Jump to content

జిమ్మీ వేల్స్

వికీపీడియా నుండి
జిమ్మీ డోనాల్ "జింబో" వేల్స్
జిమ్మీ వేల్స్ (ఆగష్టు 2006)[1]
జననంఆగష్టు 7,1966 [2]
వృత్తివికియా, ఇన్క్ కు అధ్యక్షుడు; వికీమీడియా ఫౌండేషన్ కు మాజీ ఛైర్మన్, బోర్డు మెంబరు
జీవిత భాగస్వామిక్రిస్టీన్
పిల్లలుకిరా
వెబ్‌సైటువికీపీడియా లో పేజీ

జిమ్మీ వేల్స్ (జ. ఆగష్టు 7, 1966) అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్. వికీపీడియాను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రాజెక్టులు (అంటే ఈ తెలుగు వికిపీడియా తో కలిపి) ప్రారంభించారు. లాభము ఆశించని ఛారిటబుల్ సంస్థ వికీ మీడియా ఫౌండేషన్, ను వికీయాను కూడా నడుపుతున్నారు.

వ్యక్తిగత జీవితము

[మార్చు]

వేల్స్ తండ్రి ఒక పచారీ దుకాణములో పని చేయగా తల్లి డోరిస్, అమ్మమ్మ ఎర్మా ఇంట్లో ఒక చిన్న ప్రైవేటు పాఠశాలను నడిపే వారు. అందులోనే వేల్స్ కొంతవరకూ చదువుకున్నాడు. అతని తరగతిలో నలుగురే ఉండడము చేత ఒకటో తరగతి నుండి నాలుగో తరగతి వరకూ ఒక గదిలో, ఐదు నుండి ఎనిమిది వరకూ ఇంకో గదిలో పెట్టి చదువు చెప్పేవారు.

విద్య

[మార్చు]

ఎనిమిదో తరగతి తరువాత, వేల్స్ హంట్స్‌విల్ అలబామాలో రాండాల్ఫ్ పాఠశాలలో చదివాడు. ఈ పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ లు ఇతర టేక్నాలజీ విద్యార్థుల వాడకానికి మొదట మద్దతు నిచ్చిన వాటిలో ఒకటి.ఈ పాఠశాల ఖరీదెక్కువైనా చదువు ముఖ్యమని కుటుంబము భావించిందని వేల్స్ చెప్పారు. "విద్య ని కుటుంబమంతా ఆదరించింది. సంప్రదాయబద్దమైన విద్యాభ్యాస విధానము మంచి జీవితానికి నాంది". లో ఫైనాన్స్ లో బ్యాచిలర్స్ అలబామా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేశాడు. అక్కడ కొన్నాళ్ళు పాఠాలు చెప్పాడు.

ఉద్యోగము

[మార్చు]

1994 నుండి 2000 వరకూ షేర్ మార్కెట్ లో పనిచేసి తన భార్యా పిల్లలు జీవితాంతము పనిచేయకపోయినా సరిపోయేటంత డబ్బు సంపాదించాడు. ఇదే సమయంలో వేల్స్ చేసిన ప్రోజెక్టులలో ఒక శోధనాయంత్రం బోమిస్ (గూగుల్.కామ్ వంటిది) ను సృష్టించడానికి మద్దతునిచ్చాడు. బోమిస్ లో వచ్చిన డబ్బులు వికీపీడియా స్థాపనకు ఉపయోగపడ్డాయి.

మార్చి 2000 లో, అందరిచేత రివ్యూ చెయ్యబడేలా అందరికీ అందుబాటులో ఉండేలాంటి ఉచిత విజ్ఞాన సర్వస్వము (న్యూపీడియా) ను ప్రారంభించి ల్యారీ సేంగర్ను దాని సంపాదకునిగా నియమించాడు.

2007 లో ఒక ఇంటర్వ్యూలో జిమ్మీ వేల్స్ మాట్లాడుతూ 1999 లో ఒక బహు భాష విజ్ఞాన సర్వస్వమునకు ఒక విద్యార్థి డిజైన్ వచ్చింది కాని, అది చాలా స్లోగా ఉండి వాడడానికి వీలు లేకుండా పోయింది అని చెప్పారు

వికీపీడియా వికీమీడియా

[మార్చు]
ఢిల్లీలో 2006 ఆగష్టు 24ఓనింగ్ ది ఫ్యూచర్ సదస్సులో ఓపెన్ సోర్స్, ఓపెన్ యాక్సెస్ అనే అంశంపై జరిగిన సెషనులో జిమ్మీ వేల్స్ (ఎడమ చివర).

జనవరి 10, 2001 లో ల్యారీ సేంగర్, వికీని వాడి విజ్ఞాన సర్వస్వము తయారు చెయ్యవచ్చని చెప్పడముతో వేల్స్ వికీ సాఫ్ట్‌వేర్ ను ఒక సర్వర్ లో ఇన్‌స్టాల్ చేసి సేంగర్ కు ఆ దిశలో పరిశోధనలు చెయ్యడానికి అనుమతిచ్చాడు. సెంగర్ దీనికి వికీపీడియా అని పేరు పెట్టి, వేల్స్ తో పాటు మౌలిక సూత్రాలను, కంటెంటును, ఇంటర్నెటు ద్వారా వ్రాయగలిగే వాళ్ళను దగ్గర చేర్చాడు. వికీపీడియా మొదట న్యూపీడియాకు అనుబంధ సైటుగా ఉండేది. కాని వికీపీడియా అనూహ్య పురోగతి న్యూపీడియా కెపాసిటీ దాటిపోయింది. సేంగర్ ను 2002 మొదట్లో ఉద్యోగము లోంచి తొలగించగా ఆతరువాత అతను వికిపీడియా నాయకత్వము నుండి కూడా రాజీనామా చేసాడు. వేల్స్ అర్థరాత్రి నిద్ర లేచి సైటులో ఆకతాయి పనులెవరైనా చేసారేమో చూద్దామన్నంతగా చింతించేవాడినని, చెప్పాడు. 2003 మధ్యలో వేల్స్ వికిమీడియా ఫౌండేషన్ ను స్థాపించాడు. స్లాష్ డాట్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు. "ప్రపంచము లో ప్రతీ వారి దగ్గరా ఈ గ్రహము మీద ఉండే జ్ఞానమంతా అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందో, ఊహించుకోండి!! అదే మేము చేసే ప్రయత్నం" అన్నాడు.

మూలములు

[మార్చు]
  1. "వికీపీడియా స్థాపకుడు; వికిపీడియను గూగుల్ కు సమఉజ్జీగా చేసే ప్లాన్ ఉంది". టైమ్స్ ఆన్‌లైన్. 2006-12-23. Archived from the original on 2007-02-08. Retrieved 2006-12-23.
  2. జీమ్మీ వేల్స్ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా,వార్షిక సంచిక (బుక్ ఆఫ్ ది ఇయర్), 2007

సవివరమైన మూలములకు జిమ్మీ వేల్స్ చూడండి.