Jump to content

విముక్తి కోసం

వికీపీడియా నుండి
విముక్తి కోసం
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఉదయకుమార్
తారాగణం సాయిచంద్ ,
పద్మ
నిర్మాణ సంస్థ ప్రజా చిత్ర
భాష తెలుగు

విముక్తి కోసం 1983 డిసెంబరు 23న విడుదలైన తెలుగు సినిమా. ప్రజాచిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై పి.సురేందర్ నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. సాయిచంద్, పద్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.గోపాలం సంగీతాన్నందించాడు.[1]

తిరగబడి తీరందే జరుగుబాటు లేదని గ్రహించిన కష్ట జీవులు చైతన్య వంతులై భూమి కోసం, భుక్తి కోసం భూస్వాముల దోపిడీ నుండి విముక్తి కోసం ఉద్యమించిన సమరశీల పోరాట కథకు చక్కని రూప కల్పన చేసిన చిత్రం ఇది.

ఒక గ్రామంలో రాజా పాపినాయుడు దోపిడీ వ్యవస్థకు ప్రతినిథి. తమ బ్రతుకులు ఇంతే అనుకొనే బానిస మనస్తత్వంతో గ్రామంలోని పాలేరులు, కూలీలు భూస్వాముల ఉక్కు పాదాల క్రింద నలిగి పోతుంటారు. ఊరికి కరెంటు వస్తుంది. పాపినాయుడు ఇంట్లో విద్యుద్దీపాలు వెలిగినా, పేదోళ్ళ గుడిసెల్లో వెలిగింది చమురు దీపాలే.

సత్తిగాడు (సత్యం) స్వతంత్రంగా జీవించాలనే కోరికతో ఎవరివద్దా పాలేరుగా పనిచేయడానికి అంగీకరించడు. ఆ గ్రామానికి "సంగం" మనిషి రావడంతో కష్ట జీవులలో చైనత్య జ్యోతి వెలుగుతుంది. పాపినాయుడు ఋణం తీర్చుకోవడానికి సత్యం పాలేరుగా చేరుతాడు. యజమాని మంచివాడనే భ్రమలో ఉన్న సత్యానికి ఆలస్యంగా జ్ఞానోదయమవుతుంది. కష్ట జీవులంతా ఏకమవుతారు. జీతం పెంచాలని సమ్మె చేసి విజయం సాధిస్తారు. సత్యాన్ని ప్రేమించిన సరస అతడిని సంగం మార్గానికి నడిపిస్తుంది. సంగం మనిషిపై భూస్వాములు దౌర్జన్యం చేస్తారు. కష్ట జీవులలో ఆవేశం కట్టలు తెగింది. విముక్తికోసం ఉస్యమిస్తారు.

తారాగణం[2]

[మార్చు]
  • సాయిచంద్ - సత్యం
  • కాకరల
  • చలపతి రావు - పాపినాయుడు
  • ప్రతాప్
  • పద్మ
  • జయమాల
  • పిడి నాయుడు
  • బుట్చి రాజు
  • గోపాల కృష్ణ
  • మల్లా రెడ్డి
  • రామలింగ స్వామి
  • వెంకట రావు
  • సర్వేశ్వరరావు
  • వాసు
  • నాగమణి
  • తులసి
  • సూర్య కుమారి
  • గరగ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, సంభాషణలు: భూషణం
  • స్క్రీన్ ప్లే: హరి
  • సాహిత్యం: వంగపండు ప్రసాదరావు
  • సంగీతం: టి. గోపాలం
  • ఛాయాగ్రహణం: ఎం.వి.రఘు
  • నిర్మాతలు: ఎస్పీ సురేందర్, ఎన్.లక్ష్మణరావు
  • దర్శకుడు: ఉదయ్ కుమార్
  • అంకితం: శ్రీశ్రీ

పాటల జాబితా

[మార్చు]

1.అంబాతక్కడే ఓయ్ కుంభలు కట్టి అజామ్ర , రచన: వంగపండు, గానం.ఎస్.జానకి బృందం

2 . ఎహే ఓహో లెండిరా కమ్మి తీయ రండిరా, రచన: వంగపండు ప్రసాదరావు, గానం.జి.ఆనంద్ , ఎస్.పి.శైలజ బృందం

3.తిరుగు తిరుగులో ఉయ్యాలో , రచన: వంగపండు, గానం.బృందం

4 . పొలాలన్నీ హలాల దున్ని , రచన: వంగపండు, గానం.బృందం

5. రండోరో కూలన్న రండిరో రైతన్న , రచన: వంగపండు, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం

6 రావణా సెండులాలో వెన్నెల రాగాన్ని, రచన: వంగపండు, గానం.ఎస్.పి.శైలజ బృందం

7.సువ్వి సువన్నలు ఓయాన్నల్లారా చూడండి తల్లులు , రచన: వంగపండు, గానం.జి.ఆనంద్ బృందం .

మూలాలు

[మార్చు]
  1. "Vimukthi Kosam (1983)". Indiancine.ma. Retrieved 2021-06-05.
  2. "విముక్తి కోసం స్టోరి | Vimukti Kosam Tollywood Movie Story, Preview in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2021-06-05.

. 3.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]