Jump to content

వినువీథి

వికీపీడియా నుండి

వినువీథి ఎ.వి.యస్. రామారావు రచించిన ఖగోళ శాస్త్ర గ్రంథం. ఈ గ్రంథానికి ముందుమాట శ్రీ డా. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి వ్రాయగా, భూమికను శ్రీ. ఎం.వి. నరసింహస్వామి రచించారు. ప్రచురణ కాలానికి లభించిన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పలు విషయాలతో సవివరంగా రచించిన గ్రంథమిది. ఈ గ్రంథానికి మదరాసు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ ఖగోళశాస్త్ర గ్రంథం బహుమతి లభించడం విశేషం.

దీని ప్రథమ ముద్రణము జనవరి 1955 సంవత్సరంలో ఆధునిక విజ్ఞాన గ్రంథమాల, కాకినాడ వారు ప్రచురించారు.[1]

రామారావు ఈ గ్రంథంలో వినువీధినంతటినీ చక్కగా పర్యవేక్షించిరి. భూమి ఆకారము, భ్రమణం, పరిభ్రమణ కారణము, ద్రవ్యరాశి వంటి అనేక విజ్ఞాన విషయాలన్నింటినీ ఇందులో చేర్చిరి. తరువాత దృశ్యమానవ భోగోళము, నక్షత్రరాశులు, సూర్యకుటుంబం, నక్షత్రములు, గాలక్సీలు, నెబ్యులాలు వంటి అన్ని విషయములను ఈ 300 పుటల పుస్తకంలో వివరించబడినవి.

ఈ పుస్తకమున ప్రచురించిన 4,5,6,7,9,17 పటముల ఛాయాచిత్రములను కోడైనెనాల్ అబ్సర్వేటరీవారు, 18వ పటము ఛాయాచిత్రమును చైజాయియా అబ్జర్వేటరీ వారు, 19 వ పటము ఛాయాచిత్రమును ఇయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు, 11,24,28, 30, 31, 32 పటముల ఛాయాచిత్రములను సయిస్సు సొసైటీ, మద్రాసు వారు అందజేసిరి.

మంచి ఛాయాచిత్రములతో అనేక ఖగోళ అంశాలను ఈ పుస్తకంలో చూడవచ్చు.

విశేషాలు

[మార్చు]
  1. ప్రస్తావన
  2. భూమి
  3. నభోగోళము
  4. నక్షత్రరాశులు
  5. సూర్యకుటుంబము
  6. సూర్యుడు
  7. చంద్రుడు
  8. గ్రహములు
  9. తోకచుక్కలు
  10. ఉల్కలు
  11. నక్షత్రములు
  12. గేలాక్సీలు, నెబ్యులాలు
  13. ఉపసంహారము

మూలాలు

[మార్చు]
  1. "వినువీధి | VinuVeedhi". www.freegurukul.org. Retrieved 2020-08-25.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వినువీథి&oldid=3929522" నుండి వెలికితీశారు