వికీపీడియా:యూజర్ స్క్రిప్టులు

వికీపీడియా నుండి
(వికీపీడియా:User scripts నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

యూజర్ స్క్రిప్టులు వికీపీడియాలో దిద్దుబాట్లు చేయడాన్ని సులభతరం చేయడానికి జావాస్క్రిప్ట్‌లో వ్రాసిన ప్రోగ్రాములు. వాడుకరి ఖాతాలు మామూలుగా చేయలేని పనులు చేయడానికి యూజర్ స్క్రిప్టులు వీలు కలిగిస్తాయి. ఇంగ్లీషు వికీపీడియాలో అనేక యూజర్ స్క్రిప్టులు స్థాపించుకుని వాడుకోడానికి సిద్ధంగా అందుబాటులో ఉన్నాయి. అలాగే, తగు సాంకేతిక సామర్థ్యం ఉన్నవారు కొత్త యూజర్ స్క్రిప్టును రాయవచ్చు. ఇప్పటికే ఉన్న స్క్రిప్ట్‌ను తగుమార్పులు చేసుకుని గానీ, లేదా మొదటి నుండి ప్రారంభించి గానీ యూజర్ స్క్రిప్టును రాయవచ్చు.

భద్రత గురించి ఒక మాట

[మార్చు]

యూజర్ స్క్రిప్టులకు, వాటి స్వభావాన్ని బట్టి, వాడుకరి ఖాతాకు అపరిమితమైన యాక్సెస్ ఉంటుంది. హగుల్ వంటి OAuth / bot పాస్‌వర్డ్ ఆధారిత అప్లికేషన్‌లలో యాక్సెస్ స్థాయిలను నియంత్రించవచ్చు. కానీ యూజర్ స్క్రిప్టు బ్రౌజర్‌లో నడుస్తుంది. ఓ వాడుకరి వికీపీడియాలో ఏఏమి చేయగలరో, అవన్నీ యూజర్ స్క్రిప్టు కూడా చేసే వీలు ఉంటుంది. ప్రత్యేకించి, ఉన్నతమైన అనుమతులు కలిగిన వాడుకరులు యూజర్ స్క్రిప్టును వాడేటపుడు, ఆ స్క్రిప్టు రాసిన వాడుకరి విశ్వసనీయమైనవారేనని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే మీ తరపున అది చేసే ఏ పనులకైనా మీరే బాధ్యత వహించాలి. మీరు స్క్రిప్ట్‌ను "దిగుమతి" చేస్తుంటే (కోడ్‌ను కాపీ చేయడానికి బదులుగా) మీరు దిగుమతి చేస్తున్న వాడుకరి ఎప్పుడైనా తమ స్క్రిప్ట్‌ను మార్చవచ్చని గమనించండి. మీరు విశ్వసించే వాడుకరుల నుండి మాత్రమే స్క్రిప్టులను దిగుమతి చేసుకోండి.

యూజర్ స్క్రిప్టుల జాబితా

[మార్చు]

ఉపయోగకరంగా ఉందని భావించిన యూజర్ స్క్రిప్టు చూసినా లేదా మీరే స్వయంగా కొత్త యూజర్ స్క్రిప్టు రాసినా, దాన్ని వికీపీడియా:యూజర్ స్క్రిప్టులు/జాబితా లో చేర్చండి.

పై పేజీలో మీకు కావలసినది కనబడలేదా? వికీపీడియా:యూజర్ స్క్రిప్టులు/అభ్యర్థనలు వద్ద కొత్త యూజర్ స్క్రిప్టు కోసం అభ్యర్థన చేయవచ్చు.

స్క్రిప్టులను ఉపయోగించడం: తరచుగా అడిగే ప్రశ్నలు

[మార్చు]

యూజర్ స్క్రిప్టులు ఎక్కడుంటాయి?

[మార్చు]

ఇంగ్లీషు వికీపీడీయా లోని పేజీలలో యూజర్ స్క్రిప్టులను చూడవచ్చు:

యూజర్ స్క్రిప్టులను స్థాపించుకోవడం ఎలా?

[మార్చు]

ఆటోమాటిక్ స్థాపన

[మార్చు]

ప్రస్తుతం ఈ సౌకర్యం తెలుగు వికీపీడియాలో లేదు.

మానవికంగా స్థాపించుకోవడం

[మార్చు]
  1. ముందుగా, లాగినవండి. లాగిన్ అయిన వినియోగదారులు మాత్రమే యూజర్ స్క్రిప్టులను స్థాపించుకోగలరు.
  2. మీ common.js ఫైల్‌ని సవరించడానికి ఇక్కడ క్లిక్ చేయండి .
  3. కింది పంక్తిని జోడించండి: {{subst:Lusc|script_path}} – "script_path" స్థానంలో స్క్రిప్టుకు చెందిన .js పేజీ పూర్తి పేరు ఇవ్వండి. Load user script (Lusc) అనే మూస, బ్యాక్‌లింక్‌తో పాటు అవసరమైన mw.loader.load అనే లైన్‌ను కూడా చేరుస్తుంది.
    • ఉదాహరణకు, షేర్‌బాక్స్ స్క్రిప్ట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, ఈ పంక్తిని జోడించాలి: {{subst:Lusc|User:TheDJ/sharebox.js}}
  4. పేజీని భద్రపరచండి. మార్పులు ప్రభావం చూపడానికి మీ కాష్‌ని దాటవేయండి.

రిమోట్ స్క్రిప్ట్‌లు

[మార్చు]
  1. ముందుగా, లాగినవండి. లాగిన్ అయిన వినియోగదారులు మాత్రమే స్క్రిప్ట్‌లను స్థాపించుకోగలరు.
  2. మీ common.js ఫైల్‌ని సవరించండి. ప్రత్యామ్నాయంగా, మీరు మీ ప్రస్తుత రూపులో మాత్రమే పని చేయడానికి మీ skin.jsని ఉపయోగించవచ్చు .
  3. ఈ పంక్తిని జోడించండి: mw.loader.load( '//en.wikipedia.org/wiki/script_path?action=raw&ctype=text/javascript' );
    — ఇక్కడ "script_path" అంటే సంబంధిత .js పేజీ పూర్తి పేరు.
    • ఉదాహరణకు, NoEditSummary స్క్రిప్ట్‌ను స్థాపించుకోడానికి, కింది పంక్తిని జోడించాలి:
      mw.loader.load( '//en.wikipedia.org/wiki/User:GhostInTheMachine/NoEditSummary.js?action=raw&ctype=text/javascript' );
  4. పేజీని సేవ్ చేయండి. మార్పులు ప్రభావం చూపడానికి మీ కాష్‌ని దాటవేయండి.