వి.ఆదిమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.ఆదిమూర్తి
జననంరాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
రంగములుAerospace Engineering
Hypersonic flows
వృత్తిసంస్థలుIndian Space Research Organisation
చదువుకున్న సంస్థలుIndian Institute of Technology Kanpur
ప్రసిద్ధిChandrayaan I, Chandrayaan-2, Mangalyaan, Indian space program
గమనికలు
Mission Concept Designer
Chandrayaan I, Chandrayaan-2 and Mangalyaan[1][2]

వి.ఆదిమూర్తి (విప్పర్తి ఆదిమూర్తి) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనా డీన్, సతీష్ థావన్ ప్రొఫెసర్.[3] ఆయన ఐ.సి.ఎస్.టి లోనికి చేరడానికి పూర్వం విక్రం సారభాయి స్పేస్ సెంటర్ (ఇస్రో యొక్క కేంద్రం) లో అసోసియేట్ డైరక్తారుగా తమ సేవలనందించాడు.[4] ఆయన రాకెట్ టెక్నాలజీ, స్పేస్ డైనమిక్స్ లో తన సేవలనందించాడు.[5] ఆయనకు భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ పురస్కారం వచ్చింది.[6] ఆయన భారతదేశ మార్స్ ఆర్బిట్ మిషన్ యొక్క కాన్సెప్ట్ డిసైనర్.[2]

జీవితం[మార్చు]

ఆదిమూర్త్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో జన్మించాడు.[4] ఆయన 1973లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుండి హైపర్‌సానిక్ ఫ్లోస్ అనే అంశంపై పి.హెచ్.డి చేసిన తరువాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో చేరాడు. తరువాత ఆయన తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) లో శాస్త్రవేత్తగా చేరాడు. అక్కడ ఆయన అసోసియేట్ డైరక్టరుగా సేవలనందించాడు.[5] అక్కడ 2010లొ పదవీవిరమణ చేసిన తరువాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ పాహ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సతీష్ థావన్ ప్రొఫెసర్ గా నియమింపబడ్డాడు.

గౌరవాలు, పురస్కారాలు[మార్చు]

ఆదిమూర్తి ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఫెలోగా ఉన్నప్పుడు 1997 లో ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని రాకెట్ టెక్నాలజీలో చేసిన కృషికిగాను అందుకున్నాడు. ఆయన 1979-80, 1999-2000 కాలంలో జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ స్టట్ట్‌గర్ట్ లో విజిటింగ్ సైంటిస్టుగా పనిచేసాడు. ఆయన అలెగ్జాండార్ వాన్ హుంబోల్ట్ ఫౌండేషన్ లో ఫెలోగా ఉన్నారు.[5] 2002-2003 కాలంలో ఆయన ఇంటర్-ఏజన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించాడు.[4] 2012లో ఆయన భారత ప్రభుత్వం నుండి స్పేస్ డైనమిక్స్ లో చేసిన సేవలకు గానూ పద్మశ్రీ పురస్కారాన్ని పొందాడు.[6]

మూలాలు[మార్చు]

  1. http://www.deccanherald.com/content/52504/he-has-orbited-earth-thrice.html
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-08. Retrieved 2016-11-14. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "deccanchronicle.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "ISRO to implement regional navigation satellite system". The Hindu. 5 January 2011. Retrieved 30 January 2012.
  4. 4.0 4.1 4.2 "Laurels after a unique Sabarimala pilgrimage". The New Indian Express. 26 January 2012. Retrieved 8 February 2012.[permanent dead link]
  5. 5.0 5.1 5.2 "Dr V. Adimurthy". International Astronautical Federation. Retrieved 30 January 2012.[permanent dead link]
  6. 6.0 6.1 "Adimurthy: Cycling through space". The Times of India. 25 January 2012. Archived from the original on 3 జనవరి 2013. Retrieved 30 January 2012.

ఇతర లింకులు[మార్చు]