విశ్వనాధరావుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వనాధరావుపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం బోగోలు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 518216
ఎస్.టి.డి కోడ్

"విశ్వనాధరావుపేట", నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

  • విశ్వనాధరావుపేటలోని రామస్వామిపాళెంలో నెలకొని ఉన్న శ్రీ విజ్ఞేశ్వర రామలింగస్వామి ఆలయంలో 2014, ఫిబ్రవరి-20న కలశప్రతిష్ఠ వేడుకగా జరిగింది. శాస్త్రోక్తంగా కలశానికి జరిగిన పంచగంగాభిషేకం, ప్రత్యేకపూజలకు భక్తులు అధిక సంఖాకంగా విచ్చేసారు. [2]
  • ఈ గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబావారి విగ్రహ ప్రతిష్ఠ, 30వ వార్షికోత్సవ వేడుకలు, 2014, ఏప్రిల్-2న, వైభవంగా జరిగినవి. బాబావారిని పూలతో అందంగా అలంకరించారు. విశేషపూజలు, పల్లకీసేవ శాస్త్రోక్తంగా జరిపినారు. భక్తిశ్రద్ధలతో, సాయినామ కీర్తనలు ఆలపించారు. మద్యాహ్నం, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు, అన్నదానం నిర్వహించారు. [3]
  • విశ్వనాధరావుపేట గ్రామ పరిధిలోని బట్టి నాగయ్య ఇళ్ళవద్ద ఉన్న శ్రీ నాగవరపమ్మ ఆలయంలో వైశాఖ పౌర్ణమికి వార్షికోత్సవం నిర్వహించెదరు. [4]

విద్య[మార్చు]

  • ఈ గ్రామ పాఠశాలలో 5వ తరగతి చదువుచున్న చి.వాకా లక్ష్మీసుచిత్ర ప్రతిభ పోటీలలో జాతీయస్థాయి పురస్కారం అందుకున్నది. న్యూఢిల్లీకి చెందిన "బ్రిటానియా ఇంటర్నేషనల్" వారు నిర్వహించిన క్విజ్ పోటీలలో ఈమె అత్యధిక మార్కులు సాధించి బంగారుపతకం అందుకున్నది. [1]

[1] ఈనాడు నెల్లూరు,17 నవంబరు 2013. 11వ పేజీ. [2] ఈనాడు నెల్లూరు; 2014, ఫిబ్రవరి-21; 5వ పేజీ. [3] ఈనాడు నెల్లూరు; 2014, ఏప్రిల్-3; 5వ పేజీ. [4] ఈనాడు నెల్లూరు; మే-13,2014; 5వ పేజీ.  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.