విశాల్ ఉప్పల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశాల్ ఉప్పల్ (జననం 1976 నవంబరు 10) భారతదేశానికి చెందిన టెన్నిస్ ఆటగాడు. అతను 2000, 2002 లలో డేవిస్ కప్‌లో పాల్గొన్నాడు [1]

అతను చిన్న పిల్లవాడిగా ఉండగా పాఠశాలలో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. 11 సంవత్సరాల వయస్సులో టెన్నిస్‌కు మారాడు. అతను పాఠశాలలో ఉండగా ఫాదర్ ఓ'బ్రియన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆడి, సెమీఫైనల్స్‌లో ఓడిపోయాడు. అది ఆట పట్ల అతని ఆసక్తిని, పట్టుదలనూ పెంచింది. 2002లో, అతను డేవిస్ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ముస్తఫా ఘౌస్‌తో కలిసి పురుషుల డబుల్స్ కాంస్యాన్ని గెలుచుకున్నాడు.[2] అతను 2000, 2002[3] లలో డేవిస్ కప్‌లో ఆడాడు.

అతను శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి పట్టభద్రుడయ్యాడు. జూనియర్ డేవిస్ కప్‌లోని విద్యార్థులతో సహా[4] టెన్నిస్‌లో ఇతర విద్యార్థులకు కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతను జూనియర్ AITA ఎంపిక కమిటీలో కూడా సభ్యుడు.[5][6]

మూలాలు[మార్చు]

  1. "Vishal Uppal - Tennis Explorer". www.tennisexplorer.com. Retrieved 2020-03-25.
  2. Srinivasan, Kamesh (2019-08-12). "'I learnt to embrace whatever came my way': former tennis player Vishal Uppal". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-03-25.
  3. "Fed Cup success will inspire next generation of Indian tennis stars, says captain Vishal Uppal". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2020-03-25.
  4. "Big boost to Indian tennis, says Uppal". Deccan Herald (in ఇంగ్లీష్). 2020-03-10. Retrieved 2020-03-25.
  5. "Depth in India women tennis is getting better, says Vishal Uppal". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-02-24. Retrieved 2020-03-25.
  6. "Vishal Uppal: Sania Mirza gave us the belief that nothing is over & done till the end". Tennis World USA (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-03-25.