విప్లవ జ్యోతి
విప్లవ జ్యోతి | |
---|---|
దర్శకత్వం | ఎ. విన్సెంట్ |
రచన | ఎ. విన్సెంట్, విత్నంవీడు సుందరం |
నిర్మాత | బసిరెడ్డి నారాయణరెడ్డి |
తారాగణం | శివాజీ గణేశన్ జెమినీ గణేశన్ కమల్ హాసన్ కె.ఆర్.విజయ |
ఛాయాగ్రహణం | ఎ. వెంకట్ |
కూర్పు | టిఆర్ శేఖర్ |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్ |
నిర్మాణ సంస్థ | శ్రీలక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | జనవరి 28, 1983 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విప్లవ జ్యోతి 1983, జనవరి 28న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీలక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బసిరెడ్డి నారాయణరెడ్డి నిర్మాణ సారథ్యంలో ఎ. విన్సెంట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, కమల్ హాసన్, కె.ఆర్.విజయ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎం. ఎస్. విశ్వనాథన్ సంగీతం అందించాడు.[1]
కథ
[మార్చు]శివాజీ గణేశన్ ఒక భూస్వామి. తన భార్య కె. ఆర్. విజయ, చెల్లెలు ఫటాఫట్ జయలక్ష్మితో కలిసి నివసింస్తుంటాడు. తన కుటుంబానికి తెలియకుండా, అతను పట్టణంలోని బ్రిటిష్ వారిని ఎదిరించి భయభ్రాంతులకు గురిచేసి అక్కడి స్థానికులకు సహాయపడే ఒక ముఠా ముసుగు వేసుకున్న నాయకుడిగా కూడా ఉంటాడు. మాజీ సైనికుడు ఒకడు ఈ సంతాన తేవర్ ముఠాలో చేరి, అందులోని వారితో స్నేహంచేసి ఇద్దరూ ఒకటేనని గ్రహిస్తాడు. ఒక దాడి సమయంలో శివాజీ గణేశన్ గాయపడడంతో, అందరూ అతను చనిపోయినట్లు భావిస్తారు. చివరికి, బ్రిటిష్ వారు శివాజీ గణేశన్ ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుంటారు, అతన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నంలో జయలక్ష్మీ హత్య చేయబడుతుంది. కెఆర్ విజయకి ఇచ్చిన మాటకోసం శివాజీ గణేశన్ లొంగిపోతాడు. కానీ, చివరి క్షణంలో మరణశిక్ష నుండి తప్పించుకుంటాడు. భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో విముక్తి పొందుతాడు. చాలా సంవత్సరాల తరువాత, తన కుటుంబాన్ని కలుసుకుంటాడు. అతని కుమారుడు రంజిత్ (కమల్ హాసన్) తన తండ్రిత్యాగం వల్ల కుటుంబానికి కష్టాలు వచ్చాయని కోపంతో ఉంటాడు. తండ్రికొడుకులు గొడవ పడుతారు.
తారాగణం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ. విన్సెంట్
- నిర్మాత: బసిరెడ్డి నారాయణరెడ్డి
- చిత్రానువాదం: ఎ. విన్సెంట్, విత్నంవీడు సుందరం
- సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
- ఛాయాగ్రహణం: ఎ. వెంకట్
- కూర్పు: టిఆర్ శేఖర్
- నిర్మాణ సంస్థ:శ్రీలక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Viplava Jyothi (1982)". Indiancine.ma. Retrieved 2020-08-29.