వికీపీడియా చర్చ:వికీ చిట్కాలు/సెప్టెంబరు 7

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చర్చించాలి అని వేచి ఉండడం దేనికి అని ఇక్కడే చర్చ ప్రారంభిస్తున్నాను. ఈ చర్చ కేవలం తెలుగు వికీలో వ్యక్తుల పేర్లకు సంబంధించిన చర్చగా సభ్యులు గుర్తించండి. ఈ చిట్కాలో మీరు సూచించిన ఆంగ్లవికీ ఆధారంపై నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. సంబంధిత వాక్యాలు కేవలం వ్యక్తుల పేర్లకు కాకుండా అన్ని వ్యాసాల పేర్లకు సంబంధించి వ్రాసినవిగా ఉన్నాయి. ఆంగ్లవికీలో కూడా చూస్తే కేవలం భారతీయుల పేర్లలోనే ఇలా అబ్రివియేషన్స్ వాడబడి ఉంటాయి(ఒకటి రెండు ఇతర పేర్లు కూడా ఉండవచ్చు). వ్యక్తి పూర్తి పేరు వాడాలన్నది నా ఉద్దేశ్యం. ఇందులో ముందు ఇంటి పేరా లేక వ్యక్తి పేరా అనేది నా ఉద్దేశ్యంలో సంబంధిత వ్యక్తులు వాడిన విధంగా ఉంటే బాగుంటుంది. వాడుక పేరు ఉంటే ఆ పేరుకు దారిమార్పు ఇవ్వవచ్చు. సభ్యులు సానుకూలతతో చర్చించి, పేర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలన్నది నా ఉద్దేశ్యం. δευ దేవా 13:13, 5 సెప్టెంబర్ 2008 (UTC)

వాడుక పేర్లే వ్యాసపు ప్రధాన పేర్లుగా ఉండాలనేది నా అభిప్రాయం. ఇక వ్యక్తుల పేర్లతో ఉన్న వ్యాసాల విషయానికి వస్తే ఆ వ్యక్తి ఎలా (అంటే ఏ పేరుతో/ఏ విధంగా) ప్రసిద్ధి చెందినాడో ఆ పేరే వ్యాసం పేరుగా ఉండాలి. కొందరు పూర్తి పేర్లతో ప్రసిద్ధి చెందితే మరి కొందరు పొట్టిపేర్లతో అభివృద్ధి చెందుతారు.(దాన్ని మనం మార్చలేము) ఉదా. నీలం సంజీవరెడ్డి పూర్తి పేరుతో ప్రసిద్ధి చెందినాడు, సి.డి.దేశ్‌ముఖ్ మాత్రం సి.డి.పొట్టి పేరుతోనే ప్రసిద్ధి చెందినాడు. అంతేకాని చింతామణి ద్వారకనాథ్............. అని వ్యాసం పేరు ఉంటే బాగుండదు. ఒక వేళ వ్యక్తులు పూర్తి పేరుతో ప్రసిద్ధి చెందితే పూర్తి పేరే వ్యాసం పేరుగా ఉండాలి, అంతేకాని పూర్తి పేరా, పొట్టి పేరా అనేది ప్రధానం కాదు. ఒక పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల పేర్ల విధానాన్ని మార్చే హక్కు మనకు లేదనుకుంటాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:46, 5 సెప్టెంబర్ 2008 (UTC)
చర్చ మొదలు పెట్టినందుకు కృతజ్ఞతలు. ఈవిషయమై రెండు భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ చర్చను వికీపీడియా:వ్యక్తుల పేర్లు కు కాపీ చేస్తున్నాను. మిగిలిన చర్చను అక్కడ కొనసాగించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:11, 5 సెప్టెంబర్ 2008 (UTC)