విశ్వనాథ శర్మ
స్వరూపం
- మల్లాది విశ్వనాథ శర్మ - సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, రచయిత.
- వేమూరి విశ్వనాథ శర్మ - ఆంగ్ల, సంస్కృత, ఆంధ్ర భాషా పండితులు, విజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత, బహుముఖ ప్ర గ. ఈయన స్వగ్రామం నెల్లూరుకు సమీపంలో ని పల్లెపాడు. కాని జువ్విగుంట ప్రకాశం జిల్లా అని విజ్ఞాన సర్వస్వం రెండవ సంపుటం సంస్కృతిలో ఉంది.1884 సెప్టెంబరు 15న జన్మించాడు. బందరు నోబుల్ కళాశాలలో, విజయనగరం మహారిజా వారి కళాశాలలో మద్రాసు ప్రెసిడెన్సి కళాశాలలో 1890 నుంచి 1910 వరకు కొనసాగింది. రసాయన శాస్త్రంలోబి.ఎ, తర్వాత ఎం.ఎ చేశాడు. బి.ఎలో ప్రథముడుగా నిలిచినందుకు 1907లో మదరాసు విశ్వవిద్యాలయం స్వర పతక పురస్కారంతో గౌరవించింది.మదరాసు ప్రభుత్వ శాఖలో అనేక నగరాల్లో పనచేశాడు. కొంతకాలం పశ్చిమ గోదావరి, గుంటూరు లలో 30 సంవత్సరాలు విద్యాశాఖాధికారిగా చేశాడు. పదవీవిరమణ తర్వాత మూడేళ్ళు భారత ప్రభుత్వంలో కార్మికుల ఉపాధిగురించి ప్రచారశాఖ అధికారిగా చేశాడు.కొమర్రాజు లక్షణరాయ గ్రఃథావళి ఈయన రాసిన 'రసాయన శాస్త్రం' పుస్తకాన్ని విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించింది. (1908)). ఆనాటి తెలుగు పత్రికలలో ఈయన రాసిన వ్యాసాలు చాలా ఉన్నాయి.1911 నుంచి 1965 మధ్య అనేక తెలుగు పత్రికలలో ఈయన వ్యాసాలు కనిపిస్తాయి.పి.టి. శ్రీనివాస అయ్యంగార్ ఆంధ్రుల భాష తెలుగు కాదు అని రాస్తే ఆ వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఆంధ్రుల భాష తెలుగా అనే వ్యాసంలో సమాధానం ఇచ్చాడు.ఈయన రచవల జాబితా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి నే.శ్రీ. కృష్ణమూర్తి సంపాదకత్వంలో ప్రచురించిన "తెలుగు రచయితలు రచనలు" సంపుటం పుట 493లో సమగ్రంగా . ఈ పండితుని ఖద్దరు దీక్ష, పరోపకారబుద్ధి, స్నేహశీలత ప్రసిద్ధములు. ఆయన 1970 మే 15న కన్నుమూశాడు. (రెఫరెన్సు గ్రంథాలు: 1.విజ్ఞానసర్వస్వం రెండవ సంపుటం, 2. తెలుగు రచనలు, రచయితల జాబితా. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ.
- తెలకపల్లి విశ్వనాథ శర్మ - సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, రచయిత.