వికీపీడియా:తొలగింపు పద్ధతి

వికీపీడియా నుండి
(వికీపీడియా:Deletion discussions నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఓ పేజీని తొలగించడం, లేదా ఉంచెయ్యడం ఎలా చెయ్యాలో వివరించే పేజీ ఇది. సాధారణంగా, పేజీని తొలగించే బాధ్యత నిర్వాహకులదే. కానీ, వికీపీడియాలో మంచి దిద్దుబాటు అనుభవం కలిగిన సభ్యులు నిర్వాహకులు కానివారు చర్చను ముగించడం పేజీలోని నిబంధనలకు లోబడి చర్చలను ముగించవచ్చు. ముగింపు నిర్ణయాలను నిర్వాహకులు సమీక్షించి అవసరమైతే మళ్ళీ తెరవవచ్చు.

ఎవరైనా సరే, తాము కూడా పాల్గొన్న చర్చను తామే ముగించరాదు.

క్లుప్తంగా తొలగించే పద్ధతి

[మార్చు]

ఒక వ్యాసాన్ని గానీ, బొమ్మను గానీ, దారిమార్పును గానీ, ఇతరాలను గానీ తొలగించే పద్ధతిలో ఉండే మెట్లు ఇవి:

  1. తొలగించాలని మీరు భావించిన పేజీలో సదరు నేముస్పేసుకు సంబంధించిన మూసను పేజీ పై భాగాన ఉంచాలి. (ఉదాహరణకు, వ్యాసపు పేజీల కోసం: {{తొలగించు}} మూసను పేజీలో పెట్టాలి.)
  2. ఆ తరువాత ఆ పేజీని తొలగించాలో లేదో తేల్చేందుకు చర్చ జరగాలి. ఈ చర్చ కోసం ప్రతిపాదించిన వ్యాసం కోసం ఒక ఉపపేజీ తయారుచెయ్యాలి. ఆ పేజీ ఇలా ఉంటుంది.. [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించిన వ్యాసం]]. వ్యాసం పేజీలో పెట్టిన తొలగింపు మూస నుండి ఈ పేజీకి లింకు ఉంటుంది. ఇక్కడ తొలగింపు విషయమై సభ్యులు తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తారు.
  3. తరువాత ఈ పేజీని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి. ఇలా: {{వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించిన వ్యాసం}}
  4. సభ్యుల అభిప్రాయాల కోసం తగు సమయం ఇచ్చిన తరువాత, ఆ అభిప్రాయాలను క్రోడీకరించి, చర్చను ముగిస్తారు. ఈ ముగింపులోనే చర్చ పర్యవసానాన్ని కూడా నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం తొలగించు, ఉంచు, దారిమార్చు, విలీనం చెయ్యి వగైరా నిర్ణయాల్లో ఏదైనా కావచ్చు. చర్చ ముగింపును నిర్వాహకులు గానీ, అనుభవజ్ఞులైన సీనియరు సభ్యులు గానీ చేస్తారు. చర్చ ముగిసిన విషయం స్పష్టంగా తెలిసేలా రెండు మూసలను చేర్చి, పేజీ నేపథ్యం రంగును మారుస్తారు. ఒకసారి చర్చను ముగించాక, ఇక అక్కడ సభ్యులు ఏమీ రాయరాదు.
  5. చర్చ నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యను తీసుకుంటారు. నిర్ణయం తొలగించడమే అయితే, దాన్ని నిర్వాహకులు అమలు చేస్తారు; తొలగించే అనుమతులు వారికే ఉంటాయి మరి.

త్వరిత తొలగింపు

[మార్చు]
  1. త్వరిత తొలగింపు చెయ్యాల్సిన పరిస్థితి నెలకొందో లేదో నిర్ధారించండి.
  2. తొలగింపు కారణం ఫీల్డులో ఒక వ్యాఖ్య రాసి ఆపై తొలగించండి. (ఈ వ్యాఖ్య తొలగింపు లాగ్ లో చేరుతుంది.)
    • ఖచ్చితమైన త్వరిత తొలగింపు కారణాన్ని వ్యాఖ్యలో రాయడం ఎంతో మంచిది.
    • తొలగింపు కారణంగా, పేజీలోని పాఠ్యాన్నే రాయడం కొన్నిసార్లు ఉపయోగపడుతుంది. దాడులు, దుశ్చర్యల పేజీల విషయంలో, దుష్ట పాఠ్యాన్ని వ్యాఖ్యల్లో రానివ్వకండి.

తొలగింపు కొరకు వ్యాసాలు పేజీ

[మార్చు]

ప్రతీ రోజూ, ఐదు కంటే ఎక్కువ రోజుల నాటి (i.e. [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/లాగ్/సం నెల రోజు]]) పేజీని ఇక్కడకు తరలించాలి. పేజీని ఉంచాలా తొలగించాలా అనే నిర్ణయాన్ని పేజీని ఇక్కడికి తరలించాకే అమలు చెయ్యాలి.

పద్ధతి

[మార్చు]

తొలగింపు చర్చ, చర్చాపేజీలో సరిపడినన్ని రోజులు ఉన్న తరువాత చర్చను ముగించేటపుడు పాటించవలసిన పద్ధతి ఇది:

  1. చర్చను పరిశీలించి, ముగింపు పలికేందుకు చాలా సమయం పట్టేట్టైతే, ముందు ఉపపేజీలో పైన {{ముగిస్తున్నాం}} మూసను పెట్టండి. దీనివలన మీరు ముగింపు చేస్తూ ఉండగా మరొకరు దిదుబాటు చేసి దిద్దుబాటు ఘర్షణ తలెత్తకుండా ఉంటుంది.
  2. చర్చపై ఆధారపడి, మార్గదర్శకాలు వాడి వ్యాసాన్ని ఉంచాలో తొలగించాలో, సంబంధిత చర్చ, ఉప పేజీలను తొలగించాలో లేదో నిర్ణయించండి.
  3. {{ముగిస్తున్నాం}} మూసను చేర్చి ఉంటే దాన్ని తీసెయ్యండి.
  4. చర్చా ఉపపేజీలో పైన అడుగున కింది పాఠ్యాన్ని చేర్చండి. (ఈ రెండూ కలిసి చర్చ ముగిసినట్టు సూచిస్తూ, దాని చుట్టూ ఒక ఒక మసక పెట్టెను సృష్టిస్తాయి. (కింది ఉదాహరణ చూడండి.) శీర్షం మూస, ముగింపు ఫలితం పై విభాగపు శీర్షానికి పైకి చేరతాయి, దాని కిందకు కాదు.
    • పైన:
      {{subst:వ్యాతొలపైన}} '''ఫలితం'''. ~~~~
    • అడుగున:
      {{subst:వ్యాతొలకింద}}
  5. నిర్ణయం తొలగించడమే అయితే, వ్యాసాన్ని తొలగించండి. (ఇది ఆటోమాటిగ్గా తొలగింపు లాగ్ లో నమోదవుతుంది.) "తొలగింపుకు కారణం" పెట్టెలో చర్చకు లింకు ఇవ్వడం మరువకండి. (అంటే [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వ్యాసం]] అని రాయాలి). సముచితమైతే వ్యాసపు చర్చాపేజీని, సంబంధిత ఉపపేజీలను కూడా తొలగించండి. "ఇక్కడికి లింకున్న పేజీలు" లింకును నొక్కి దారి మార్పులు ఏమైనా ఉంటే తొలగించండి. ఆ శీర్షికతో వ్యాసమనేది ఉండకూడని పక్షంలో, దానికున్న అన్ని లింకులను తీసెయ్యండి. అయితే, వ్యాసానికి దాని తొలగింపు ప్రతిపాదనకు ఉన్న లింకును మాత్రం తీసెయ్యరాదు.
  6. నిర్ణయం 'ఉంచెయ్యడం అయితే, (విస్తృత ఏకాభిప్రాయం లేదు, దారిమార్పు, విలీనం వంటివైనా సరే), వ్యాసంలోని తొలగింపు మూసను తీసేసి, వ్యాసపు చర్చాపేజీలో తొలగింపు చర్చ ఉపపేజీకి లింకును పెట్టండి.
    • పేజీ దారిమార్పుగా మారితే, మెలికెల దారి మార్పులు లేకుండా చూడండి.
    • చర్చ విస్తృత ఏకాభిప్రాయానికి రాకపోతే, మామూలుగానైతే వ్యాసాన్ని ఉంచాలి. భవిష్యత్తులో అయోమయం లేకుండా ఉండేందుకుగాను, నిర్ణయంతోపాటు ఈ విషయాన్ని సూచించాలి.

వ్యాసం ఉదాహరణ

[మార్చు]

చర్చను ముగించాక, పేజీ ఇలా కనబడుతుంది:


గమనిక: ఈ పద్ధతంతటినీ ఆటోమాటిగ్గా జరిపే ఉపకరణాలు ప్రస్తుతం తెవికీలో లేవు.

చర్చ కొరకు వర్గాలు పేజీ

[మార్చు]

వర్గాన్ని ఉంచాలో తీసెయ్యాలో అనే నిర్ణయాన్ని అమలు జరిపడం, చర్చను ముగించిన తరువాతే చెయ్యాలి.

  1. చర్చను పరిశీలించి, ముగింపు పలికేందుకు చాలా సమయం పట్టేట్టైతే, ముందు ఉపపేజీలో పైన {{ముగిస్తున్నాం}} మూసను పెట్టండి. దీనివలన మీరు ముగింపు చేస్తూ ఉండగా మరొకరు దిదుబాటు చేసి, దిద్దుబాటు ఘర్షణ తలెత్తకుండా ఉంటుంది.
  2. తొలగింపుకు లేదా పేరుమార్పుకు ఓ స్థూల విస్తృతాభిప్రాయం వచ్చిందో లేదో పరిశీలించండి. చూడండి: నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు.
  3. వర్గ విభాగపు శీర్షం తరువాత, కింది విషయాన్ని చేర్చండి:
    {{వర్గచర్చపైన}} '''ఫలితం'''. ~~~~
    (సాధారణంగా ఫలితం అంటే తొలగించు లేదా ఉంచు అయి ఉంటుంది.)
  4. {{ముగిస్తున్నాం}} మూసను చేర్చి ఉంటే, దాన్ని తొలగించండి.
  5. వర్గపు విభాగం చివర, తరువాతి వర్గ విభాగపు శీర్షం పైన, కింది విషయాన్ని చేర్చండి:
    {{వర్గచర్చకింద}}
  6. నిర్ణయం ఉంచు అయితే, ("దారిమార్చు" లేదా "విస్తృతాభిప్రాయం రాలేదు" అయినప్పుడు కూడా ):
    1. వర్గపు చర్చాపేజీలో చర్చా ఉపపేజీకి లింకు ఇవ్వండి.
      • చర్చ ఒక విస్తృత ఏకాభిప్రాయానికి రాకపోతే, వర్గం ఉంచాలనేదే డిఫాల్టు నిర్ణయం. కానీ ఈ నిర్ణయంతోపాటే విస్తృత ఏకాభిప్రాయం రాకపోవడాన్ని కూడా ఉదహరించాలి. దీనివలన భవిష్యత్తులో అయోమయం తలెత్తకుండా ఉంటుంది.
    2. {{cfd}} లేదా ఇతర మూసను తొలగించండి.
    3. పేజీ దారిమార్పుగా మారితే, మెలికెల దారి మార్పులు లేకుండా చూడండి.
  7. నిర్ణయం తొలగించు, విలీనం చెయ్యి, లేదా దారి మార్చు అయితే:
    1. దాన్ని వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు పేజీలో, సముచిత విభాగంలో చేర్చండి.
    2. వర్గపు పేరు మార్చేందుకు, ప్రవేశికలోని పాఠ్యాన్ని కాపీ చేసి, కొత్త వర్గపు పేజీకి చేర్చండి. వర్గానికి చర్చాపేజీ ఉంటే దాన్ని కూడా కొత్త పేరుకి తరలించవచ్చు. ప్రవేశిక పాథ్యానికి సంబంధించి చెప్పుకోదగ్గ చరితం ఉంటే దాన్ని కొత్త చర్చాపేజీ చరితంలో అతికించాలి.
    3. వ్యాసాల్లోను, ఇతర పేజీల్లోను ఈ వర్గానికి సంబంధించిన అన్ని రిఫరెన్సులను కొత్త పేజీకి మార్చాలి. లేదా తీసెయ్యాలి. దీని కోసం బాట్లు ఉన్నాయి.
    4. వర్గానికి ఉన్న అన్ని రిఫరెన్సులనూ తీసేసాక, ఆ వర్గాన్ని నిర్వాహకులు తీసివెయ్యవచ్చు.
  8. వర్గాలకు పేర్లు పెట్టే విధానంలో మార్పుచేర్పులు చెయ్యాలనే ప్రతిపాదనకు కూడా విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడితే సదరు మార్పులు కూడా చెయ్యండి..

ఇది చర్చను ముగించే వాడుకరి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయంతో మీరు విభేదిస్తే, దాన్ని ఆ వాడుకరితో చర్చించండి.

శీర్షం, పాదాల పాఠ్యం

[మార్చు]

చర్చను ముగించాక, పేజీ ఇలా కనిపిస్తుంది:

తొలగింపు కొరకు మూసలు పేజీ

[మార్చు]

మూసను ఉంచాలో తీసెయ్యాలో అనే నిర్ణయాన్ని అమలు జరిపడం, చర్చను ముగించిన తరువాతే చెయ్యాలి.

  1. చర్చను పరిశీలించి, ముగింపు పలికేందుకు చాలా సమయం పట్టేట్టైతే, ముందు ఉపపేజీలో పైన {{ముగిస్తున్నాం}} మూసను పెట్టండి. దీనివలన మీరు ముగింపు చేస్తూ ఉండగా మరొకరు దిదుబాటు చేసి, దిద్దుబాటు ఘర్షణ తలెత్తకుండా ఉంటుంది.
  2. తొలగింపుకు లేదా పేరుమార్పుకు ఓ స్థూల విస్తృతాభిప్రాయం వచ్చిందో లేదో పరిశీలించండి. చూడండి: [[వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు.
  3. మూస విభాగపు శీర్షం తరువాత, కింది విషయాన్ని చేర్చండి:
    {{tfd top}} '''ఫలితం'''. ~~~~
    (సాధారణంగా ఫలితం అంటే తొలగించు లేదా ఉంచు అయి ఉంటుంది.)
  4. {{ముగిస్తున్నాం}} మూసను చేర్చి ఉంటే, దాన్ని తొలగించండి.
  5. మూస విభాగం చివర, తరువాతి వర్గ విభాగపు శీర్షం పైన, కింది విషయాన్ని చేర్చండి:
    {{tfd bottom}}
  6. నిర్ణయం ఉంచు అయితే, ("దారిమార్చు" లేదా "విస్తృతాభిప్రాయం రాలేదు" అయినప్పుడు కూడా ):
    1. మూస చర్చాపేజీలో చర్చా ఉపపేజీకి లింకు ఇవ్వండి.
      • చర్చ ఒక విస్తృత ఏకాభిప్రాయానికి రాకపోతే, మూస ఉంచాలనేదే డిఫాల్టు నిర్ణయం. కానీ ఈ నిర్ణయంతోపాటే విస్తృత ఏకాభిప్రాయం రాకపోవడాన్ని కూడా ఉదహరించాలి. దీనివలన భవిష్యత్తులో అయోమయం తలెత్తకుండా ఉంటుంది.
    2. {{tfd}} లేదా ఇతర మూసను తొలగించండి.
    3. పేజీ దారిమార్పుగా మారితే, మెలికెల దారి మార్పులు లేకుండా చూడండి.
  7. నిర్ణయం తొలగించడమే అయితే, దాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు మూసలు/Holding cell పేజీలో సముచిత విభాగంలో చేర్చండి. మూసను వాడిన అన్ని పేజీల నుండి దాని లింకును తీసివేసాక, నిర్వాహకులు మూసను తొలగించవచ్చు.
  8. కోరం అంటూ ఏమీ లేదు. వ్యవధి పూర్తయిన తరువాత, అభ్యంతరాలేమీ లేకపోతే, మూసను తొలగించవచ్చు.
  9. మూసకు చెందిన వర్గం ఉండి, దాన్ని వేరే వాటి కోసం వాడి ఉండకపోతే, దాన్నీ తొలగించవచ్చు.

ఇది చర్చను ముగించే వాడుకరి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయంతో మీరు విభేదిస్తే, దాన్ని ఆ వాడుకరితో చర్చించండి.

శీర్షం, పాదాల పాఠ్యం

[మార్చు]

చర్చను ముగించాక, పేజీ ఇలా కనిపిస్తుంది:

నిర్వాహకులు కానివారు చర్చను ముగించడం

[మార్చు]

సాధారణంగా తొలగింపు చర్చల ముగింపు బాధ్యత నిర్వాహకులదే. అయితే, నిర్వాహులు తీరికలేకుండా ఉన్న సందర్భాల్లో అనుభవజ్ఞులైన సభ్యులు కింది సందర్భాల్లో ఈ పని చెయ్యవచ్చు:

  • నిర్వాహకులు కానివారికి తొలగించే అనుమతులు ఉండవు కాబట్టి, "తొలగించు" నిర్ణయాలు, అవి సర్వామోదంతో తీసుకున్నవైనప్పటికీ, ఉన్న చర్చలను ముగించరాదు.
  • ఏదైనా సందర్భంలో నిర్వాహకుడు చర్చను ముగించడం మరచి, పేజీని తొలగించేస్తే, సదరు చర్చను ముగించేటపుడు ఆ నిర్వాహకుని పేరును ముగిఒంపు సారాంశంలో ఉదహరించాలి.
  • మీరు దిద్దుబాట్లు చేసి, తొలగింపు చర్చలో మీ అభిప్రాయాన్ని వినిపించినపుడు సదరు చర్చను మీరు ముగించరాదు. ఒకవేళ ఆ తొలగింపును మీరే ప్రతిపాదించి ఉంటే, ఆ ప్రతిపాదనను ఉపసంహరించదలిస్తే, చర్చలో పాల్గొన్న ఇతర సభ్యుల అందరి అభిప్రాయమూ అదే అయితే అలాంటి సందర్భంలో మీరు ఆ చర్చను ముగించవచ్చు.

నిర్వాహకులు కానివారు చర్చను ముగించేటపుడు నిర్ణయంలో తమ సభ్యత్వ స్థాయిని తెలియజేయాలి. నిర్వాహకులు నిర్ణయాలను సమీక్షించి, వాటిని తిరిగి తెరవవచ్చు.

నిర్వాహకులు కానివారు వర్గాల చర్చను ముగించడం

[మార్చు]

వర్గాల తొలగింపు, విలీనం, పేరుమార్పు వంటి నిర్ణయాలను అమలుచేసేందుకు నిర్వాహక అనుమతులు ఉండాలి కాబట్టి, సదరు నిర్ణయాలను తీసికోవలసిన సందర్భాల్లో అలాంటి వర్గాల చర్చలను నిర్వాహకులు కానివారు ముగించరాదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]