వీరభద్రస్వామి దేవాలయం, పట్టిసీమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరభద్రస్వామి దేవాలయం పట్టిసీమ
శివరాత్రి సందర్భంలో ఆలయ దృశ్యం
వీరభద్రస్వామి దేవాలయం పట్టిసీమ is located in Andhra Pradesh
వీరభద్రస్వామి దేవాలయం పట్టిసీమ
వీరభద్రస్వామి దేవాలయం పట్టిసీమ
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు:17°13′7″N 81°38′9″E / 17.21861°N 81.63583°E / 17.21861; 81.63583Coordinates: 17°13′7″N 81°38′9″E / 17.21861°N 81.63583°E / 17.21861; 81.63583
పేరు
స్థానిక పేరు:వీరభద్రస్వామి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:పశ్చిమగోదావరి
ప్రదేశం:పట్టి సీమ
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:శివుడు
ప్రధాన పండుగలు:శివరాత్రి
నిర్మాణ శైలి:చాళుక్య నిర్మాణశైలి

శ్రీ వీరభద్రస్వామి దేవాలయం, భారతదేశంలోని శైవక్షేత్రం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా లోని గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఈ తీర్ధము లేదా తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.[1]

క్షేత్ర చరిత్ర[మార్చు]

పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తోన్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమాన పరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి, తిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు . వీరభద్రుడిని సృష్టించి, దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన 'పట్టసం' ( పొడవైన వంకీ కత్తి ) తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీ, పట్టిసీమనీ, పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు.[2]

శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్య క్షేత్రానికి, శ్రీ భూ నీలా సమేత భావనారాయణస్వామి క్షేత్ర పాలకుడు. కనకదుర్గ అమ్మవారు . శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారు ఇక్కడ గ్రామదేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ . పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలందుకుంటూ వుంటారు.

దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక 'దేవకూట పర్వతం' పై ప్రళయతాండవం చేయసాగాడు. ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో, ఆ గుండం నుంచి 'భద్రకాళి' ఆవిర్భవించింది. దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే ఆయన ఆ చక్రాన్ని నోట కరుచుకుని నమిలి మింగేశాడు. దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండటంతో, తన వామ నేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడట. ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడు తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.

వీరభద్ర భద్రలాళీస్వరూప భీకరరౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతలకోరిక మీద అక్కడకు వచ్చిన అగస్త్యమహర్షి వీరభద్రుడిని వెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు వీరభద్రుడి ఆవేశం చల్లారి లింగరూపంలో దేవకూట పర్వతం మీద భద్రకాళీమాతతో వెలిసాడు.ఇక్కడ వెలసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాలళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు. అలాగే శ్రీ భూ నీలా సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించాడు. ఈ సమయంలోనే అగస్త్యుడు శ్రీ వీరేశ్వరస్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నాడు. శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతిగుర్తులు కనిపిస్తుంటాయని అంటారు.

  • శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని ప్రతీతి.
  • పరశు రాముడు కూడా వీరేశ్వరుడిని దర్శించుకునే మోక్షాన్ని పొందాడని తెలుస్తోంది.

మూలాలు[మార్చు]

  1. Veerabhadra, Temple. "Pattisema Temple location". www.browserrajahmundry.in. Archived from the original on 2016-04-25.
  2. C, Girish. "పట్టిసీమ వీరాభద్ర స్వామి దేవాలయం, పట్టిసీమ". manatemples.net. Archived from the original on 2017-06-12. Retrieved 2018-02-12.

ఇతర లింకులు[మార్చు]