విష్ణుశాస్త్రి కృష్ణశాస్త్రి చిప్లుంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విష్ణుశాస్త్రి చిప్లుంకర్
Vishnusastri Chipulkar
జననం
విష్ణుశాస్త్రి చిప్లుంకర్

(1850-05-20)1850 మే 20
పూణే, బ్రిటిష్ ఇండియా
మరణం1882 మార్చి 17(1882-03-17) (వయసు 31)
వృత్తిరచయిత, సమాజసేవ
తల్లిదండ్రులు
  • కృష్ణశాస్త్రి చిప్లుంకర్ (తండ్రి)


విష్ణుశాస్త్రి చిప్లుంకర్ (20 మే 1850 - 17 మార్చి 1882) ( మరాఠీ : విష్ణుశాస్త్రి కృష్ణశాస్త్రి చిపళూణకర్) ఒక మరాఠీ రచయిత, అతని రచనలు ఆధునిక మరాఠీ గద్య శైలిపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపించాయి. అతను రచయిత, పండితుడు అయిన కృష్ణశాస్త్రి చిప్లుంకర్ కుమారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

విష్ణుశాస్త్రి పూణేలో చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో సంస్కృత పండితుడు కృష్ణశాస్త్రి చిప్లుంకర్‌కు జన్మించారు. [1] అతను 1872లో పూణేలోని దక్కన్ కళాశాల నుండి తన BA పట్టా పొందారు. తరువాత 1872-1879 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1880లో, అతను ( గోపాల్ గణేష్ అగార్కర్ మఱియు బాల గంగాధర్ తిలక్‌తో కలిసి) కేసరి (మరాఠిలో) మఱియు మహరత్తా (ఇంగ్లీష్‌లో) వార్తాపత్రికలను స్థాపించారు. అతను పూణేలోని ది న్యూ ఇంగ్లీష్ స్కూల్ సహ వ్యవస్థాపకుడు కూడా. ఈ సంస్థలు బ్రిటీష్ ఇండియాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలలకు విరుద్ధంగా దేశభక్తితో కూడిన విద్యను అందించడానికి ఉద్దేశించబడ్డాయి. 

1878లో, చిప్లుంకర్ మహారాష్ట్ర కవిత్వం మఱియు చరిత్రతో పాఠకులకు బాగా పరిచయం చేయాలనే లక్ష్యంతో కావ్యేతిహాస్ సంగ్రహ (काव्येतिहास संग्रह) అనే పేరుతో మరొక మాసపత్రికను స్థాపించారు. అదే సంవత్సరం అతను రెండు ప్రింటింగ్ ప్రెస్‌లను స్థాపించారు, అవి ఆర్యభూషణ్ ప్రెస్ (आर्यभूषण छापखाना) మఱియు చిత్రశాల (चित्रशाळा) ప్రెస్, రెండోది మహారాష్ట్రలోని చారిత్రక మఱియు ఆధ్యాత్మిక వ్యక్తుల చిత్రాలను ముద్రించడానికి వినియోగించబడేది. మరుసటి సంవత్సరం, అతను మరాఠీ పాఠకులకు స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కితాబ్‌ఖానా (किताबखाना) పేరుతో పుస్తకాల దుకాణాన్ని ప్రారంభించారు.

అతను 1882లో 32 సంవత్సరాల వయస్సులో టైఫాయిడ్‌తో పూణేలో మరణించారు. ప్రారంభ జీవిత చరిత్రను అతని సోదరుడు లక్ష్మణశాస్త్రి చిప్లుంకర్ రాశారు, [2] మఱియు మద్ఖోల్కర్ అనే మరాఠి రచయిత అతని జీవిత చరిత్ర సంగ్రహాన్ని విశదీకరించారు.. [3]

రచనలు[మార్చు]

రచయితగా అతని కెరీర్ 1868లో ప్రారంభమైంది, అతని తండ్రి స్థాపించిన శాలపత్రక్ (शालापत्रक, The School Paper) పత్రికలో అతని వ్యాసాలతో రచనలు వ్రాయుట స్వీకరించారు. ఈ కాలంలో విష్ణుశాస్త్రి సంస్కృత కవులు అయిన కాళిదాస్, భవభూతి, బాణ, సుబంధు మఱియు దండిన్ వారి యొక్క వ్రాసిన విమర్శనాత్మక రచనలు గుర్తించదగినవి . ఈ వ్యాసాలు ఆయన పాఠకులకు 'పాశ్చాత్య' సాహిత్య విమర్శ సంప్రదాయాన్ని పరిచయం చేశాయి. అవి తరువాత సంస్కృత కవిపంచక్ (संस्कृत कविपंचक) గా తిరిగి ప్రచురించబడ్డాయి. కొంతకాలానికి అతను ఈ పత్రికకు సంపాదకుడు అయ్యారు, అయితే బ్రిటిష్ ప్రభుత్వం మఱియు క్రిస్టియన్ మిషనరీ ప్రవర్తనను విమర్శిస్తూ అతను వ్రాసిన కొన్ని వ్యాసాలు వివాదాస్పదంగా మారడంతో తదనంతర పరిణామాల వలన 1875లో షాలపత్రక్‌ను మూసివేయవలసి వచ్చింది.

1874లో, అతను మాసపత్రిక నిబంధమాల (निबंधमाला, A Garland of Essays)ని ప్రారంభించారు. ఇదే అత్తని జ్ఞాపకార్ధకంగా గుర్తించబడుతున్నది. 12 సంవత్సరాలలో ప్రచురించబడిన ఈ పత్రిక యొక్క 84 సంచికలలోని దాదాపు అన్ని రచనలలో ఆతని ప్రమేయము ఉంది. అతని రచనా పరిధి విస్తృతమైనది. అతను మరాఠీ భాష యొక్క సమకాలీన రచనా స్థితిని ఆంగ్లం, సంస్కృతం కవిత్వంతో విభేదించడం మఱియు మరాఠీలో విదేశీ పదాలను ఉపయోగించడం యొక్క ఔచిత్యం వంటి అంశాలు విపులీకరించారు. ఆమాచ్య దేశాచి స్థితి (अामच्या देशाची स्थिती, The state of our nation) మఱియు ముద్రణస్వాతంత్ర్య (मुद्रणस्वातंत्र्य, Freedom of the press) అతను వ్రాసిన ప్రభావవంతమైన రెండు రాజకీయ వ్యాసాలు.


ఆయనను సాధారణంగా మరాఠీ భాష యొక్క శివాజీ అని కూడా పిలుస్తారు. అయితే, ఈ గౌరవప్రదమైన వర్ణన మొదట విష్ణుశాస్త్రికే వర్తింపజేయబడింది. వాస్తవానికి ఆయన ఆంగ్లంలో మాట్లాడేవారు కూడా.


అతను తన తండ్రి సహకారంతో ఈ క్రింది రచనలను మరాఠీలోకి అనువదించారు:

బాల గంగాధర తిలక్ జీవితంపై మరాఠీ చిత్రం లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్‌లో, ఓం రౌత్ విష్ణుశాస్త్రి పాత్రను పోషించాడు.

మూలాలు[మార్చు]

  1. Wolpert, Stanley A. (1989). Tilak and Gokhale : revolution and reform in the making of modern India. Delhi: Oxford University Press. p. 9. ISBN 9780195623925.
  2. Chiplunkar, L. K. (1894). Kai. Vishnushastri Chiplunkar yaanche charitra (in Marathi). Pune.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  3. Madkholkar, G.T. (1894). Chiplunkar - Kaal ani Kartrutva (in Marathi). Pune.{{cite book}}: CS1 maint: location missing publisher (link)