వికీలీక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీలీక్స్
Graphic of hourglass, colored in blue and grey; a circular map of the western hemisphere of the world drips from the top to bottom chamber of the hourglass.
నినాదం ప్రభుత్వాలను తెరపైకి తెస్తాం.
వ్యాపారాత్మకమా? కాదు
సైటు రకం సమూహ పరచిన దస్తావేజులు
లభ్యమయ్యే భాషలు పలు భాషలు
యజమాని ద సన్ షైన్ ప్రెస్[1]
సృష్టికర్త జూలీన్ అసెన్జ్
విడుదల తేదీ డిసెంబర్ 2006
అలెక్సా ర్యాంక్ 2,367(అక్టోబర్, 2010)[2]
ప్రస్తుత పరిస్థితి Active

వీకీలీక్స్ ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. మామూలుగా, అందరికి అందుబాటులోలేని సమాచారాన్ని, పత్రాలను, దస్తావేజులను, చిత్రాలను , రహస్యంగా, గుప్తచారుల ద్వారా సేకరించి, సమూకరించి ప్రచురిస్తుంది. అంతేకాదు, సంస్థకోసం మాత్రమే ఇంటర్నెట్లో పొందుపరచబడిన గుప్తసమాచారాన్ని క్రోడీకరించి ప్రచురిస్తుంది.[1] వీకీలీక్స్ సంస్థ స్తాపింపబడిన ఏడాది లోపునే 12 లక్షల దస్తావేజులు, పత్రాలు మొదలైనవి సంపాదించి, డేటాబేంక్ లో భద్ర పరచింది.[3]

ఉత్తరమెరికా,తైవాన్, యూరోప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు చైనా దేశాల నుండి[1] పాత్రికేయులు, మేధావులు, విజ్ఞానవేత్తలు, కంప్యూటర్ మేథావులు, శాస్త్రజ్ఞులు,చైనా విప్లవకారులు మొదలైన వారందరు కలసి స్థాపించిన సంస్థ. ద న్యూయార్కర్‌లో, 2010 జూన్ 7 న ప్రచురింపబడిన వార్త ప్రకారం జూలియన్ ఆసాన్జె అనే ఆస్ట్రేలియా పాత్రికేయుడు, ఇంటర్నెట్ ఉద్యమకారుడు ఈ సంస్థకు ప్రధాన అధికారి, డైరెక్టర్.[4],[5].

వీకీలీక్స్ ఎన్నో ప్రశంసలను, బహుమతులను అందుకొనింది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది: ఎకానమిస్ట్ పత్రిక వారి, న్యూమీడియా బహుమతి,[6] జూన్ 2009,లో వీకీలీక్స్ మరియు జూలియన్ అస్సన్జ్ అమ్నెస్టి ఇంటర్నేషనల్ వారి బహుమతి, (2008లో, ప్రచురింపబడ్డ "కెన్యా: ద క్రై ఆఫ్ బ్లడ్" (Kenya: The Cry of Blood – Extra Judicial Killings and Disappearances),కు గాను లభించింది.[7] కెన్యా జాతీయ మానవ హక్కుల సంఘం రిపోర్ట్,[8] మే 2010లో, న్యూయార్క్ డైలీ న్యూస్ వీకీలీక్స్ ని "ప్రపంచ చరిత్రలో వార్తా ప్రచురణ విప్లవం స్తృష్టించిందని పేర్కొంది.[9]

ఏప్రిల్ 2010లో , వీకీలీక్స్ ఒక విడియోను వెబ్సైట్లో ప్రదర్శించింది2007 బాగ్దాద్ సంఘటన. ఇందులో సామూహిక హత్య అన్న శీర్షికతో, ఇరాక్ దేశస్తులను అమెరికా సైనికులు హతమార్చిన వైనం చిత్రీకరించబడింది. అదే సంవత్సం జూలైలో, ఆఫ్గన్ వార్ డైరీ, అన్న పేరుతో 76,900 పై చిలుకు పత్రాలను వార్ ఇన్ ఆఫ్గనీస్తాన్ అన్న పేరుతో విడుదల చేసింది.[10] అక్టోబర్ లో దాదాపు 400,000 పత్రాల ఇరాక్ వార్ లాగ్స్ అన్న అంశంతో విడుదల చేసింది.

చరిత్ర[మార్చు]

వీకీమీడియా ఫౌండేషణ్ తో అనుభందం[మార్చు]

వెబ్సైట్ నిర్వాహణ[మార్చు]

ఆథిద్యం[మార్చు]

నిబందనలు[మార్చు]

ఇక్కట్లు, ఇబ్బందులు, పోలీస్ దాడులు[మార్చు]

వీకీలీక్స్ జెర్మనీ వెబ్ స్వంతధారుని గృహంపై పోలీస్ దాడి[మార్చు]

చైనా ప్రభుత్వపు నియంత్రత్వం[మార్చు]

భవిష్యత్తులో ఆస్ట్రేలియా సెంన్సార్ చేయవచ్చు[మార్చు]

థైలాండ్ ప్రభుత్వ సెంన్సార్[మార్చు]

See also[మార్చు]

References[మార్చు]

External links[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.