విద్య సురవరపు
విద్య సురవరపు బాల గాయిని. 2023 2024లో జరిగిన పాడుతా తీయగా కార్యక్రమం లో పాల్గొని ద్వితీయ విజేతగా నిలిచింది.[1]
జీవిత విశేషాలు
[మార్చు]విజయవాడకు చెందిన విద్య సురవరపు, టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జన్మించారు. విద్య సురవరపు భారతదేశానికి 10 సంవత్సరాల వయసులో తిరిగి వచ్చింది. విద్య సురవరపు తల్లి గాయత్రి సాఫ్టువేరు ఇంజనీర్. విద్య తండ్రి రవికాంత్ సురవరపు డిజైన్ ఇంజనీర్. విద్యకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి సంగీతం పట్ల ఆసక్తి ఉండేది. విద్య ప్రతిభను గుర్తించిన తల్లి గాయత్రి విద్యను సంగీత శాలలో చేర్పించింది. విద్య తన చెల్లి ఉమతో పాటు విజయవాడకు చెందిన సంగీతకారుడు సుధాకర్ వద్ద శిక్షణ తీసుకుంది.విద్య అనేక జాతీయ, అంతర్జాతీయ సంగీత పోటీల్లో పాల్గొని తన ప్రతిభ కనబరిచింది. విద్య నాలుగు సంవత్సరాల వయస్సులో ఆస్టిన్ జరిగిన సూపర్ సింగర్ కార్యక్రమంలో పాల్గొని మొదటి బహుమతిని తెలుసుకుంది, 2019 అమెరికాలో జరిగిన తానా ధిమ్ తానాలో క్లాసికల్‌లో పాల్గొని బహుమతిని రెండవ బహుమతిని గెలుచుకుంది.2023లో బెంగళూరులో జరిగిన వీణాధారి అంతర్జాతీయ సంగీత పోటీలలో పాల్గొని మొదటి విజేతగా నిలిచింది.సంగీతంతో పాటు, బెంగళూరులోని ఇన్వెంచర్ అకాడమీలో చదువుతున్న విద్య, గణితం సైన్స్ లో తన ప్రతిభ ను కనబరుస్తుంది. విద్య తాతయ్య ఆయుర్వేద వైద్యుడు హరికుమార్ విజయవాడలో నివసిస్తున్నాడు. విద్య ఒక పాటను 40 నుండి 50 సార్లు వింటుంది.
మూలాలు
[మార్చు]- ↑ Kumar, K. Kalyan Krishna (2024-06-02). "A girl's passion for singing takes her to top in music world". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-07-03.