Jump to content

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మినీ టిటిటి 2019/ప్రవర్తన నియమావళి

వికీపీడియా నుండి

లక్ష్యం

[మార్చు]

ప్రవర్తన నియమావళి, స్నేహపూర్వక వాతావరణం విధానం సీఐఎస్-ఎ2కె 2019 జూలై 6, 7 తేదీల్లో నిర్వహించే హైదరాబాద్ మినీ టీటీటీ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ స్నేహపూర్వకమైన, సుభద్రమైన, వివక్ష లేని వాతావరణం కల్పించడాన్ని లక్ష్యంచేసుకుంది.

ఈ ప్రవర్తన నియమావళి కార్యక్రమానికి సంబంధించిన అనుబంధ, ప్రధాన వేదికలు, మెయిలింగ్ లిస్టులు, ప్రధాన కార్యక్రమంలో భాగం కాని ఇష్టాగోష్టి సమావేశాలు వంటి ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికలు అన్నిటికీ వర్తిస్తుంది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే ఆ కారణంగా ఆంక్షలు, తాత్కాలిక నిషేధాలు, సముదాయ వేదికల నుంచి బహిష్కరణ వంటివి ఎదురుకావచ్చు.

పాల్గొనేవారి పట్ల ఏ విధమైన వేధింపునైనా ఈ కార్యక్రమం ఏమాత్రం సహించదు. కొన్ని సముదాయ వేదికల్లో మరికొన్ని అదనపు నియమాలు ఉండవచ్చు, అలా ఉంటే వాటిని పాల్గొనేవారికి సుస్పష్టంగా ముందుగా వివరించడం జరుగుతుంది. ఈ నియమాలు తెలుసుకోవడం, వాటికి కట్టుబడి ఉండడం పాల్గొనేవారి బాధ్యత. అలానే అందరికీ స్నేహపూర్వకమైన, సకారాత్మకమైన అనుభవం కలిగేలా ప్రవర్తించమని పాల్గొనే ప్రతీవారినీ ప్రోత్సహిస్తున్నాం.

వైవిధ్యంపై ప్రకటన

[మార్చు]

కార్యక్రమంలో సంభాషణలు ఓపెన్ గా, అందరినీ కలుపుకుపోగల రీతిలో, కార్యక్రమం సాగేకొద్దీ ఏర్పడే సమస్యలు ఏవైనా వినిపించుకునేలా ఉండేందుకు మేం నిబద్ధులమై ఉన్నాం.

మేం వయసు, లింగ గుర్తింపు, సెక్సువల్ ఓరియంటేషన్, సామాజిక ఆర్థిక స్థితిగతులు, నేపథ్యం, సంస్కృతి, జాతి, భాష, జాతీయత, ప్రాంతీయత, రాజకీయ విశ్వాసాలు, వృత్తి, మతం, శారీరక, సాంకేతిక సామర్థ్యాల్లోని వైవిధ్యాన్ని స్పష్టంగా గౌరవిస్తాం. ఐతే ఈ జాబితా ఏమీ పరిపూర్ణం కాదు.

వైకల్యాలతో సహా ఈ సంరక్షిత లక్షణాలను లక్ష్యం చేసుకుని వివక్ష చూపడాన్ని మేం సహించం. స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమంలోని వైవిధ్య విలువలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం వీటి కోసం కృషిచేస్తుంది:

  • అందరికీ స్నేహపూర్వకమైన, స్వాగతిస్తూండే వాతావరణం
  • ఓపెన్-మైండెడ్‌నెస్ చూపుతూ, కలసిపనిచేయడాన్ని గౌరవించడం
  • వివేకంతో, ప్రొఫెషనల్‌గా, తోటివారి పట్ల స్పందనాశీలంగా ఉండడం
  • వైవిధ్యాన్ని గౌరవించడం; విభేదాలు హుందాగా అర్థం చేసుకోవడం
  • ఆమోదాన్ని, ఓపికను ప్రదర్శించడం

సాధారణ సముదాయ మార్గదర్శకాలు

[మార్చు]

చేయాల్సినవి

[మార్చు]
  • దయతో, గౌరవంతో, ఒకరి ఉద్దేశాలను మరొకరు సదుద్దేశాలుగా స్వీకరిస్తూండండి
  • ఓపికతోనూ, స్వాగతిస్తూనూ వ్యవహరించండి
  • ఒకరితో ఒకరికి ఉన్న భేదాలు, వైవిధ్యాలు గౌరవిస్తూండండి
  • మీ మాటలు, చేతల విషయంలో జాగ్రత్తగా, సున్నితంగా ఉండండి
  • మంచి శ్రోతగా ఉండండి
  • విభేదాలు, వివాదాలు ఎదురైతే పారదర్శకమైన, గౌరవప్రదమైన, మర్యాదపూర్వకమైన పద్ధతిలో చర్చించి పరిష్కరించుకోవడం, అవసరమైతే నిర్వాహకులను సంప్రదించండి.
  • ఫోటోలు, వీడియోలు తీసుకునేప్పుడు, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకునే ముందు వాటిలో కనిపిస్తున్న తోటివారి అనుమతి తీసుకోండి.
  • తోటివారి వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించకండి
  • కార్యక్రమ సరళిని దెబ్బతీయకుండా, మాట్లాడేవారి మాటలు అడ్డుకొట్టకుండా మాట్లాడేవారి పట్ల మర్యాదతో ప్రశ్నలు లేవనెత్తండి.
  • అసౌకర్యమైన వాతావరణంలో కానీ, అసౌకర్యమైన సంభాషణలో కానీ ఉన్నట్టైతే మీ ఇబ్బందిని వెల్లడించండి.
  • వేదిక వద్ద వయసు రీత్యా మైనర్లతో వ్యవహరించేప్పుడు మీ ప్రవర్తన పట్ల జాగ్రత్త వహించండి.
  • ఏదైనా వేధింపు, వివక్ష, వ్యక్తిగత దాడులు జరిగితే రెస్పాన్స్ టీంకు నివేదించడం కానీ, తెలియపరచడం కానీ చేయండి.

చేయకూడనివి

[మార్చు]
  • ఏ రూపంలోనైనా వేధింపులు, వివక్ష లేక అంగీకరించలేని ప్రవర్తనలకు పాల్పడవద్దు
  • ఎవరి గుర్తింపుని, నమ్మకాలను, వేషభాషలని, రూపాన్ని, ప్రవర్తనని నేరుగా కానీ, పరోక్షంగా కానీ దాడిచేయవద్దు.
  • ఉద్దేశపూర్వకంగా ఒక సభ్యుని గురించి తప్పుగా మాట్లాడడం కానీ, వారిని మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడం కానీ, ప్రశ్నించనివ్వకపోవడం కానీ చేయవద్దు.
  • ఆహారపదార్థాలు, ప్లాస్టిక్, పేపర్, విద్యుత్తు - ఇలా వనరులు ఏవైనా వృధా చేయవద్దు.
  • తోటి సభ్యులు చేరడానికి కానీ, కొనసాగడానికి కానీ ఇష్టపడని చర్చలో కానీ, కార్యక్రమంలో కానీ చేరమని బలవంతపెట్టకండి.
  • కార్యక్రమ వేదిక వద్ద (హోటల్ గదులు, కారిడార్లతో సహా) పొగతాగవద్దు, మద్యం సేవించవద్దు.

ఆమోదయోగ్యం కాని ప్రవర్తన

[మార్చు]

కార్యక్రమానికి సంబంధించిన పబ్లిక్, ప్రైవేటు వేదికలన్నిటా వేధింపులు కానీ, ఇతర తరహా అనుచిత ప్రవర్తన కానీ ఆమోదయోగ్యం కాదు. ఈ కింద కొన్ని ఉదాహరణలు ఇచ్చాం, కానీ ఇదే పూర్తి జాబితా కాదు:

  • వ్యక్తిగత దాడులు, హింస, హింస చేస్తామన్న బెదిరింపులు, ఉద్దేశపూర్వకంగా భయపెట్టడం
  • అవమానకరమైన, అవహేళనాత్మకమైన, విచక్షణాత్మకమైన వ్యాఖ్యలు
  • టాపిక్‌తో సంబంధం లేకుండా, ఊరికే సెక్సువల్ భాష కానీ, ఇమేజరీ కానీ ఉపయోగించడం
  • (సెక్సువల్ కానీ, ఇతర తరహాలో కానీ) సముచితం కాని, అనవసరమైన ఆసక్తి ప్రదర్శించడం, సముచితం కాని విధంగా ముట్టుకోవడం, శారీరిక స్పర్శ
  • ఆమోదయోగ్యం కాని విధంగా, అనవసరమైన పద్ధతిలో పబ్లిక్‌గా కానీ, ప్రైవేటుగా కానీ సంభాషించడం, అనవసరంగా ఎవరినైనా పదేపదే అనుసరించడం
  • అనవసరమైన ఫోటోగ్రఫీ, రికార్డింగ్
  • ఒక వ్యక్తి గుర్తింపును కానీ, ఇతర ప్రైవేటు సమాచారాన్ని కానీ వారి అనుమతి లేకుండా బయటపెట్టడం (ఒక తరహా గుర్తింపు సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతించినంత మాత్రాన వారి గురించి మిగతా సమాచారం అంతా బయటపెట్టవచ్చని కాదని గుర్తించాలి)
  • వ్యక్తిగత సంభాషణలు కానీ, సమాచార ప్రసారాన్ని కానీ ఆమోదయోగ్యం కాని విధంగా, అనవసరమైన పద్ధతిలో ప్రచురించడం – ఐతే వేధింపులను నివేదించడానికి కానీ, బయటపెట్టడానికి కానీ వ్యక్తిగత సమాచారాన్ని, సంభాషణలను ప్రచురించడం కానీ, నివేదించడం కానీ ఆమోదయోగ్యమే.
  • తరచుగా అడ్డుకోవడం, వివాదించడం, గొడవపెట్టుకోవడం వంటివి చేస్తూ చర్చకు కానీ, సముదాయానికి కానీ హానికలిగించడం
  • వివక్ష, మరీ ముఖ్యంగా అణగారిన, తక్కువగా ప్రాతినిధ్యం కలిగిన సముదాయాల పట్ల
  • కార్యక్రమ వేదికల వద్ద పిల్లలు, మైనర్ల పట్ల ఆమోదయోగ్యం కాని ప్రవర్తన (మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ)
  • ప్రవర్తన నియమావళి పద్ధతులను ఉల్లంఘనలను న్యాయంగా నివేదించడానికి తప్ప మరే ఉద్దేశాలతోనైనా ప్రవర్తన నియమావళిని వాడుకోవడం (ఉదాహరణకు వేధింపులకు వ్యతిరేకంగా నివేదించిన వ్యక్తిపై ఎదురుదాడికి ఉల్లంఘన నివేదించడం)
  • రెస్పాన్స్ టీం నిర్ణయాన్ని అమలుచేయనీయకపోవడం, ఉదాహరణకు కార్యక్రమానికి రానీయకుండా అడ్డుకున్న వ్యక్తిని అడ్డుకున్న సమయావధిలోనే రానివ్వడం.


ఫిర్యాదు నివేదించడం ఎలా

[మార్చు]

పాల్గొన్నవారి వల్ల కానీ, నిర్వాహకుల వల్ల కానీ, మరి ఎవరైనా సముదాయ సభ్యుల వల్ల కానీ ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను అనుభవించినవారు కానీ, గమనించినవారు కానీ ఈ కింది పద్ధతులు అనుసరించమని మేం ప్రోత్సహిస్తున్నాం:

  • ఆమోదయోగ్యం కాని విధంగా ప్రవర్తిస్తున్నవారిని ఆపమని అడగండి. ప్రవర్తన నియమావళి గురించి వారికి చెప్పండి/గుర్తుచేయండి.
  • రెస్పాన్స్ టీంకు సమస్యను నివేదించండి
  • రెస్పాన్స్ టీం సభ్యులు: సుశ్వేత కొల్లూరు (suswetha316@gmail.com)

అనానిమస్ ఫీడ్‌బాక్ ఈ లింకు ఉపయోగించి పంచుకోవచ్చు: http://tiny.cc/anonyfeedback

రెస్పాన్స్ టీంపైనే మీకు ఒక ఫిర్యాదు ఉంటే మీరు నివేదించిన సంఘటన విషయం వారు కాక వేరేవారు పరిశీలించేట్టు ఏర్పాటుచేస్తారు. ఫిర్యాదు స్వీకరించడం, చర్చించడం, పరిష్కరించడం సంఘటనలోని అన్ని పార్టీలకు సాధ్యమైనంత గౌరవప్రదంగా, సుభద్రంగా ఉంటుంది. వేధింపులు సహా ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను సదుద్దేశంతో సాధ్యమైనంత గౌరవప్రదంగా స్వీకరిస్తాం. వారి ఖచ్చితమైన అనుమతి లేకుండా వేధింపుల విషయంలో బాధితుల పేర్లు బయటపెట్టం. ఈ నియమావళి దుర్వినియోగం నుంచి వాలంటీర్లను కాపాడేందుకు దురుద్దేశంతో చేసినట్టు తేలుతున్న ఫిర్యాదులు తిరస్కరిస్తాం.

ఈ కార్యక్రమం అణగారిన, తక్కువగా ప్రాతినిధ్యం కలిగిన సముదాయాల భద్రతకు విశేష ఆధిక్యత కలిగినవారి సౌకర్యాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని గమనించాలి. రెస్పాన్స్ టీం చర్యలు తీసుకోవడానికి ఈ కింది సందర్భాల్లో నిరాకరించే హక్కులు కలిగివుంటుంది:

  • రివర్సిజాలు, ఎదురు జాతివివక్ష, ఎదురు లింగ వివక్ష వంటివి
  • సంభాషణల్లో సముచితమైన హద్దులు, ఉదాహరణకు నన్ను వదిలెయ్యండి, వెళ్ళిపోండి, నేను నీతో ఈ విషయం మాట్లాడబోవట్లేదు వంటివి
  • మీకు అనుకూలమైన, మీ తరహా టోన్‌లో సంభాషించకపోవడం
  • జాతివివక్ష, లింగవివక్ష, వంటి అణచివేత ధోరణులను విమర్శించడం

పరిణామాలు

[మార్చు]

వేధింపు ధోరణులు ఏవైనా వెంటనే వాటిని ఆపమని పాల్గొనేవారిని అడుగడం జరుగుతుంది. అలానే వాటిని గమనించినవారు కూడా ఫిర్యాదుచేయమని ప్రోత్సహిస్తాం. కార్యక్రమం జరుగుతున్నప్పుడు సముదాయ వేదికల నుంచి పంపివేయడం, వేధింపులకు పాల్పడుతున్నవారిని గుర్తించి సభ్యులకు, ఇతర సాధారణ పబ్లిక్‌కు వారి గురించి చెప్పడం వంటి చర్యల వరకు రెస్పాన్స్ టీం తగినవని భావిస్తే తీసుకుంటుంది.

ఈ ప్రవర్తన నియమావళిని ఫ్రెండ్లీ స్పేస్, కార్యక్రమాలను సుభ్రం చేయడం వంటి అంశాలపై వికీమీడియా పాలసీలు (పాఠ్యం క్రియేటివ్ కామన్స్ షేర్ అలైక్ కింద పంచుకోవడానికి లభ్యమవుతోంది); కమ్యూనిటీ యాంటీ-హెరాస్మెంట్ పాలసీ ఆన్ గీక్ ఫెమినిజం వికీ (క్రియేటివ్ కామన్స్ జీరో లైసెన్సులో లభ్యం) నుంచి సంకలనం చేశాం

ఇవి కూడా చూడండి

[మార్చు]