వీరమ్మకుంట
వీరమ్మకుంట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°37′34″N 81°04′12″E / 16.626108°N 81.070032°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | పెదపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534437 |
ఎస్.టి.డి కోడ్ |
వీరమ్మకుంట, పశ్చిమ గోదావరి జిల్లా, పెదపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.పెదపాడు మండలానికి చెందిన వీరమ్మకుంట గ్రామం, ఏలూరు పట్టణం నుండి, 11 కిలోమీటర్ల దూరములో వున్న, వ్యవసాయక, కుగ్రామం. ఈ గ్రామంనకు మూడు కిలోమీటర్ల దూరములో కొల్లేరు సరస్సు ఉంది.అక్కడే శ్రీ దాసరి కొటెశ్వర రావు గారిచే నిర్మించబడిన, ఫెద్దింట్లమ్మ ఆలయము కూడా ఉంది.ఈ ఆలయము వద్ద ప్రతీ సంవత్సరము ఫిబ్రవరి నెలలో, పెద్దింట్లమ్మ వుత్సవాలు జరుప బడును. కొల్లేటి గ్రామ ప్రజలు ఈ వుత్సవాలలో భక్తి శ్రద్ధలతొ పాల్గొంటారు. ఈ గ్రామంలో మర్రాపు వారిచే నిర్మించబడిన రామాలయము, విగ్నేశ్వర ఆలయము, కలిపిండి కృష్ణ గారిచే నిర్మించబడిన షిరిడీ సాయి బాబా ఆలయములు ఉన్నాయి. ఈ గ్రామంలో మర్రాపు సింహాచలము మెమోరియల్ చారిటబుల్ ట్రష్టు, వారిచే నిర్మించబడిన, ధ్యాన మందిరం కూడా ఉంది. ఈ ట్రుష్టు వారు నిరాధార వ్రుద్దులకు వ్రుద్దాప్య పించన్లు, పేద, అంధ విద్యర్దులకు ఆర్థిక సహాయముతొ సేవ చేస్తున్నారు.