వెండితెర పాటలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెండితెర పాటలు
వెండితెర పాటలు పుస్తక ముఖచిత్రం.
రచయితలుడి.వి.కృష్ణశాస్త్రి
భాషతెలుగు
ఇతివృత్త వర్గంసంకలనం
ప్రచురణకర్తవిశాలాంధ్ర బుక్ హౌస్, హైదరాబాద్
ప్రచురణ తేదీ
మే 2008
పేజీలు167 పేజీలు
వెండితెర పాటలు పుస్తక విశేషాలు.

వెండితెర పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు సినిమా పాటల సంకలనం. ఇందులో ఈ భావకవి 71 సినిమాల కోసం రచించిన 162 మధురమైన పాటలు ఉన్నాయి. ఇది విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ద్వారా 2008 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించబడినది.

ఇది మేఘమాల, గోరింట అనే రెండు భాగాలుగా చేయబడినది:

మేఘమాల[మార్చు]

మేఘమాల సంకలనంలో మల్లీశ్వరి, నా యిల్లు, రాజీ నా ప్రాణం, ఆకలి, తండ్రి, బంగారు పాప, భాగ్యరేఖ, రాజగురువు, పూజాఫలం, కార్తవరాయని కథ, రక్తకన్నీరు, రాజమకుటం, భక్తశబరి, సుఖదుఃఖాలు, ఉండమ్మా బొట్టు పెడతా, అమాయకుడు, డాక్టర్ ఆనంద్, కలసిన మనసులు, బంగారు పంజరము, బంగారు తల్లి, ఏక వీర సినిమాలలోని 84 పాటలు ఉన్నాయి.

గోరింట[మార్చు]

గోరింట సంకలనంలో మాయని మమత, కథానాయిక మొల్ల, సిపాయి చిన్నయ్య, చెల్లెలి కాపురం, వింత కథ, ఆడజన్మ, అమ్మ మాట, జగత్ కిలాడీలు, శాంతి జగత్ జెట్టీలు, కాలం మారింది, సంపూర్ణ రామాయణం, కల్యాణ మంటపం, భక్త తుకారాం, విజయం మనదే, మంచి రోజులు వచ్చాయి, అఖండుడు, వాడే వీడు, నేరము శిక్ష, రాముడే దేవుడు, ధనవంతులు గుణవంతులు, జీవితాశయం, అమ్మ మనసు, మట్టిలో మాణిక్యం, చీకటి వెలుగులు, బలిపీఠం, సంఘం మారాలి, ఇదెక్కడి న్యాయం, ఇల్లే స్వర్గం, సమాధి కడుతున్నాం చందాలివ్వండి, ఈనాటి బంధం ఏనాటిదో, అన్నదమ్ముల కథ, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాహాత్మ్యము, సన్నాయి అప్పన్న, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం, గోరింటాకు, కార్తీక దీపం, అమెరికా అమ్మాయి, సీతామాలక్ష్మి, ఇంటింటి కథ, బంగారక్క, శ్రీ వినాయక విజయం, శ్రీరామ పట్టాభిషేకం, నామాల తాతయ్య, మావూరి గంగ, భద్రకాళి, శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్, మేఘ సందేశం, వస్తాడే మా బావ, మాయావి, రాక్షసుడు సినిమాలలోని 78 పాటలు ఉన్నాయి.

బయటి లింకులు[మార్చు]