Coordinates: 52°20′57.5″N 14°33′37.3″E / 52.349306°N 14.560361°E / 52.349306; 14.560361

వికీపీడియా స్మారకచిహ్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియా స్మారకచిహ్నం
నాలుగు బొమ్మలు వికీపీడియా చిహ్నాన్ని పట్టుకొని ఉన్న ఒక వృత్తంలో నిలబడి ఉన్నాయి, ఇందులో జా ముక్కలతో చేసిన భూగోళం ఉంటుంది, అంతులో కొన్ని ముక్కలు లేవు, విజ్ఞాన సర్వస్వ నిర్మాణ పని ఎప్పటికీ పూర్తికాదని సూచిస్తుంది
కళాకారుడుమిహ్రాన్ హకోబియాన్
సంవత్సరం2014 అక్టోబరు 22 (2014-10-22)
రకంశిల్పం
ఉపయోగించే వస్తువులుఫైబర్ గ్లాస్, రెసిన్
విషయంవికీపీడియా వర్గం
కొలతలు250 cm × 60 cm × 60 cm (98 in × 24 in × 24 in)
ప్రదేశంసూబిస్‌, పోలాండ్
Coordinates52°20′57.5″N 14°33′37.3″E / 52.349306°N 14.560361°E / 52.349306; 14.560361
యజమానిప్రాంతీయ అధికారులు

వికీపీడియా స్మారకచిహ్నం (వికీపీడియా మాన్యుమెంట్) వికీపీడియా గుర్తింపుగా పోలాండ్ లోని, సూబిస్‌లో ఉన్న స్మారకచిహ్నం. వికీపీడియా రచయితల కృషికి గుర్తింపుగా అర్మేనియన్ శిల్పి మిహ్రాన్ హకోబియాన్ ఈ విగ్రహాన్ని రూపొందించాడు.[1][2] 2014, అక్టోబరు 22న ఫ్రాంక్‌ఫర్ట్ స్క్వేర్ (ప్లాక్ ఫ్రాంక్‌ఫుర్కి) లో స్థానిక వికీమీడియా ఛాప్టర్, వికీమీడియా ఫౌండేషన్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ విగ్రహం ఆవిష్కరించబడింది.

వివరణ[మార్చు]

ఈ స్మారక చిహ్నంలో వికీపీడియా లోగోను ఎత్తుకున్న నాలుగు నగ్న బొమ్మలు (2 మీటర్లు - 6 అడుగుల 7 అంగుళాలు) ఉన్నాయి.[3][4] దీనిని రూపొందించడానికి సుమారు 13,500 డాలర్లు (11,700 యూరోలు) ఖర్చు అయ్యాయి, దీనికి సూబిస్ ప్రాంతీయ అధికారులు నిధులు సమకూర్చారు.[5]

విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, సౌబిస్‌లోని కొలీజియం పోలోనికం డైరెక్టరు[3] 2010లో[5] ఈ స్మారక చిహ్నాన్ని సూచించాడు. పోలిష్ వికీపీడియా పోలాండ్‌లోని ఒక ముఖ్య వెబ్‌సైట్ గా, ఒక మిలియన్ వ్యాసాలతో ప్రపంచంలో 12వ అతిపెద్ద వికీపీడియాగా ఉంది.[2][6] ఈ స్మారక చిహ్నం "విద్యాకేంద్రంగా పట్టణ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది" అని డిప్యూటీ మేయర్ పియోటర్ పేర్కొన్నాడు. ఈ ప్రాజెక్ట్ "వెబ్‌సైట్ గురించి అవగాహన పెంచుతుందని, ప్రజలను సహకరించమని ప్రోత్సహిస్తుందని" సంస్థ భావిస్తోందని వికీమీడియా పోల్స్కా ప్రతినిధి పేర్కొన్నాడు. [1]

2014, అక్టోబరు 22న[3] ఇది ఆవిష్కరించబడింది.[1][5] అంతర్జాల విజ్ఞాన సర్వస్వానికి ప్రపంచంలోనే మొట్టమొదటి స్మారక చిహ్నమిది.[2] వికీమీడియా ఫౌండేషన్ నుండి, పోలాండ్, జర్మనీ వికీమీడియా ఛాప్టర్ల నుండి ప్రతినిధులు ఈ వేడుకకు హాజరయ్యారు.[7] మేనేజ్మెంట్ ప్రొఫెసర్, వికీమీడియా కార్యకర్త డారియస్ జెమిల్నియాక్ (కామన్ నాలెడ్జ్ ? వికీపీడియా ఆఫ్ ఎథ్నోగ్రఫీ పుస్తక రచయిత) ప్రారంభోపన్యాసం చేసింది. [8]

శాసనం[మార్చు]

ఈ స్మారక చిహ్నంతో సుబైస్ పౌరులు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వాడుకరలను గౌరవించుకుంటున్నారు. వాడుకరులు రాజకీయ, మత, సాంస్కృతిక సరిహద్దులతో సంబంధం లేకుండా వికీపీడియా సృష్టికి స్వచ్ఛందంగా సహకరించారు. ఈ స్మారక చిహ్నం ఆవిష్కరించబడినపుడు, వికీపీడియా 280కి పైగా భాషలలో ఉంది, సుమారు 30 మిలియన్ల వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్మారక చిహ్నం వెనుక ఉన్న లబ్ధిదారులు వికీపీడియా దాని స్తంభాలలో ఒకటిగా ఉండటంతో జ్ఞాన సమాజం మన నాగరికత, సామాజిక న్యాయం, దేశాల మధ్య శాంతి, స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుందని ఖచ్చితంగా భావిస్తున్నారు.[9]

జిమ్మీ వేల్స్ నుండి ప్రకటన[మార్చు]

2001లో వికీపీడియా ప్రారంభమైనప్పుడు, వికీపీడియా ఒక స్మారక చిహ్నంతో గౌరవించబడే రోజును నేను ఊహించలేదని చెప్పాలి. మేము స్మారక చిహ్నాల గురించి వ్రాస్తాము, మా వికీ లవ్స్ మాన్యుమెంట్స్ పోటీతో వాటిని ఫోటో తీస్తాము. ఇప్పుడు మనకు స్వంత స్మారక చిహ్నం ఉంది. ఇది నిజంగా ప్రత్యేకమైన, ఉత్తేజకరమైన రోజు. వికీపీడియాను సవరించి, ఉచిత విజ్ఞాన మూలంగా ఉన్న వేలాది మంది వికీమీడియన్లపై చర్చనీయాంశం అవుతుందని నేను ఆశిస్తున్నాను. వికీపీడియా స్మారక చిహ్నాన్ని చూడటానికి, ఒక రోజు సూబిస్‌ను సందర్శించడానికి, ప్రాజెక్ట్‌లో పాల్గొన్న వారిలో కొంతమందిని కలవడానికి నేను ఎదురుచూస్తున్నాను.[10]
- ఆవిష్కరణ సందర్భంగా వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Day, Matthew (10 October 2014). "Polish town to build statue honouring Wikipedia". The Daily Telegraph. Retrieved 10 January 2021.
  2. 2.0 2.1 2.2 "Poland to unveil world's first Wikipedia monument". Polskie Radio. Archived from the original on 11 అక్టోబరు 2014. Retrieved 10 January 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "PR" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 "Poland to Honor Wikipedia With Monument". ABC News. 9 October 2014. Archived from the original on 11 October 2014. Retrieved 10 January 2021.
  4. "World's first Wikipedia monument unveiled in Poland". thenews.pl. Archived from the original on 25 అక్టోబరు 2014. Retrieved 10 January 2021.
  5. 5.0 5.1 5.2 "W nowosolskim Malpolu powstaje pierwszy na świecie pomnik Wikipedii". 10 October 2014. Retrieved 10 January 2021.
  6. List of Wikipedias – Meta. Retrieved 10 January 2021.
  7. "Slubice: Polnische Stadt setzt Wikipedia ein Denkmal". Der Spiegel. Retrieved 10 January 2021.
  8. "Wikipedia na cokoły! W Słubicach będzie miała pomnik". 21 October 2014. Retrieved 10 January 2021.
  9. "Photograph of the Wikipedia monument inscription". gorzow.gazeta.pl. Adamski, Daniel, photographer. Agencja Gazeta. 2014-10-22. Archived from the original on 2014-10-22. Retrieved 10 January 2021.{{cite news}}: CS1 maint: others (link)
  10. "Press releases: First-ever Wikipedia Monument unveiled in Poland". Wikimedia Foundation. 22 October 2014. Retrieved 10 January 2021.