Jump to content

వీణం వీరన్న

వికీపీడియా నుండి
వీణం వీరన్న
వీరన్న చిత్రం
జననం
వీరన్న

1794, మార్చి 3
రాజమండ్రి
మరణం1867
విద్యఇంజనీరింగ్
ఉద్యోగంనీటిపారుదల శాఖలో
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తొలి తెలుగు ఇంజనీరు
జీవిత భాగస్వామివెంకాయమ్మ
తల్లిదండ్రులువీరరాఘవమ్మ
కొల్లయ్య

వీణం వీరన్న తొలి తెలుగు ఇంజనీరు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

వీణం వీరన్న వీరరాఘవమ్మ, కొల్లయ్య దంపతులకు 1794, మార్చి 3న రాజమండ్రిలో జన్మించాడు. ప్రాథమిక విద్య రాజమండ్రిలో అభ్యసించాడు. కలకత్తాలో ఓవర్సీస్ విద్యనభ్యసించాడు. మద్రాసులో ఇంజనీరింగ్ లో శిక్షణ పొందారు. 1840లో రాజమండ్రి నీటిపారుదల శాఖలో ఉద్యోగంలో చేరాడు. కాటన్ దొర సహాయకుడిగా 1852 మార్చి 31 నాటికి పదివేల మంది శ్రామికులతో ఆనకట్ట పనులు పూర్తిచేశాడు. కాటన్‌ దొర స్వదస్తూరితో "శ్రీ వీణెం వీరన్న నాకు లభించకపోతే ఇంతవేగంగా గోదావరి ఆనకట్టను పూర్తిచేయలేక పోయేవాణ్ని" అని రాసుకున్నాడు. వీరన్న సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహదూర్ బిరుదు ప్రదానం చేసింది. ఆనకట్టకు 20 కిలోమీటర్ల దూరంలోని మెర్నిపాడు గ్రామ ఆదాయాన్నీ( ఆ కాలంలో రూ. 500 పైగా) ఆయనకు దఖలు పరుస్తున్నట్లు విక్టోరియా మహారాణి ప్రకటించారు. మైసూర్ మహారాజా నుంచి సన్మానం, సువర్ణ భుజకీర్తులు అందుకున్నాడు.[2]

కాటన్ కుమార్తె లేడీహోప్ కాటన్ జీవిత చరిత్ర రాస్తూ అందులో వీరన్న ప్రస్తావన తెచ్చింది. వీరన్న గౌడ బ్రాహ్మణ శాఖలో శిష్టకరణాలు అనే శైవమతానికి చెందినవారని ఆమె రాసింది. అతను ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం నివసించేవాడు. అతని తండ్రి కొల్లయ్య మచిలీపట్నంలో ఉద్యోగం చేసేవాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ధవళేశ్వరానికి చెందిన వెంకాయమ్మతో వివాహం జరిగింది. వారికి వెంకటరత్నం, జనార్దనస్వామి, కొల్లయ్య, సీతారామస్వామి, బాపమ్మలు సంతానం గా జన్మించారు.

1867లో ఆయన మరణించాక ధవళేశ్వరం హెడ్‌లాక్‌ ప్రాంతంలోనే ఆయన పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిపారు. '‘వి.వీరన్న, రాయ్‌బహుదూర్, సబ్‌ఇంజినీర్, 1867’ అని శిలాఫలకం చెక్కించారు. 1986లో వచ్చిన వరదలో కాటన్‌ దొర విగ్రహంతోపాటు ఈ శిలాఫలకం కూడా కొట్టుకుపోయింది. 1988లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రోద్బలంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిర్మించిన ‘కాటన్‌ మ్యూజియం’లో వీరన్న గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

మూలాలు

[మార్చు]
  1. "Ashok releases brochure on first Telugu engineer". The Hindu (in Indian English). 2017-10-28. ISSN 0971-751X. Retrieved 2021-10-19.
  2. RJ (2021-07-16). "మనం మర్చిపోయిన తెలుగు జాతి ముద్దుబిడ్డ.. రావ్ బహుద్దూర్ వీణం వీరన్న!" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-19.

బాహ్య లంకెలు

[మార్చు]