వికీపీడియా చర్చ:ఐదు మూలస్తంభాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనువాదము బాగుంది. తెలుగుకు అనుగుణం గా మనము తీర్చిదిద్దినా వీలయినంతగా మూల వ్యాసములోని అర్థములు, భావాలు కోల్పోకుండా భద్రపరచాలి. దీన్ని మెరుగు పరచడానికి నేనూ కృషి చేస్తాను. మూలభాగము ఇప్పటికీ బాగానే ఉంది. --వైఙాసత్య 20:44, 14 డిసెంబర్ 2005 (UTC)

  • నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి. ఈ వాక్యములో చెప్పదలుచుకొన్నది కొంచెము అస్పృష్టంగా ఉన్నది. కొంచెము సులువైన వాక్యముగ తిరిగి రాయగలరు. --వైఙాసత్య 20:48, 14 డిసెంబర్ 2005 (UTC)
పై వాక్యం లోని భావం స్పష్టం గా ఉందని నా అభిప్రాయం. ----కంపశాస్త్రి 22:35, 13 ఆగష్టు 2007 (UTC)
ఐదు మూలస్తంభాలలో ఐదవదానిలో "ఇక్కడ పేర్కొన్న ఐదూ " బదులుగా " పైన పేర్కొన్న నాలుగూ " అని ఉంటే బాగుంటుంది ----కంపశాస్త్రి 22:46, 13 ఆగష్టు 2007 (UTC)
కంపశాస్త్రి గారు చెప్పినట్లు అక్కడ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది, కాని కంపశాస్త్రి గారు ఐదు స్థంభాలలొ ఒక స్థంభాన్ని ఎందుకు తొలగించమంటున్నారో అర్థం కావడాం లేదు--మాటలబాబు 00:18, 14 ఆగష్టు 2007 (UTC)
ఇవికాక ఇంకే స్థిరనిబంధనలు లేవు అన్నది కూడా ఒక మూలస్తంభమే. మూలస్తంభాలు నాలుగు కాదు, ఐదు. కాబట్టి ఆ వాక్యాన్ని అలాగే ఉంచాలి --వైజాసత్య 00:38, 14 ఆగష్టు 2007 (UTC)
" పైన పేర్కొన్న నాలుగు తప్ప ఇంక ఏ ఇతరస్థిర నిబంధనలు లేవు " అనేది ఐదవ స్తంభం. ఇదీ నా ఉద్దేశ్యం.----కంపశాస్త్రి 20:48, 14 ఆగష్టు 2007 (UTC)
"పైన పేర్కొన్న నాలుగు" అని రాస్తే ఐదవది మూలస్థంభం కాకుండా పోతుంది. కాబట్టి, ఇప్పుడున్నదే సరయిన వాఖ్య నిర్మాణం. __మాకినేని ప్రదీపు (+/-మా) 00:26, 15 ఆగష్టు 2007 (UTC)
ఐదవ నియమం లో "ఐదవనియమం" ను చొప్పించడం అనేది తర్కానికి లొంగదు. ఒక తూనికయంత్రం తనను తాను తూచుకోలేదు . " వాఖ్య " ను "వాక్య" గా మార్చడం సబబు. ----కంపశాస్త్రి 15:26, 15 ఆగష్టు 2007 (UTC)
ఐదవ నియమం లో "ఐదవనియమం" ను చొప్పించడం అనేది తర్కానికి లొంగదు. దీనినే recursive తర్కం అని అంటారు. ఉదాహరణకు ఆంగ్లంలో ఒక సంక్షిప్తనామం GNU అని ఉంది. దానిని పూర్తిగా విడగొడితే "GNU is Not Unix" అని వస్తుంది. GNUలో ఇంకో GNU అన్న మాట. ఇలాంటి తర్కాన్ని మొదటి సారిగా చూసిన వారికి జీర్ణించుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:45, 15 ఆగష్టు 2007 (UTC)
గణితం లో రికర్సివ్ తర్కాన్ని విస్తారంగా వాడుతారు. దానికి జిఎన్‌యు సరి అయిన ఉదాహరణ కాదేమో.అయినా రికర్సివ్ తర్కాన్ని గురించి చర్చించ డానికి ఇది వేదిక కాదు. కనక ఐదు స్తంభాలను అలాగే ఉంచుదాం. ----కంపశాస్త్రి 16:57, 15 ఆగష్టు 2007 (UTC)

లైసెన్స్ విషయమై[మార్చు]

నేడు వికీపీడియా గ్నూ ఎఫ్‍డీఎల్ లైసెన్స్ వాడటం లేదు. ఇది మార్చాలి. అభ్యంతరం లేక పోతే, ఈ విభాగం నేను తీర్చిదిద్దుతాను. రహ్మానుద్దీన్ (చర్చ) 20:24, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయమై ఇతర సభ్యులు ఇంకా స్పందించనందువలన సోమవారం 23 సెప్టెంబర్, 2013 నాటికి తగిన మార్పులు చేస్తాను. రహ్మానుద్దీన్ (చర్చ) 13:34, 20 సెప్టెంబర్ 2013 (UTC)