తెలకపల్లి విశ్వనాథ శర్మ
తెలకపల్లి విశ్వనాథ శర్మ ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1963లో సంస్కృత విభాగంలో, ఎం.ఏ గోల్డ్‌మెడల్ పొందిన తొలి వ్యక్తిగా వినుతికెక్కారు.[1] ఆయన హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడిగా పనిచేశారు. తర్వాత 1965లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెం ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి 1993లో పదవీ విరమణ చేశారు.[2] ప్రాకృతం, తెలుగు, సంస్కృతం, గ్రీకు సహా ఇతర విదేశీ భాషలపై పట్టు ఉన్న విశ్వనాధ శర్మ సంస్కృతాంధ్ర కవితలు అముద్రితంగానే ఉన్నాయి. దూరదర్శన్‌లో కొన్నేళ్ళపాటు విశ్వనాధ శర్మ భాషణలతో పాటు శివపురాణ కార్యక్రమం నిర్వహించారు. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించడంలో ఘనాపాఠీగా పేరున్న ఆయన రాసిన పరాశర మాధవీయం, కాళిదాస జ్యోతిష గ్రంథం బహుళ ప్రాచుర్యం పొందాయి.
మైసూరులోని దత్తపీఠాథిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో విశ్వనాథశర్మ దాదాపు ఐదు సంవత్సరాలు సంస్కృతం బోధించారు.[3] అనేక గ్రంథ, శాస్త్రాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాలన్న ఆయన తృష్ణను మాజీ డిజిపి అరవిందరావు నెరవేర్చారు. అరవిందరావు చేయూతతో అనేక సంస్కృత గ్రంథాలను, విశ్వనాథశర్మ తెలుగులోకి అనువదించారు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మే 10 2016 న మరణించారు.