విడువటిల్లు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విడవలిని పై కప్పుగా నేయబడిన ఇంటిని విడువటిల్లు అంటారు. ఎండుగడ్డి, జమ్ముగడ్డి, కాకివెదురు వంటి వృక్ష సంబంధితాలను పైకప్పుగా వేయబడిన ఇళ్లను కూడా విడువటిల్లు లేక పాకిల్లు అంటారు. ఇటువంటి ఇళ్లను విడవలితో విడవలినేసేవారు ప్రత్యేక నైపుణ్యంతో నిర్మించటం వలన ఈ రకపు ఇళ్లకు విడువటిల్లు అనే పేరు వచ్చింది. ఇది చాలా పాత రూఫింగ్ పద్ధతి, ఉష్ణమండల, సమశీతోష్ణ వాతావరణ రెండింటిలోను ఈ పద్ధతి ఉపయోగిస్తారు. తక్కువ ఖర్చుతో నిర్మించగల ఇటువంటి ఇళ్లను అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిర్మిస్తున్నారు. వృక్ష సంబంధితాలలో మాత్రమే నిర్మించే ఇటువంటి ఇళ్లు ప్రత్యేక కళాత్మకంగా ఉండటంతో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలోని ధనికులు కూడా ఇటువంటి ఇళ్ల నిర్మాణాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.
విడవలి నేసే పద్ధతిని ఒక తరం నుంచి మరొక తరం నేర్చుకుంటూ ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఇటువంటి నిర్మాణాలు వినియోగదారులను ఆకర్షించేందుకు గార్డెన్ హోటల్స్ నిర్మాణాలలో ఉపయోగిస్తున్నారు. బాగా నేసిన పైకప్పు తరచుగా కప్పనవసరం ఉండదు. సాధారణంగా 8-14 సంవత్సరాలకు పైకప్పు మారుస్తుంటారు. పైకప్పుకి వాడిన రకాన్ని బట్టి ఈ పైకప్పు ఎంతకాలానికి మార్చవలసి ఉంటుందో ఊహించుకోవచ్చు, మంచి విడవలితో బాగా నేసిన పైకప్పు 30 సంవత్సరాల వరకు కూడా పాడవకుండా ఉంటుంది.