Jump to content

వుడ్‌ల్యాండ్స్ హిందూ దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 30°10′50″N 95°32′41″W / 30.180583°N 95.544693°W / 30.180583; -95.544693
వికీపీడియా నుండి
వుడ్‌ల్యాండ్స్ హిందూ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:టెక్సస్
ప్రదేశం:స్ప్రింగ్
అక్షాంశ రేఖాంశాలు:30°10′50″N 95°32′41″W / 30.180583°N 95.544693°W / 30.180583; -95.544693

వుడ్‌ల్యాండ్స్ హిందూ దేవాలయం, అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని స్ప్రింగ్ నగరంలో ఉన్న ఉన్న హిందూ దేవాలయం. గ్రేటర్ హ్యూస్టన్ ఉత్తర భాగంలోవున్న ఏకైక హిందూ దేవాలయమిది. వుడ్‌ల్యాండ్స్, కాన్రో, స్ప్రింగ్, టోంబాల్, ఉత్తర హారిస్ కౌంటీలో నివసిస్తున్న హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది.

చరిత్ర

[మార్చు]

2005లో ఈ వుడ్‌ల్యాండ్స్ హిందూ దేవాలయంకి చెందిన సంస్థ స్థాపించబడింది. 2006లో దేవాలయ నిర్మాణంకోసం భూమి కొనుగోలు చేయబడింది. 2008లో అభయారణ్యం, స్వాగత కేంద్రం మొదలైన రెండు భవనాల నిర్మాణం ప్రారంభమైంది.[1] $3 మిలియన్లతో 10,000 చ.అ. (930 చ.మీ.) లో ఈ దేవాలయం నిర్మించబడింది. ప్రణాళిక, నిధుల సేకరణ, నిర్మాణానికి ఆరు సంవత్సరాల కాలం పట్టింది.[2] 2011లో నిర్మాణం పూర్తయింది.

కార్యకలాపాలు

[మార్చు]

ఈ దేవాలయం ప్రాగణంలో హిందూ ప్రధాన పండుగలన్ని నిర్వహించబడుతాయి. ఉచిత యోగా తరగతులు, భారతదేశంలోని ఐదు భాషలకు సంబంధించిన తరగతులు కూడా ఉంటాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Forward, Jeff (2018-05-06). "Hindu Temple, Christ Church in midst of expansions in The Woodlands". The Woodlands Villager at the Houston Chronicle. Retrieved 2022-03-09.
  2. Shellnutt, Kate. "New temple will serve north Houston Hindus." Houston Chronicle. June 26, 2011. Retrieved on May 3, 2014.

బయటి లింకులు

[మార్చు]