విద్యార్థుల వసతి గృహాలు (ఆంధ్రప్రదేశ్)
విద్యాలయాలకు అనుబంధంగా విద్యార్ధుల వసతిగృహాలు నిర్వహిస్తారు. ఇవి ప్రభుత్వరంగంలో ఎక్కువగా వుండగా, ప్రైవేట్ రంగంలోకూడా వున్నాయి. సాంఘీక సంక్షేమ శాఖ, వెనుకబడినతరగతుల సంక్షేమశాఖ, ఆదిమజాతుల సంక్షేమశాఖ, నైవాస్య పాఠశాలలు, కళాశాలలు నడిపే సంస్థలు విద్యార్థి వసతిగృహాలను నడుపుతాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా 2010 లో దాదాపు 5000 విద్యార్ధుల వసతి గృహాలు నిర్వహిస్తున్నది. దీనిద్వారా 8 లక్షల మందివిద్యార్ధులు లబ్ధి పొందుతున్నారు. కాచిగూడ హాస్టల్ [1] పేరు పొందిన వాటిలో ఒకటి. 2018 లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ 898 వసతిగృహాలు నిర్వహిస్తుంటే, వాటిలో 74282 మంది బాలబాలికలు వసతిపొందుతున్నారు. [2]
ప్రవేశం
[మార్చు]వసతి గృహాల ప్రవేశానికి దరఖాస్తులు సాధారణంగా 31 మే నుండి ఇవ్వబడతాయి. జూలై 15 న అభ్యర్థుల ప్రవేశాన్ని ప్రకటిస్తారు. నివాసం 5 కి మీ పైబడిన దూరంలో వుండాలి, విద్యార్థితల్లి దండ్రులు సామాజిక వర్గము, ఆదాయ నిబంధనలకులో బడి, దగ్గరి పాఠశాలలో ప్రవేశం పొంది వుండాలి.
బయటి లింకులు
[మార్చు]వనరులు
[మార్చు]- ↑ "కేరాఫ్ కాచిగూడ హాస్టల్". ఆంధ్రజ్యోతి.[permanent dead link]
- ↑ "BC Welfare Hostel monitoring System". Archived from the original on 2018-02-02. Retrieved 2020-01-13.