Jump to content

వికీపీడియా:యూజర్ స్క్రిప్టులు/అభ్యర్థనలు

వికీపీడియా నుండి

ఏదైనా ప్రత్యేక పని కోసం యూజర్ స్క్రిప్టు కావాలని అభ్యర్థించే పనైతే ఈ పేజీలో మీ అభ్యర్థనను రాయవచ్చు. ఆ పనిచేసే యూజర్ స్క్రిప్టు వికీపీడియా:యూజర్ స్క్రిప్టులు/జాబితా పేజీలో గానీ, ఎన్వికీ లోని en:Wikipedia:User scripts/List పేజీలో గానీ లేదని నిర్థారించుకున్నాకే ఇక్కడ అభ్యర్థించండి.

2024 జూలై 30 నాటి అభ్యర్థనలు

[మార్చు]
  1. వన్-క్లిక్-ఇన్‌స్టాల్ లింకు కావాలి: యూజర్‌స్క్రిప్టును వాడుకోవాలంటే మన common.js లో స్థాపించుకోవాల్సి ఉంటుంది. సాంకేతికత గురించి అంతగా తెలీనివారికి స్థాపించుకోవడం కష్టంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్వికీలో ఇన్‌స్టాల్ అనే ఒక లింకును పెట్టారు. ఆ లింకును నొక్కితే అది ఇన్‌స్టాలైపోతుంది. ఈ ఇన్‌స్టాల్ అనే లింకు ప్రతి యూజర్ స్క్రిప్టు పేజీలోనూ శీర్షిక పక్కనే ఉంటుంది. ఇది వాడుకరులకు ఎంతో వీలుగా ఉంది. మనకూ అలా ఒక్క నొక్కుతో స్క్రిప్టును స్థాపించుకునే సౌకర్యం, వద్దనుకుంటే మరో క్లిక్కుతో తీసేసుకునే సౌకర్యం ఉండాలి. దానివలన, చాలామందికి ప్రయోజనం చేకూరుతుంది. దీనికి గాను ఎన్వికీలో ఉన్న en:User:Equazcion/ScriptInstaller.js ను కాపీ చేసి తెచ్చి మనకు తగ్గట్టుగా మార్చుకుంటే సింపులుగా అయిపోవచ్చు.
ఒకవేళ అది కుదరని పక్షంలో ఎన్వికీ లోని యూజర్‌స్క్రిప్టుల జావాస్క్రిప్టును కాపీచేసి ఇక్కడ పేస్టు చేసుకోవడంలో ఎదురయ్యే కింది రెండు సమస్యలను పరిష్కరించాలి
  1. యూజర్ స్క్రిప్టును స్థాపించుకోడానికి ఇచ్చే జావాస్క్రిప్టులో పాత్ పూర్తిగ ఇవ్వరు, రిలెటివ్ పాత్ ఇస్తారు. మనం ఆ పాత్‌కు ముందు "https://en.wikipedia.org/wiki/" అనో "https://en.wikipedia.org/w/" అనో చేర్చాల్సి ఉంటుంది. మన common.js పేజీలో ఇలా చేర్చడంలో చాలా ఇబ్బంది ఉంది. ఆ సమస్యను నివారిస్తూ చిన్న సాఫ్టువేరు ప్రోగ్రాము రాయాలి
  2. కొన్ని స్క్రిప్టులను {{Load user script}} అనే మూస ద్వారా చేరుస్తాం. ఈ మూసను సబ్‌స్టిట్యూట్ చేసినపుడు, "User:" అనే పేరుబరిని "వాడుకరి:" అనే పేరుబరిగా మారుస్తుంది (తెవికీలో వాడుతున్నాం కాబట్టి) . కానీ అది లింకు చెయ్యాల్సింది, ఎన్వికీలో. అక్కడ "వాడుకరి:" అంటే ఏంటో తెలీదు కాబట్టి స్క్రిప్టు పనిచెయ్యదిఉ. ఈ సమస్యను పరిష్కరించాలి.
శక్తీ, ఆసక్తీ ఉన్న వారు ఈ విషయంపై దృష్టి పెట్టవలసినగా కోరుతున్నాను.__చదువరి (చర్చరచనలు) 14:33, 30 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]