వికీపీడియా చర్చ:తెలుగులో రచనలు చెయ్యడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ లిపి

[మార్చు]

ayyalaarraa ammalaaraa, mana telugu bhaasha teta bhaasha. kaani prathi bhaahsa vaadoo athani bhaashe melu ani vaadishaadu kadaa? nenu orissa kelithe akkada lipi, madura vellithe akkada lipi, naapillalu english badi, naa bandhuvulu ithra vaalu. ilaaanti parishthith sandharbhaallalo, bhaashalannitiki roman lipi konnikonni sardhi vraasthe, prathi bhaasha oke lipilo untundi kaabatti chadavadam raayadam enta sulabhamo sukhamo aaalochinchandi. emo telugu raathe undaali ani enduku ee pattu? MODOFIED ROMAN SCRIPT FOR ALL ALL LANGUAGES ane aaalochana manaku raavaali. naa vinnapamu. aaalochana. salahaaa.<pradhangeorge@yahoo.com> dr mbbs 1950.

స్పందనలు

[మార్చు]

వైఙాసత్య

అంతదానికి రోమన్ లిపితో కూడా కుస్తీ ఎందుకూ? ఎలాగూ ఇప్పటికే చాలా మంది చదువుకున్నవాళ్లు రాతకోతలకు ఇంగ్లీషు వాడుతున్నారు. ఇంకొక తరముకల్లా అందరూ ఇంగ్లీషులో చదువుకొని అదే ఉపయోగిస్తారు. ఇంక తెలుగు రాయడము అవసరము అంటారా? మీ తర్కాన్ని బట్టి ?--వైఙాసత్య 23:51, 17 మార్చి 2006 (UTC)[ప్రత్యుత్తరం]


లిపి అనేది ప్రతి భాష యొక్క ప్రత్యేకత. ఉదాహరణకి, తెలుగులో "ణ" "ళ" "క్ష"(ఉదాహరణకు ఇవి కొన్ని మాత్రమే) వంటి అక్షరాలను ఏ లిపిలోనైనా వ్రాయగలరా?? రోమన్ లిపిలో అస్సలు వ్రాయలేరు."త" "ట" కు రోమన్ లిపిలోతేడానే లేదు. మరి ఆ అక్షరాలు గల పదాల మాటేమిటి?? వాటిని అపభ్రంశంగా రోమన్ లిపిలో వ్రాయవలసిందే?? ఇదేమి వింత వాదన!! ప్రపంచం మొత్తనికి ఒక లిపి నిజంగా ఉండాలంటారా?? ఉండవలసి వస్తే అది ఏ లిపి అయ్యి ఉండాలి?? అన్న విషయాల మీద చాలా పెద్ద చర్చ జరగాలి. ఇటువంటి విషయాలలో, ఏకాభిప్రాయం దాదాపు అసాధ్యం. రోమన్ లిపి ఇప్పటికే "చదువుకున్నాం మనం" అనుకునే కొద్దిమందికి వచ్చి ఉండవచ్చు. కానీ ఆ రోమన్ లిపినే ప్రపంచ లిపి చెయ్యబూనటం సులభం కాదు, సమబు కాదు అంతకంటే అవసరం లేదని నా అభిప్రాయం. ముఖ్యంగా, నేను తెలుగులో మాట్లాడగలను గానీ, వ్రాయలేను అని (గొప్పగా) చెప్పుకోవటం తగ్గించి, ప్రయత్నిస్తే మాతృభాషలో వ్రాయగలగటం కష్టమేమీ కాదు, పిల్లలకు నేర్పటం పెద్ద కష్టం కాదని నా భావన. భారత దేశంలో పుట్టి ప్రాధమిక విద్య ఇక్కడే అభ్యసించగలిగిన అదృష్టం గలిగిన పిల్లలకు మూడు భాషలు (మాతృభాష, ఆంగ్లము, హిందీ లేక సంస్కృతము)లిపితో సహా నేర్చుకొనే ఉంటారు.--సభ్యులు:SIVA