వి.సి. బాలకృష్ణ పనిక్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి.సి. బాలకృష్ణ పనిక్కర్
జననం1 మార్చి 1889
ఊరకం-కీజ్‌మూరి, మలప్పురం, కేరళ
మరణం1912 అక్టోబరు 20(1912-10-20) (వయసు 23)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లువెళ్ళాట్ చెంబలంచేరి బాలకృష్ణ పనిక్కర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, కవి

వెళ్ళాట్ చెంబలంచేరి బాలకృష్ణ పనిక్కర్ ( 1889 మార్చి 1 - 1912 అక్టోబరు 20) కేరళ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, కవి. కవితలు, శ్లోకాలు, నాటకాలు, వ్యాసాలు, అనువాదాలు రాసాడు. ప్రకృతి విశ్వరూపంపై ఓరు విలాపం అనే చక్కని వర్ణన చేశాడు. ఆయన మంకీ గీత రచయిత.

జీవిత చరిత్ర[మార్చు]

విసి బాలకృష్ణ పనిక్కర్ 1889, మార్చి 1న కేరళ రాష్ట్రంలోని మలప్పురం సమీపంలోని ఊరకం-కీజ్‌మూరిలో జన్మించాడు. పేద కుటుంబానికి చెందిన పనిక్కర్ కోజికోడ్‌లోని మంకావు ప్యాలెస్‌కు వెళ్ళాడు. ఆ ప్యాలస్ లో ఇతర కవులు, రచయితలతో కలిసి 4 సంవత్సరాలు ఉన్నాడు.[1][2]

ఉద్యమం[మార్చు]

1910, అక్టోబరు 26న స్వదేశాభిమాని రామకృష్ణ పిళ్లై విస్తరణకు వ్యతిరేకంగా సంపాదకీయం రాశాడు.[2]

మరణం[మార్చు]

పనిక్కర్ 1912, అక్టోబరు 20న తన 23 సంవత్సరాల వయస్సులో క్షయవ్యాధి కారణంగా మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Calicut Heritage Forum; V.C. - Calicut's own Keats. 20 October 2013. Downloaded on 20 March 2016.
  2. 2.0 2.1 Kerala Media Academy: Balakrishna Panikkar V. C. Archived 2016-03-30 at the Wayback Machine