Jump to content

విలియం ఫ్రేజర్

వికీపీడియా నుండి
విలియం ఫ్రేజర్, 1806నాటి పెయింటింగ్

విలియం ఫ్రేజర్ (1784 - 22 మార్చి 1835) బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వెంట్. మొఘల్ వంశంలోని చివరి చక్రవర్తి బహాదుర్ షా జఫర్ పరిపాలనలో భారత గవర్నర్ జనరల్గా, ఢిల్లీ భూభాగ కమిషనర్ ఏజెంట్‌గా పనిచేశాడు.[1][2][3]

జననం

[మార్చు]

విలియం ఫ్రేజర్ 1884లో జన్మించాడు. ఇతని తండ్రి రీలిగ్ ఎడ్వర్డ్ ఫ్రేజర్, అన్న జేమ్స్ బైలీ ఫ్రేజర్.[4]

మొఘల్ కాలంలో

[మార్చు]

ఇన్‌వర్నెస్-షైర్, ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ సేవలో వృత్తిని చేపట్టడానికి పదహారేళ్ల వయసులో 1801లో భారతదేశానికి వచ్చాడు. కలకత్తాలోని ఫోర్ట్ విలియం కాలేజీలో శిక్షణ పొందిన తరువాత, అతను ఢిల్లీలోని బ్రిటిష్ రెసిడెంట్‌కి సహాయకునిగా నియమించబడ్డాడు. 1814లో భారతదేశానికి వచ్చిన తన అన్న జేమ్స్ ఫ్రేజర్ ను 1815లో కలిసాడు. అన్నదమ్ములిద్దరూ హిమాలయాలలో పర్యటించి, 1815 ఆగష్టులో ఢిల్లీకి తిరిగి వచ్చారు.

ప్రస్తుతం హర్యానాలో ఉన్న రానియా గ్రామంలో, "విలియం ఫ్రేజర్‌కు ప్రియురాలు అమీబాన్, అతని ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు".[4] ఢిల్లీలోని సెయింట్ జేమ్స్ చర్చి వెనుక కాశ్మీర్ గేట్ ప్రాంతానికి సమీపంలో నిమ్మ పసుపు రంగులో తక్కువ గోపురం నిర్మాణంతో అతని బంగ్లా ఉండేది.[5]

ఫ్రేజర్ ఆల్బమ్

[మార్చు]
ఫ్రేజర్ ఆల్బమ్ లోని ఒక ఫోలియో, c.1815-1819

ఫ్రేజర్ మొఘల్ సంస్కృతి ద్వారా బాగా ప్రభావితమైన బ్రిటిష్ అధికారులలో ఒకడు. కళలకు గొప్ప పోషకుడిగా, మొఘల్ కవి గాలిబ్ అభిమానిగా సుపరిచితుడు. ఫ్రేజర్ ఆల్బమ్ అని పిలువబడే కళాఖండాన్ని రూపొందించాడు. జేమ్స్ ప్రోత్సాహంతో విలియం తన పనిలో వ్యక్తులు, దృశ్యాలను రికార్డ్ చేయడానికి స్థానిక కళాకారుడిని నియమించాడు.[6] అలా రూపొందిన ఆల్బమ్ లో మొఘల్ కాలంలో పేరొందిన కళాకారుల రచనలు, చిత్రాలు ఉన్నాయి.[7] ఢిల్లీని మొఘల్ కుటుంబీకులు పరిపాలిస్తున్న సమయంలో అప్పటి జీవిత నేపథ్యం గురించి ఈ ఆల్బమ్ లోని చిత్రాలలో ప్రతిబింబిస్తుంది. ఇందులో ఆ కాలపు గ్రామస్తులు, సైనికులు, వివిధ వేషభూషల పురుషులు, నృత్యం చేసే మహిళలు, ఆఫ్ఘన్ గుర్రాల డీలర్లు, సన్యాసులు, రానియా గ్రామం, భారతీయ ప్రభువుల వంటి చిత్రాలు ఉన్నాయి.[8]

మరణం

[మార్చు]

1835 మార్చి 22న తన ఇంటి దగ్గర ఫ్రేజర్ చంపబడ్డాడు. కురీమ్ ఖాన్, షంసుద్దీన్ అహ్మద్ ఖాన్, లోహారు నవాబ్, ఫిరోజ్‌పూర్ జిర్కా చేత నియమించబడిన హంతకుడు, ఫ్రేజర్ ను కార్బైన్‌తో కాల్చగా ఫ్రేజర్ సంఘటనా స్థలంలోనే మరణించాడు. నవాబ్ షంసుద్దీన్ అహ్మద్ ఖాన్, లోహారు, ఫిరోజ్‌పూర్ జిర్కా పాలకుడు, మొఘల్ కవి తండ్రి, దాగ్ డెహల్వి హత్యకు సంబంధించి ఉరితీశారు. ఫ్రేజర్ మరణం గురించి మొఘల్ సామ్రాజ్య న్యాయస్థానంలో తదుపరి ఏజెంట్ సర్ థామస్ మెట్‌కాల్ఫ్ తను రాసిన ఢిల్లీ పుస్తకం (1844) లో ప్రస్తావించాడు.[1]

ఫ్రేజర్ ను మొదట స్థానిక శ్మశాన వాటికలో ఖననం చేశారు. 1836లో ఢిల్లీలోని సెయింట్ జేమ్స్ చర్చి నిర్మించిన తరువాత కల్నల్ జేమ్స్ స్కిన్నర్ చేత ఫ్రేజర్ సమాధి పునర్నిర్మించబడింది.[1] ప్రస్తుతం విలియం ఫ్రేజర్ బంగ్లాలో ఉత్తర రైల్వే చీఫ్ ఇంజనీర్ (నిర్మాణం) కార్యాలయం ఉంది. అక్కడికి ఇతరులకు లేదు. విలియం డాల్రింపుల్ 1994లో రాసిన సిటీ ఆఫ్ జిన్స్‌ పుస్తకంలో ఈ బంగ్లాను సందర్శించినట్లు పేర్కొన్నాడు.[5]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Sir Thomas Metcalfe. "Assasination [sic] of William Fraser, Agent to the Governor-General of India". British Library. Archived from the original on 2014-02-19. Retrieved 2021-08-14.
  2. Visual Tour of White Mughal India : Nikita Puri, News - India Today
  3. Princes and Painters in Mughal Delhi » Emperors and White Mughals
  4. 4.0 4.1 William Dalrymple, The forgotten masterpieces of Indian art, Spect[ator UK, 18 December 2019.
  5. 5.0 5.1 Patrick Horton (2002). Delhi. Lonely Planet. pp. 91–. ISBN 978-1-86450-297-8.
  6. "painting; album | British Museum". The British Museum (in ఇంగ్లీష్). Retrieved 2021-08-14.
  7. A Fraser Album Artist, 1815-1819 | The Bullock-drawn carriage of Prince Mirza Babur | Private Collections & Country House Sales Auction | watercolor, Great Britain | Christie'...
  8. "Bonhams to Sell Images of Delhi From the Fraser Album". outlookindia.com/. Retrieved 2021-08-14.