విజయ్ వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్ వర్మ
2017లో విజయ్ వర్మ
జననం (1986-03-29) 1986 మార్చి 29 (వయసు 37)
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం

విజయ్ వర్మ ఒక తెలుగు, హిందీ సినీ నటుడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

విజయ్ వర్మ హైదరాబాదులో స్థిరపడిన ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించాడు. సినిమా రంగం మీద ఆసక్తితో పుణె లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి దరఖాస్తు చేశాడు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో స్నేహితుల సాయంతో అందులో ఎఫ్. టి. ఐ. ఐ కోర్సులో చేరాడు.[1]

నటవృత్తి[మార్చు]

విజయ్ ముందుగా హైదరాబాదులోని నాటకరంగంలో నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. కొద్దికాలం తర్వాత పుణెలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. అక్కడ రెండేళ్ళ పాటు శిక్షణ పొందాడు. అది పూర్తయిన తర్వాత అవకాశాల కోసం ముంబై వెళ్ళాడు. ముందుగా రాజ్ నిడిమోరు, కృష్ణ డి. కె రూపొందించిన ఒక లఘుచిత్రంలో నటించాడు. ఈ చిత్రం న్యూయార్క్ లో జరిగిన చిత్రోత్సవంలో మొదటి బహుమతి చేజిక్కించుకుంది.[2]

సినిమాలు[మార్చు]

వ.సం సంవత్సరం సినిమా పాత్ర దర్శకులు భాష గమనిక
1 2012 చిట్టగాంగ్ సుభోద్ రాయ్ బేదబ్రత పెయిన్ హిందీ
2 2013 రంగ్రేజ్ పక్యా ప్రియదర్శన్ హిందీ
3 2014 గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్స్ రాబిన్ హూడా సతీష్ కౌశిక్ హిందీ
4 2016 పింక్ అంకిత్ మల్హోత్రా అనిరుద్ధ రాయ్ చౌదరి హిందీ
5 2017 మాన్ సూన్ షూటవుట్ అమిత్ కుమార్ హిందీ
6 2017 మిడిల్ క్లాస్ అబ్బాయి శివ వేణు శ్రీరామ్ తెలుగు


మూలాలు[మార్చు]

  1. "Vijay Varma -Actor Biography".
  2. "Hyderabad boy Vijay Varma's Interview".