వీరంపల్లి (మనుబోలు)
వీరంపల్లి, నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
వీరంపల్లి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°17′14″N 79°48′54″E / 14.287163°N 79.815002°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | మనుబోలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524405 |
ఎస్.టి.డి కోడ్ | 0861 |
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- వీరంపల్లి గ్రామంలోని అంకమ్మ తల్లికి, 2014, జూలై-27 ఆదివారం నాడు, పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేళతాళాలు, తప్పెట్లతో గ్రామంలో కోలాహలం నెలకొన్నది. భక్తులంతా పొంగళ్ళు పెట్టుకొని, కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు తీర్చుకున్నారు.
గ్రామ ప్రముఖులు
[మార్చు]ఈ గ్రామములో శ్రీ పల్లంరెడ్డి రమణారెడ్డి నాటకరంగంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఈయన కుమారుడు శ్రీ దశరథరామిరెడ్డి వ్యసాయశాఖలో ఉద్యోగం చేస్తూ గూడా నాటకరంగంలో చాలా ఖ్యాతి గడించారు. ఈయన మన రాష్ట్రంలోని హైదరాబాదు, విశాఖపట్నం మొదలగు చోట్లనే గాకుండా, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, రాష్ట్రాలలోనూ పలు నాటక ప్రదర్శనలిచ్చారు. వీరు 1997 లో ముంబాయిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో గూడా పౌరాణిక నాటకం ప్రదర్శించి పలువురి ప్రశంసల నందుకున్నారు. ఇంతవరకూ వీరు 30 సంవత్సరాలనుండి, మొత్తం 200 పైగా నాటకాలు ప్రదర్శించారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు నెల్లూరు, 2-12-2013, 8వ పేజీ.