Jump to content

వికీపీడియా:వాడుకరిపేరు

వికీపీడియా నుండి
(వికీపీడియా:Username policy నుండి దారిమార్పు చెందింది)

ఇవి కూడా చూడండి: వికీపీడియా:లాగిన్‌ అవడం ఎలా, వాడుకరిపేరు మార్చుట, వికీపీడియా:అకౌంటు తొలగింపు

మీరు వికీపీడియాలో లాగిన్ కావడానికి కొత్త అకౌంటు సృష్టించుకోవాలంటే, ఒక వాడుకరిపేరును (username) ఎంపిక చేసుకోవాలి. ఈ పేజీ మీకు దాని గురించి కొన్ని సలహాలు ఇస్తుంది.

వాడుకరిపేరును దేనికి ఉపయోగిస్తారు?

[మార్చు]

లాగిన్ అయి ఉంటే, మీరు చేసే దిద్దుబాట్లు మీ వాడుకరిపేరుకు చెందుతాయి. జవాబుదారీతనం దీనికొక కారణం. కాపీహక్కుల విషయంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. వికీపీడియా కాపీహక్కులకు వ్యతిరేకంగా మీ రచనలను వాడుకోదలస్తే, వాళ్ళు మీ చర్చాపేజీలో మీ అనుమతి అడిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, తమ రచనల శ్రేయస్సును రచయితలకే ఇవ్వడాన్ని GFDL ప్రోత్సహిస్తుంది. ఆ సందర్భంలో మీ వాడుకరిపేరుకే ఆ శ్రేయస్సు చెందుతుంది.

మీ వాడుకరిపేరును మార్చుకునే వీలుంది. వికీపీడియా:వాడుకరిపేరు మార్పు చూడండి.

ఏదో బలమైన కారణం ఉంటే తప్ప అనేక వాడుకరిపేర్లను వాడటాన్ని మేము వ్యతిరేకిస్తాము.

వాడుకరిపేరును ఎంపిక చేసుకొనుట

[మార్చు]

సర్వోత్తమమైన వాడుకరిపేరు, మీ అసలుపేరే! లేదా ఇంటర్నెట్లో చాన్నాళ్ళుగా వాడుతున్న మీ ముద్దుపేరు! మీరు ఎంచుకునే వాడుకరిపేరు ఆ పేరు పెట్టుకున్న మీకూ, మీతో కలిసి పనిచేసే ఇతర వికీపీడియనులకూ కూడా సౌకర్యంగా ఉండేటట్లు చూసుకోండి.

ఏదైనా వివాదాస్పదమైన పేరు పెట్టుకుంటే వాడుకరులకు మీపై సరైన అభిప్రాయం ఏర్పడకపోయే అవకాశం ఉంది. వికీపీడియాలో వివిధ మతాలు, కులాలు, వర్గాలకు చెందిన వాడుకరులు పనిచేస్తూ ఉంటారు కాబట్టి, మీరు ఎంచుకునే వాడుకరిపేరు వారెవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండరాదు.

కింది పేర్లతో వాడుకరిపేర్లను ఎంచుకోకూడదని వికీపీడియా భావిస్తుంది.

  1. రాజకీయ నాయకులు, సైనికాధికారులు, మత నాయకుల పేర్లు, మత సంబంధమైన ఘటనలు
  2. ప్రజా జీవితంలోని వ్యక్తుల విధానాలు, రాజకీయ దృక్కోణం మొదలైన వాటికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో ఉండే పేర్లు.

మీ రచనలను బట్టి మాత్రమే ప్రజలు మిమ్మల్ని అంచనా వెయ్యగలగాలి, మీరు ఎంచుకునే వాడుకరిపేరును బట్టి కాదు. మీ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివాదాస్పద పేర్లకు దూరంగా ఉండండి. ఇక్కడ మీరొక సామాజిక కార్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇతరులు మిమ్మల్నెలా గౌరవించాలని అనుకుంటున్నారో, అదే మర్యాదను మీరు ఇతరులకు చూపండి.

అసలు పేర్లు x మిధ్యానామాలు

[మార్చు]

అసలు పేర్లతో రచనలు చేస్తే రచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో అసలుపేర్లనే వికీలు ప్రోత్సహిస్తూ ఉంటాయి. అయితే అసలుపేర్లు పెట్టుకోవాలనేది సూచనే కానీ డిమాండు కాదు. కాపీహక్కుల కాలపరిమితి విషయంలో మిధ్యానామాల కంటే అసలు పేర్లకే ఎక్కువ హక్కులు ఉంటాయి.

ప్రముఖుల (జీవించి ఉన్న లేక ఇటీవలే మరణించిన వారు) పేర్లను వాడుకరిపేర్లుగా వాడకండి. ఇతర వాడుకరులు దాన్ని మరీ అతిగా భావించి దాన్ని మార్చుకొమ్మని కోరే అవకాశం ఉంది. అలా ప్రముఖుల పేర్లను పెట్టుకుని, అనుచితమైన పనులు చేస్తే "అనుచితమైన పేర్లు" విభాగంలో సూచించిన చర్యలకు దారితీసే అవకాశం ఉంది.

పేర్లు ఇంగ్లీషులో పెట్టుకుంటే

[మార్చు]

మీ వాడుకరిపేరును ఇంగ్లీషులో పెట్టుకుంటే మొదటి అక్షరం కాపిటలుగా ఉంచండి. అలా చెయ్యకున్నా వికీపీడియా దాన్ని కాపిటలు చేస్తుంది. ఉదాహరణకు మీరు prasad అనే పేరు ఎంచుకున్నా, వికీ దాన్ని Prasad అని మారుస్తుంది.

అనుచితమైన పేర్లు

[మార్చు]

కొన్ని పేర్లను వికీపీడియా అనుమతించదు. వాటిలో కొన్ని:

కావాలని గందరగోళపరచే పేర్లు కూడదు: ఇతర వాడుకరులను, లేదా సాఫ్టువేరును తికమక పెట్టే పేర్లు. మీరు వాడదలచిన ముద్దుపేరు వేరొకరు ఇప్పటికే వాడుతుంటే, మీ అసలుపేరునో లేక మరో ముద్దుపేరునో ఎంచుకోండి. ఒకవేళ మీ అసలుపేరును ఇప్పటికే వేరొకరు వాడుతూ ఉంటే, దానికి మీ ఇంటి పేరును చేర్చిగాని, లేక మరో రకంగా గానీ సదరు పేరుకు భిన్నంగా ఉండేలా ఎంచుకోండి. ఇటీవలి మార్పులు, recent changes, అధికారి, నిర్వాహకుడు, Administrator వంటి వికీపీడియాలో సామాన్యంగా వాడే పేర్లు ఎంచుకోకండి. ఇతర వాడుకరులను అనుకరించే పేర్లను ఎంచుకున్నందుకు గాను వాడుకరులను నిరోధించిన సందర్భాలు ఇంగ్లీషు వికీపీడియాలో ఉన్నాయి.

రెచ్చగొట్టే పేర్లు కూడదు: రెచ్చగొట్టే పేర్లను వికీపీడియా అనుమతించదు. అలాంటి పేర్లు ఇతర వాడుకరులను నిరుత్సాహపరచి, వారి దృష్టిని మళ్ళించి విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచేసే అసలు పని కుంటుపడే ప్రమాదం ఉంది. అలాంటివి కొన్ని:

  • జాతి, కుల, మత దురభిమానాలను రెచ్చగొట్టే పేర్లు
  • జాతి, కుల, మత పరమైన నిందలు వేసే పేర్లు
  • జాతి, కుల, మత దురభిమానాల చిహ్నాలను తెలియజేసే పేర్లు
  • లైంగిక కార్యాలు, జననాంగాల పేర్లు
  • హింసను ఎత్తిచూపే పేర్లు
  • బూతు పేర్లు

వేధించే, అప్రదిష్ట పాల్జేసే పేర్లు కూడదు: వేధించడం, అప్రదిష్ట పాల్జేయడం వికీపీడియాలో అనుచితం. పైగా, మీ వాడుకరిపేరు మీతో ఏకీభవించని వారిపై దాడి చేసేందుకు పనికొచ్చే ఆయుధమేమీ కాదు. ఇతర వాడుకరులను, వాడుకరిపేర్లను, వ్యాసాలను, చర్యలను కించపర్చేలా, ఎగతాళి చేసేలా మీ వాడుకరిపేరు ఉండరాదు. వ్యక్తులను, సంస్థలను - వారు వికీలో రాసేవారైనా, కాకున్నా - అప్రదిష్ట పాల్జేసేలా ఉండరాదు.

మంచో, చెడో.. ఓ వాడుకరిపేరు సరైనదో కాదో నిర్ణయించేది దాన్ని అనుచితమని భావించే వారే గానీ, ఆ వాడుకరిపేరు ఎంచుకున్నవారు మాత్రం కాదు.

అసలెందుకు

[మార్చు]

వాడుకరిపేర్ల ముఖ్యోద్దేశం వివిధ వాడుకరును గుర్తించడం కోసమే. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోడానికీ, రికార్డు చేసి ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. వాడుకరిపేరు ఏదో దాడి చెయ్యడానికో లేక ప్రకటనలు చెయ్యడానికో ఉద్దేశించింది కాదు. ఫలానా వాడుకరిపేరు మీద ఫలానా వారికి హక్కంటూ ఏమీ లేదు. కొత్తగా, ఆసక్తికరంగా, సందేశాత్మకంగా ఉండే పేర్లు బాగుంటాయి, కానీ పేరు అలానే ఉండాలని రూలేమీ లేదు.

సంతకాలు

[మార్చు]

మీ వాడుకరిపేరు కాకుండా ఓ ముద్దుపేరును కూడా అభిరుచుల ద్వారా మీరు ఎంచుకోవచ్చు. మీరు సంతకం పెట్టినపుడు ఆ ముద్దుపేరే కనిపిస్తుంది. సంతకాలకు కూడా వాడుకరిపేర్ల నియమాలే వర్తిస్తాయి.

అనుచితమైన వాడుకరిపేర్లను మార్చడం

[మార్చు]

మీ వాడుకరిపేరు గురించి ఎక్కువమంది ఫిర్యాదు చేస్తే (చర్చా పేజీల ద్వారా గానీ, మెయిలింగు జాబితాల ద్వారాగానీ లేదా మెటా-వికీపీడియా ద్వారా గానీ), అధికారులు దాన్ని మారుస్తారు. ఫిర్యాదులు గానీ, పేరు మార్పులు గానీ ఏకపక్షం కాదు. చాలా మంది వాడుకరులకు రెచ్చగొట్టేదిగా తోచిన పేర్లను మారుస్తారు. ముందు చెప్పే ఈ మార్పు చేస్తారు. అయితే, మార్చాక ఇక అప్పీలు లేదు.

మార్పు తప్పని పక్షంలో, ముందు చర్చిస్తారు. ఈ చర్చ (అ) వాడుకరి చర్చా పేజీలోగానీ, (ఆ) వాడుకరి చర్చాపేజీకి ఒక ఉప పేజీని సృష్టించి అందులోగానీ, లేదా (ఇ) వికీపీడియా:వ్యాఖ్యల కొరకు అభ్యర్ధన యొక్క ఉప పేజీలోగానీ జరగవచ్చు. దాన్ని వికీపీడియా:వ్యాఖ్యల కొరకు అభ్యర్ధన పేజీలో ఉచితమైన చోట ఉంచాలి. వాడుకరికి ఈ చర్చ గురించి తెలియపరచాలి.

వివాదాస్పదం కాని కేసుల్లో, వాడుకరి చురుగ్గా రచనలు చేస్తూ ఉంటే, ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకోవచ్చు. వివాదాస్పదం అయిన కేసుల్లో, వాడుకరి అంత చురుగ్గా రచనలు చేస్తూ ఉండని పక్షంలో, ఒక వారం సరిపోతుంది. బాగా వివాదాస్పదం అయిన కేసుల్లో, లేదా వాడుకరి వికీపీడియాను వదలిపెట్టి వెళ్ళిపోయినపుడు గానీ, చర్చకు ఓ నెల రోజులు పట్టవచ్చు.

చర్చ కోసం సరిపడినంత సమయం ఇచ్చాక, నిర్వాహకుడు సదరు వాడుకరిపేరుపై నిర్ణయం తీసుకోవచ్చు. వాడుకరిపేరు అనుచితంగా ఉందని చర్చలో స్థూలంగా ఓ ఏకాభిప్రాయం వచ్చిందని అనుకున్నపుడు మాత్రమే చర్య తీసుకోవాలి. అనుచిత వాడుకరిపేరును ఎలా నిరోధించాలో వికీపీడియా:నిరోధ విధానంలో చూడండి.

అనుచితమైన లేదా దాదాపు అనుచితమైన వాడుకరిపేరుతో దుశ్చర్యలకు కూడా పాల్పడితే వెంటనే ఆ వాడుకరిపేరును నిరోధించాలి: వికీపీడియా:నిరోధ విధానం చూడండి. ఇప్పటికే ఉన్న వాడుకరులపేర్లకు దగ్గరగా ఉండే వాడుకరిపేర్లను వెంటనే నిషేధించవచ్చు. ఈ వాడుకరుల ఐ.పి.అడ్రసును మాత్రం నిషేధించరాదు.

ఇంకా చూడండి

[మార్చు]