Jump to content

వికీపీడియా:WikiProject Medicine/Translation task force/RTT/Simple puerperal infections

వికీపీడియా నుండి
WikiProject Medicine/Translation task force/RTT/Simple puerperal infections

ప్రసవానంతర ఇన్ఫెక్షన్లు అని పిలువబడే, ప్రసూతి ఇన్ఫెక్షన్లు ప్రసావానంతర జ్వరం లేదా చైల్డ్ బెడ్ ఫీవర్ అనేవి శిశు జననం లేదా గర్భస్రావం తరువాత మహిళా పునరుత్పత్తి మార్గం యొక్క ఏదైనా బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్గా ఉంది. సంకేతాలు మరియు లక్షణాలలో సాధారణంగా 38.0 °C (100.4 °F) కన్నా ఎక్కువగా జ్వరం,వణుకులు, దిగువ పొత్తి కడుపు నొప్పి, మరియు యోని నుండి చెడు వాసనతో విసర్జనాలు వచ్చే అవకాశం ఉంటాయి.[1] ప్రసవం తరువాత మొదటి 24 గంటల తరువాత మరియు మొదటి పది రోజులలోపు ఇది సాధారణంగా సంభవిస్తుంది.[2]

గర్భాశయ మరియు దాని చుట్టుపక్కల కణజాల ఇన్ఫెక్షన్ అనేది సర్వ సాధారణంగా ఉంది, దీన్ని బాలింత జ్వరము లేదా ప్రసవానంతర గర్భాశయ శోధఅని పిలుస్తారు. ప్రమాద కారకాలలో సిజేరియన్ ఆపరేషన్ , యోనిలో గ్రూప్ B స్ట్రెప్టోకోకస్ వంటి నిర్దిష్టమైన బ్యాక్టీరియా ఉనికి, ప్రసవానికి ముందు పొరలు చీలటం మరియు ఎక్కువ సమయం పట్టే ప్రసవం తో సహా ఉంటాయి. చాలా ఇన్ఫెక్షన్లలో వివిధ రకాలైన బాక్టీరియా ప్రమేయం ఉంటుంది. యోని లేదా రక్తంలో బాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవుల కోసం పరీక్షించటం అనేది అరుదుగా రోగ నిర్ధారణకు సహాయపడుతుంది. మెడికల్ ఇమేజింగ్మెరుగుపడని వారిలో ఇవి అవసరం కావచ్చు. ప్రసవం తరువాత జ్వరానికి గల ఇతర కారణాలు: ఎక్కువ పాలతో రొమ్ము నొప్పులు , మూత్రనాళ ఇన్ఫెక్షన్‌లు, ఉదర కోత ఇన్ఫెక్షన్లు లేదా యోని ప్రాంతాలను కోయటం, శిశువు ఊపిరితిత్తులు తెరుచుకోక పోవటం .[1]

సిజేరియన్ ప్రసవం తరువాత వచ్చే ప్రమాదవకాశాల కారణంగా, శస్త్రచికిత్స సమయంలో మహిళలందరూ యాంపిస్లిన్ వంటి యాంటీబయాటిక్ యొక్క నివారణ మోతాదును తీసుకోవాలని సిఫార్సు చేయటం జరిగింది. గుర్తించబడిన ఇన్పెక్షన్లకు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చాలామంది ప్రజలలో రెండు నుండి మూడు రోజులలో మెరుగువుతుంది. తేలికపాటి వ్యాధి ఉన్నవారిలో నోటి ద్వారా వేసుకునే యాంటీబయటిక్స్ వాడవచ్చు, నయం కాకపోతే ఇంట్రావీనస్ యాంటీబయాటిక్సును సిఫార్సు చేస్తారు. యోని ద్వారా ప్రసవం తరువాత సాధారణ-యాంటీబయోటిక్స్‌లో యాంపిసిలిన్ మరియు జెంటామైసిన్ కలయిక ఉంటుంది లేదా సిజేరియన్ ప్రసవం జరిగిన వారికి క్లాన్డమైసిన్ మరియు జెంటామైసిన్ కలయిక ఉంటుంది. తగిన చికిత్సతో ఇతర సమస్యలను మెరుగుపరుచుకోని వారిలో, చీము గడ్డవంటి ఇతర సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి.[1]

అభివృద్ధి చెందిన ప్రపంచంలో యోని ద్వారా ప్రసవం తరువాత సుమారు ఒకటి నుండి రెండు శాతం వారిలో గర్భాశయ వ్యాధులు పెరిగాయి. నివారణ యాంటీబయాటిక్స్ వాడకముందే మరింత కష్టతరమైన ప్రసవాలు మరియు సి-విభాగాలతో యాభై శాతం వారిలో ఐదు నుంచి పదమూడు శాతం మధ్య వారిలో ఇది పెరుగుతుంది.[1] ఈ ఇన్ఫెక్షన్ల వల్ల 1990లో 34,000 మరణాలు సంభవించగా అవి 2013లో 24,000 మరణాలకు తగ్గాయి.[3] దన్వంతరి వైద్యుల.రచనల బట్టి పరిస్థితి యొక్క మొట్టమొదటి తెలిసిన వివరణలు ి లో కనీసం 5వ శతాబ్దం బిసిఇ కాలం నాటివి.[4] దాదాపు 18వ శతాబ్దంలో శిశుజననాలు ప్రారంభమైనప్పటి నుండి 1930లో యాంటీబయాటిక్స్ ప్రవేశపెట్టబడే వరకు ఈ ఇన్ఫెక్షన్లు మరణానికి చాలా సాధారణ కారణంగా ఉన్నాయి.[5] 1847లో, ఆస్ట్రియాలో, ఇగ్నాజ్ సెమ్మెల్విస్ క్లోరిన్ ఉపయోగించిచేతులు కడుక్కోవటం ద్వారా దాదాపు 20 శాతం నుండి రెండు శాతం వరకు వ్యాధితో సంభవించే మరణాలు తగ్గాయి.[6][7]

రిఫరెన్సులు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "37". Williams obstetrics (24th ed.). McGraw-Hill Professional. 2014. pp. Chapter 37. ISBN 9780071798938.
  2. Hiralal Konar (2014). DC Dutta's Textbook of Obstetrics. JP Medical Ltd. p. 432. ISBN 9789351520672.
  3. "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990-2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013". Lancet. 17 December 2014. doi:10.1016/S0140-6736(14)61682-2. PMID 25530442.
  4. Walvekar, Vandana (2005). Manual of perinatal infections. New Delhi: Jaypee Bros. p. 153. ISBN 9788180614729.
  5. Magner, Lois N. (1992). A history of medicine. New York: Dekker. pp. 257–258. ISBN 9780824786731.
  6. Anderson, BL (April 2014). "Puerperal group A streptococcal infection: beyond Semmelweis". Obstetrics and gynecology. 123 (4): 874–82. PMID 24785617.
  7. Ataman, AD; Vatanoglu-Lutz, EE; Yildirim, G (2013). "Medicine in stamps-Ignaz Semmelweis and Puerperal Fever". Journal of the Turkish German Gynecological Association. 14 (1): 35–9. PMID 24592068.