విమల (రచయిత్రి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విమల
Vimala poet.jpg
విమల
జననం
విమల మోర్తల

1963

విమల 1963 లో జన్మించారు.ఈమె ప్రముఖ తెలుగు కవయిత్రి[2] .విమోచన పత్రికా సంపాదకురాలు: అడవి ఉప్పొంగిన రాత్రి వీరి ప్రచురిత కవితాసంపుటం(1986). వీరు ఉద్యమ స్ఫూర్తితో రచనలు చేస్తూ, స్త్రీ స్వేచ్చా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు.ప్రస్తుతం ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు[3]ఈ టీవీ-2, సాక్షి టీవీ లకు స్త్రీల కార్యక్రమ రచయిత గా ఉన్నరు.ప్రస్తుతం అమన్ వేదిక రైన్ బో హోమ్స్ అనే పిల్లల సంస్థ కు సలహాదారు( కన్సల్ టెంట్) గా ఉన్నారు. ఈమె రాసిన రెండు కవితలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బిఏ పాఠ్యాంశంగా చేర్చారు.అంబేద్కర్ దూర విద్యా విధాన పాఠ్యాంశములలోనూ చేర్చారు.[4].ప్రకృతి పౌండేషన్ సభ్య కళాకారులలో ఒకరు.[5]

సాహిత్య కృషి[మార్చు]

విమల కవిత్వాన్ని విప్లవ స్త్రీవాద కవిత్వంలో రెందవ దశ లో ఉన్నట్లు గుర్తిస్తారు. ఎమర్ఝన్సీ రోజుల తర్వాత నుండి 2000 సంవత్సరము వరకూ వెలువడిన కవిత్వాన్ని రెండవ దశగా పరిగణించడం జరుగుతుంది.విప్లవ కవిత్వాన్ని సున్నితంగా చెప్పడం అనే కళా నైపుణ్యం ఈమె లో చూడొచ్చు.మృగన లోని చాలా కవితలు 1990 ల తరువాత రాసినవే స్త్రీవాదమూ విప్లవ రెండూ ఉంటాయి.ు[6] అడవి ఉప్పొంగిన రాత్రి ఈమె కలం నుండి జాలువారిన స్త్రీవాద కవితా సంపుటం.[7]

విమల కవిత్వంలో ప్రధాన లక్షణం ఆమె అనుభవాల గాఢత. రెండవది: ఆమెను ఆవరించిన ఏకాంతత. మరో విశేషం: స్మృతులను ఎంతగా నెమరువేసుకున్నా, వాటిల్లో భంగపాట్ల తలపోతలు, పశ్చాత్తాపాలూ ఉండవు. కోల్పోయిన ఆత్మీయుల పట్ల తనివి తీరని ఇష్టం కనిపిస్తుంది.

‘‘చీకటి ఆకాశాన మెరిసే/ ఇన్నిన్ని నక్షత్రాలలో మీరెవరు?/ మా కన్నీళ్లు తుడిచేందుకు మృత్యువును స్వచ్ఛందంగా ముద్దాడిన మీరెక్కడ?/ అకాల మర ణాన్ని వరించిన/ నా ప్రియ సహచరుల జాడల్ని వెతుక్కుంటూ/ ఈ రాత్రి చెప్పరాని నిరాశతో/ దుఃఖంతో, క్రోధంతో, ఆకాశాన్ని ఎలుగెత్తి పిలుస్తాను.’’

విప్లవ కవులుగా ప్రసిద్ధులైన కవి పరంపరలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఇష్టపడే ఇద్దరి కవిత్వ ప్రకటన రీతి ఒకరు శ్రీ శివసాగర్ ఐతే మరొకరు విమల. విమలకు విశేషించి- ఇతివృత్తం మాత్రమే కవిత్వమనే భావం కాకుండా అంతకుమించిన ‘‘అనుభవానికి’’ విలువ ఇవ్వడం ఆమె ప్రత్యేకత.జీవితాన్ని ప్రేమించగల వాళ్లే ఈ విధంగా రాయగలరని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ అభిప్రాయం. [8]

మాతృత్వం విషయంలో స్తీ లను ఓ పునర్త్పత్తి పరికరమా అని సంభోధించారు.[9] స్త్రీవాద కవిత్వంలో విమల రాసిన “వంటిల్లు”; “సౌందర్యాత్మక హింస” అన్న కవితలు రెండూ కూడా చాలా ముఖ్యంగా చెప్పవలసినవి![10]

ఆడవాళ్ళ కలల్లో సైతం “వంటిల్లు” అవిభాజ్యమైన బంధంగా ఎలా భాగమైపోతుందో చాలా బలంగా వ్యక్తీకరించిన కవిత “వంటిల్లు

స్త్రీ తన కవితా వస్తువు పట్ల చూసే చూపు కచ్ఛితంగా తనదైన స్పష్టతను కలిగి ఉంటుంది. 'మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం/ గరిట తిప్పడంగా చేసిన ఈ వంటిళ్ళను / ధ్వంసం చేద్దాం రండి!/ ఇక గిన్నెలపై ఎవ్వరి పేర్లూ వద్దు / వేర్వేరు స్వంత పొయ్యిలను / పునాదులతో సహా తవ్విపోద్దాం రండి!' అని విమల రాసిన కవిత్వం [11]


“భయం భయంగా నిశ్శబ్దంగా నిరాశగా

మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందిక్కడ

అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుంది.

… ఆమెను చూస్తే ఒక గరిటె గానో … పెనం లానో …

మా వంటింటిని అలంకరించిన ఒక పరికరంలానో ఉంటుంది!

ఒక్కోసారి ఆమె

మండుతున్న పొయ్యి లాగా కూడా వుంటుంది. .. ... మన రక్తం పీల్చేసి, మన ఆశల్నీ, కలల్నీ కాజేసి

కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న

రాకాశి గద్ద ఈ వంటిల్లు.[12]కవయత్రి విమలగారు రాసిన వంటిల్లూ, సౌందర్యాత్మక హింస కవిత్వంలో ఓ “అమ్మ, ఓ మహిళ” పడుతున్న కొన్ని వివక్షలను ప్రస్పుటంగా వివరించారు.[13]విమల గారి ‘సౌందర్యాత్మక హింస’ కవిత పోటీల్లో నెగ్గటం కోసం చేసే ఆ సౌందర్య సాధన వెనక ఆ స్త్రీలు తెలిసీ- తెలియకా అనుభవించే దు:ఖాన్నీ, నిస్సహాయతనూ సహానుభూతితో పంచుకుని రాసిన కవిత ఇది. ఆలోచనలు రేపే శక్తిమంతమైన వ్యక్తీకరణలు ఈ కవితను చిరస్మరణీయం చేశాయి. మొదటి పాదమే సూటిగా విషయాన్ని చెప్పేస్తుంది.

‘మనమంటే 34, 24, 35 కొలతలమైన చోట మొటిమలు మొలవడం, జుట్టురాలడం నడుం సన్నగా లేకపోవడమే మన నిరంతరాందోళనలైన చోట’-[14]

రచనలు[మార్చు]

 • సౌందర్యాత్మక హింస
 • వంటిల్లు
 • అడవి ఉప్పొంగిన రాత్రి-తెలుగు కవితా సంపుటి
 • వదిలేయాల్సి వచ్చిన ఇల్లు [15]
 • పక్షిరెక్కల చప్పుడు
 • ఒక ఇసుక దారి
 • మాకొద్దీ చంఢాలంం( ఆంద్ర ప్రదేశ్ లోని మురుగు నీటి కార్మికుల వ్యధలు) కు సహ రచయిత గా వ్యవహరించారు. హైదారాబాదు బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ
 • మృగన(వెతకుట)-తెలుగు కవితా సంపుటి
 • మా( అమ్మ)-హిందీ భాష లోనికి అనువదింపబడి,ప్రచురణ జరిగింది


మూలాలు[మార్చు]

 1. https://kolimi.org/మా-రచయితలు/
 2. "తెలుగు మహిళల కవితా కాహళి- ఐదవ తరం". Chennai, India. Cite has empty unknown parameter: |1= (help)
 3. "తెలుగు మహిళల కవితా కాహళి- ఐదవ తరం". Chennai, India. Cite has empty unknown parameter: |1= (help)
 4. http://prakritifoundation.com/artiseprofile/vimalamorthala/
 5. http://prakritifoundation.com/artiseprofile/vimalamorthala/
 6. http://virasam.org/article.php?page=1263
 7. https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/104656/7/07_chapter-1.pdf
 8. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-507970
 9. https://www.tejasviastitva.com/wp-content/uploads/2018/11/sthreevada-kavitvam-sthree.pdf
 10. "అసమానతపై అక్షరాగ్రహంం". 10 ఫిబ్రవరి 2019.
 11. "అసమానతపై అక్షరాగ్రహంం". 10 ఫిబ్రవరి 2019.
 12. http://maalika.org/magazine/2015/03/15/స్త్రీవాద-సాహిత్యం/
 13. https://chaibisket.com/telugu-poems-about-indian-women-by-vimala-garu-that-will-melt-your-heart/
 14. http://venuvu.blogspot.com/2013/07/blog-post.html
 15. http://vaakili.com/patrika/?p=16129

ఇతర లింకులు[మార్చు]