విరియాల కామసాని గూడూరు శాసనం
Appearance
గూడూరు శాసనం సా.శ.1124 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్నది. ఈ ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది.
విశేషాలు
[మార్చు]- ఇది వరంగల్లు జిల్లా జనగామ తాలూకాలోని గూడూరులోని స్తంభశాసనం.
- ఇందులో ఒకవైపు తెలుగులో 3 వైపుల కన్నడంలో ఉంది.
- దీనిని విరియాల కామసాని వేయించింది.
- ఇందులోని విషయం సా.శ. 1000 నాటిది. శాసనం 1124 నాటిది.
- ఇందులో 3 చంపకమాల పద్యాలు, 2 ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి.[1] వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.[2]
- సంస్ఫ్కత ఛందస్సు కనిపిస్తున్న మొదటి తెలుగు శాసనం.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- ↑ "శాసనాలు – లిపి – Centre of Excellence for Studies in Classical Telugu". Archived from the original on 2020-10-27. Retrieved 2020-08-30.