్నాను మరో వ్యాసానికి దారిమార్పు పేజీ సృష్టించాలనుకుంటున్నాను