Jump to content

విత్తనశుద్ధి

వికీపీడియా నుండి

విత్తనాల ద్వారా ఆశించే పురుగులు, తెగుళ్లను నివారించుటకు, అదే విధంగా మొలకదశలో నేలలో ఉండే కీటకాలు, శిలీంద్రాల నుంచి విత్తనాలను కాపాడుటకు విత్తనాలను సరైన పద్ధతిలో శుద్ధి చేయడాన్ని విత్తనశుద్ధి అంటారు.[1]

నాణ్యమైన విత్తనం

[మార్చు]

పంట దిగుబడి విత్తన నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన విత్తనం అంటే జన్యుపరమైన అసలు లక్షణాలు, మొలకశాతం, మొలకెత్తే శక్తిని కలిగి ఉండి పైరు ఏకరీతిగా పెరుగుతుంది. ఇటువంటి విత్తనాలను ఉపయోగించడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చు. విత్తనోత్పత్తి పంటల్లో కోత తర్వాత విత్తనాన్ని నూర్చి 12 శాతం తేమ కంటే తక్కువ వచ్చే వరకు ఆరబెట్టాలి. ఈ విధంగా ఎండబెట్టి సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే విత్తనం నాణ్యత అనగా రంగు, పుష్టి తగ్గిపొయి, శిలీంద్రాల వ్యాప్తి పెరిగి, మొలకశాతం, మొలకెత్తుశక్తి తగ్గి క్రమంగా విత్తనం నిర్జీవమైపోతుంది. కావున విత్తన పంటను సరైన పద్ధతిలో శుభ్రపరచి, తగిన తేమశాతం వచ్చే వరకు ఎండబెట్టి విత్తనశుద్ధి చేసి నిల్వ చేసుకోవాలి.

సూక్షక్రిములు

[మార్చు]

విత్తనాలు ఆరోగ్యమైనవి అయినా, కోత కోసేటప్పుడు, నూర్పిడి జరిగేటప్పుడు కొన్ని శిలీంద్ర భాగాలు విత్తనాలతో కలిసి పంటను ఆశిస్తాయి. విత్తనాలలో తెగుళ్లను కలుగజేసే సూక్ష్మక్రిములు బీజాల రూపంలో ఉండి తిరిగి విత్తనాలను నాటినప్పుడు చీడపీడల రూపంలో బయటపడతాయి. సాధారణంగా రైతు సోదరులు పైరుకు తెగుళ్లు ఆశించినప్పుడు మాత్రమే శిలీంద్ర రసాయనాలను పిచికారి చేస్తారు. తెగుళ్లు ప్రారంభ దశలోనే గమనించకపోవటం, సకాలంలో సస్యరక్షణ చేపట్టకపోవడంవల్ల తెగుళ్ల నివారణ రైతులకు కష్ట సాధ్యమవుతుంది. విత్తనం మంచిదైతేనే పంట బాగుంటుంది. కాబట్టి కనిపించని శిలీంద్రాల బారి నుంచి పలు విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తనశుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది.

విత్తనశుద్ధిలో రకాలు

[మార్చు]

పొడి విత్తనశుద్ధి

[మార్చు]

తడి విత్తనశుద్ధి

[మార్చు]

విత్తనశుద్ధి వలన ప్రయోజనాలు

[మార్చు]
  • విత్తనాన్ని శుద్ధి చేయటం వలన విత్తనాలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.
  • భూమిలో, విత్తనాలలో వుండే, సూక్ష్మ క్రిములనుంచి, మొలకెత్తే విత్తనాలను, చిరుమొక్కలను కాపాడుతుంది
  • ఎక్కువ విత్తనాలు మొలకెత్తుతాయి
  • త్వరగా, ఒకే రీతిలో మొలకలు వచ్చి, ఎదుగుతాయి
  • పప్పు జాతి పంటలలో ఎక్కువ కణుపులు రావడానికి తోడ్పడుతుంది
  • భూమిలో కాని, మొక్కలకు కాని మందుచల్లడం కంటే మెరుగైనది
  • ప్రతికూల పరిస్థితులలో కూడా (గాలిలో తేమశాతం తక్కువగా / ఎక్కువగా వున్నప్పుడు కూడా) పంట ఒకే తీరులో వుంటుంది

విత్తన శుద్ధికి అనుసరించవలసిన విధానం

[మార్చు]

విత్తన శుద్ధి అనే మాట ఇటు ఉత్పత్తులకు, అటు ప్రక్రియలకు రెండిటికీ వర్తిస్తుంది. విత్తనాలను ఈ కింది విధానాలలో శుద్ధిచేయవచ్చు.

  1. విత్తనాలకు పైపూత: ఇది సర్వ సాధారణంగా అనుసరించే విత్తన శుద్ధి విధానం. తడి లేదా పొడి పదార్ధాలను విత్తనాలకు పైపూతగా వాడవచ్చు. పొలంలోను, పరిశ్రమలలోను కూడా ఈ పైపూతను వేయవచ్చు. విత్తనాలను, క్రిమిసంహారక ( పురుగు ) మందులను కలపడానికి చౌకగా లభించే మట్టి కుండలను రైతులు వాడవచ్చు. లేదా విత్తనాలను ఒక పాలిథిన్ షీటుమీద పరచి, తగిన పరిమాణంలో రసాయనికాలను ఆ విత్తనాల రాశిపై చిలకరించి, యంత్రాల సహాయంతో వాటిని బాగా కలపవచ్చు.
  2. విత్తనాలకు దళసరి పైపూత ( సీడ్ కోటింగ్ ) : శుద్ధిచేసే పదార్థం విత్తనానికి అంటుకుని వుండడంకోసం, ఒక ప్రత్యేక జిగురు లాంటి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. కోటింగ్‌కు మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం.
  3. విత్తనం చుట్టూ గుళికను ఏర్పాటుచేయడం (సీడ్ పెల్లెటింగ్) : మిక్కిలి అధునాతనమైన విత్తన శుద్ధి ప్రక్రియ. దీనివల్ల విత్తనపు స్వరూపం మారుతుంది. యంత్రాల ద్వారా విత్తడం తేలికవుతుంది.అయితే, ఈ పెల్లెటింగ్ ప్రక్రియకు ప్రత్యేక యంత్రాలు, ప్రత్యేక పరిజ్ఞానం అవసరం. విత్తనాల శుద్ధిలో ఇది అన్నిటికంటె ఖరీదైన పద్ధతి.
పంట తెగులు / వ్యాధి విత్తన శుద్ధి విధానం వివరణ

వివిధ పంటలలో సిఫారసు చేయబడిన విత్తన శుద్ధి విధానాలు

[మార్చు]

చెరకు వేరు కుళ్ళు తెగులు, ఎండు తెగులు కార్బెంఢాజిం (0.1%) 2 గ్రాములు / కిలోవిత్తనానికు ట్రైకోడెర్మా ఎస్‌పిపి. 4-6 గ్రాములు/కిలో విత్తనాని కి విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు / మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు వరి వేరు కుళ్ళు తెగులు ట్రైకోడెర్మా 5-10 గ్రాములు/ కిలోవిత్తనాలకు (నారు నాటడానికి ముందు)


విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు / మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు ఇతర క్రిములు / తెగుళ్ళు క్లోరో పైరిఫాస్ 3 గ్రాములు / కిలో విత్తనంకు

ఎండు తెగులు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 0.5% డబ్ల్యు . పి. 10 గ్రాములు / కిలో విత్తనానికు వేరు ముడుత తెగులు 0.2 % మోనోక్రోటోఫాజ్ లో 6 గంటలపాటు విత్తనాలను నాననివ్వాలి పొడ తెగులు 0.2 % మోనోక్రోటోఫాజ్ లో విత్తనాలను నాననివ్వాలి మిరప నారుకుళ్ళు తెగులు విత్తన శుద్ధి : ట్రైకోడెర్మా విరిడే 4 గ్రాములు / కిలో విత్తనాలకు కార్బెండజైం 1గ్రాము / 100 గ్రాముల విత్తనాలకు విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు / మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు భూమి నుండి సంక్రమించే ఫంగస్ కుళ్ళు తెగులు ట్రైకోడెర్మా విరిడే 2 గ్రాములు / కిలో విత్తనాలకు ; సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 10 గ్రాములు / కిలో విత్తనాలకు ; కాప్టాన్ 75డబ్ల్యు ఎస్ 1.5-2.5 గ్రాములు ఏ ఐ / లీటరు రసం పీల్చు పురుగు, పచ్చ దోమ, తెల్లనల్లి, తామరపురుగులు ఇమిడాక్లోరోఫిడ్ 70 డబ్ల్యు ఎస్ 10-15 గ్రాములు ఏ ఐ / కిలో విత్తనాలకు కంది ఎండు తెగులు, వేరు కుళ్ళు తెగులు ట్రైకోడెర్మారకాలు 4 గ్రాములు / కిలో విత్తనానికు వేరుశనగ వేరుకుళ్ళు తెగులు విత్తన శుద్ధి : బాసిల్లస్ సబ్ట్ లిస్ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ భూమిలో వేయడానికి: 2.5-5.0 కిలోల / వందగ్రాముల పశువుల పెంటలో … లేదా కార్బెండాజిం లేదా కాప్టాన్ 2 గ్రాములు/కిలో విత్తనానికి తెల్ల మచ్చ థైరాం+కార్బెండజైం2 గ్రాములు / కిలో విత్తనాలకు కార్బెండజైం లేదా కాప్టాన్ 2 గ్రాములు / కిలో విత్తనాలకు బెండ వేరు ముడుత తెగులు పేసిలో మైసెస్ లిలాసినస్ + సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 10 గ్రాములు / కిలో విత్తనాలకు ...పైపూతగా విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు / మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు టొమాటో మొదలుకుళ్ళు తెగులు ఎండుతెగులు బూజుతెగులు నారుకుళ్లు తెగులు

టి.విరైడ్ 2 గ్రాములు / 100 గ్రాముల విత్తనాలకు కాప్టాన్ 75డబ్ల్యు ఎస్ 1.5-2.0 గ్రాములు ఏ ఐ / లీటరుకు సూడోమొనాస్ ఫ్లోరసెన్స్ + వి. క్లమైడో స్పోరియం 10 గ్రాములు / కిలో విత్తనాలకు.....పైపూతగా ధనియాలు ఎండుతెగులు ట్రైకోడెర్మా విరైడ్ 4 గ్రాములు / కిలో విత్తనాలకు వంకాయ బాక్టీరియా ఎండుతెగులు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 10గ్రాములు / కిలో విత్తనాలకు పఫ్పుజాతి (లెగ్యూమినస్) పంటలు నేల ద్వారా సంక్రమించే తెగులు ట్రైకోడెర్మా విరైడ్ 2 గ్రాములు / 100 గ్రాముల విత్తనాలకు వేరు ముడుత తెగులు కార్బోఫ్యురాన్/ కార్బోసల్ఫాన్ 3% (డబ్ల్యు /డబ్ల్యు) పొద్దు తిరుగుడు విత్తనం కుళ్ళు ట్రైకోడెర్మా విరైడ్ 6 గ్రాములు / కిలో విత్తనాలకు రసం పీల్చు పురుగు, తెల్ల దోమ ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్ ఎస్ 5-9 గ్రాములుఏ ఐ/ కిలో విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యు ఎస్ 7గ్రాములుఏఐ/కిలో విత్తనాలకు గోధుమ చెదపురుగులు విత్తడానికి ముందుగా, ఈ కిందపేర్కొన్న పురుగు మందులలో దేనితోనైనా విత్తనాలను శుద్ధి చేయాలి. క్లోరోపైరిఫాస్ 4 మి.లీ/కిలో విత్తనాలకు లేదా ఎండోసల్ఫాన్ 7 మి.లీ/కిలో విత్తనానికు విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు / మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు నల్ల వెన్ను తెగులు/ నల్ల గింజ తెగులు థైరాం 75 % డబ్ల్యు పి కార్బాక్సిన్ 75 % డబ్ల్యు పి టెబ్యుకోనజోల్ 2 డి ఎస్ 1.5-1.87 గ్రాములు ఏఐ / కిలో విత్తనాలకు టి. విరైడ్ 1.15 % డబ్ల్యు పి 4 గ్రాములు / కిలో విత్తనాలకు క్యాబేజి, కాలీ ఫ్లవర్, నూల్‌కోల్, ముల్లంగి, బ్రొకోలి (క్రూసిఫెరస్ కూరగాయలు) భూమికి / విత్తనానికి సంబంధించిన తెగుళ్ళు (బూజు తెగులు) వేరు ముడత తెగులు ట్రైకోడెర్మా విరైడ్ 2 గ్రాములు / 100 గ్రాముల విత్తనాలకు కాప్టాన్ 75%డబ్ల్యు ఎస్ 1.5-2.0 గ్రాములు ఏఐ/ లీటరుకు భూమిని తడపడానికి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ + వర్టీసీలియం క్లామిటోస్పోరియం 10గ్రాములు / కిలో విత్తనాలకు శనగ ఎండుతెగులు, కుళ్లు తెగులు ట్రైకోడెర్మా విరైడి1 % డబ్ల్యు పి 9 గ్రాములు/కిలో విత్తనాలకు + కార్బెండజైం+కార్బోసల్ఫాన్ 0.2% కార్బెండజైం+థైరాం+ కార్బోసల్ఫాన్ం.2% క్లోరోపైరిఫాస్20 ఇ సి 15-30 మి.లీ ఏ ఐ / కిలో విత్తనాలకు

విత్తనాల పైపూతకు ఇనుప డబ్బాలు / మట్టి కుండలు / పాలిథిన్ సంచులను ఉపయోగిస్తారు బంగాళా దుంప లేదా ఆలు భూమి దుంప ద్వారా వ్యాపించే శిలీంధ్రాలు నిల్వచేయడానికి 20 నిమిషాల ముందు ఈ క్రింది రసాయనాలు దేనితోనైనా విత్తన శుద్ధి చేయాలి ఎం ఇ ఎం సి 3% డబ్ల్యు ఎస్ 0.25 % లేదా బోరిక్ ఆమ్లము3% బార్లీ నల్ల వెన్ను తెగులు/ నల్లగింజ తెగులు ఆకులకు పొడలు చెదపురుగులు కార్బాక్సిన్ 75 % డబ్ల్యు పి థైరాం 75 % డబ్ల్యు పి 1.5-1.87 గ్రాములు ఏ ఐ / కిలో విత్తనాలకు క్లోరోపైరిఫాస్ 4 మి.లీ / కిలో విత్తనాలకు

కాప్సికం వేరు ముడత తెగులు సూడోమొనాస్ ఫ్లోరసెన్స్ 1% డబ్ల్యు పి, పేసిలో మైసెస్ లిలాసినస్ +వర్టీసీలియం క్లామిటోస్పోరియం 1% డబ్ల్యు పి 10గ్రాములు / కిలో విత్తనాలకు

ఇవి కూడా చూడండి

[మార్చు]

నాటడము

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

అన్నదాత - అక్టోబరు 2012

వనరులు

[మార్చు]
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]