Jump to content

విరాట్ రామాయణ్ మందిరము

వికీపీడియా నుండి
విరాట్ రామాయణ్ మందిరము
దస్త్రం:ViraatRamayanMandir.jpg
విరాట్ రామాయణ్ మందిరము నిర్మాణ పటము
మతం
అనుబంధంHinduism
జిల్లాతూర్పు చంపారన్
స్థానం
ప్రదేశంకేసరియా
దేశంభారతదేశము
పటం
Interactive map of విరాట్ రామాయణ్ మందిరము
నిర్మాణ శైలి
సృష్టికర్తమహావీర్ మందిర్ ట్రస్ట్, పాట్నా
Website
official page

విరాట్ రామాయణ్ మందిరము ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయము. దీని దేవాలయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2013 నవంబరు 13 బుధవారం ఆవిష్కరించారు. సుమారు 20 వేల మంది కూర్చునే సామర్ధ్యముతో త్వరలో నిర్మించబోయే ఈ దేవాలయం ఎత్తు 405 అడుగులు ఎత్తు ఉంటుంది . ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సమక్షంలో విరాట్ రామాయణ్ మందిర్ కు శంకుస్థాపన చేశారు.

నిర్మాణము

[మార్చు]

అత్యంత సంపన్న ట్రస్ట్ గా పేరొందిన మహావీర్ మందిర్ ట్రస్ ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టింది. 500 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ దేవాలయాన్ని పాట్నాకు 125 కిలో మీటర్ల దూరంలోని దక్షిణ చంపారన్ జిల్లాలోని కెసారియా సమీపంలోని జంకి నగర్ లో నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి మహావీర్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంబోడియాలోని 12వ శతాబ్దంలో నిర్మించిన ఆంగ్‌కోర్ వాట్ఆలయము (215 అడుగులు) కు రెండింతలు పెద్దదిగా ఉంటుంది.ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 18 దేవాలయాలు ఉంటాయి. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే శివాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని నిర్మించబోతున్నారు.