వీణ వేణువైన సరిగమ విన్నావా (పాట)
Appearance
ఈ పాట ఇంటింటి రామాయణం చిత్రం లోనిది. రంగనాథ్, ప్రభ అభినయించారు. గాత్రం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి. సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతం: రాజన్-నాగేంద్ర
వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల, చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలీవేళలో
ఊపిరి తగిలిన వేళ, నే ఒంపులు తిరిగిన వేళ
నా వీణలో నీ వేణువే పలికే రాగమాల
చూపులు రగిలిన వేళ, ఆ చుక్కలు వెలిగిన వేళ
నా తనువునా అణువణువునా జరిగే రాసలీల
||వీణ వేణువైన||
ఎదలో అందం ఎదుట, ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో, వెలసే వనదేవత
కదిలే అందం కవిత, అది కౌగిలి కొస్తే యువత
నా పాటలో నీ పల్లవే నవత, నవ్య మమత
||వీణ వేణువైన||
మూలాలు
[మార్చు]- ↑ "veena venuvaina sarigama - Lyrics and Music by బాలు, జానకి(తెలుగు లిరిక్స్) arranged by krkvijju". Smule (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-21.
బాహ్య లంకెలు
[మార్చు]- పప్పు, శ్రీనివాస్ (2013-05-02). "వీణ వేణువైన మధురిమ-వేటూరి(E.N.V.రవి)". Veturi (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-11-29. Retrieved 2020-09-21.
- Veena Venuvaina Sarigama from Intinti Ramayanam movie