వెజ్ మంచూరియా
స్వరూపం
(వెజ్ మంచూరియన్ నుండి దారిమార్పు చెందింది)
వెజ్ మంచూరియన్ అనేది చాలా రుచికరమైన ఆహార పదార్థం. దీనిని తయారు చేయడం కూడా తేలిక.
ఎలా చేస్తారు
[మార్చు]కావలసిన పదార్ధాలు
[మార్చు]- మైదా పిండి - అర కెజి
- కాబేజి - సగం
- ఉప్పు - తగినంత
- కారం - 1 స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్స్
- పచ్చి మిరపకాయలు - 4
- సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
- గరం మసాలా - 1 స్పూన్
- కరివే పాకు,కొత్తిమీర - కొద్దిగా
- నూనె - (Deep Fry కు కావలసినంత)
- నీరు - (తగినంత)
తయారుచేయు విధానం
[మార్చు]ముందుగా వెజ్ మంచూరియన్ ఉండలు తయారు చేయాలి ఎలాగంటే...మైదా పిండి, బాగా సన్నగా తురిమిన కాబేజ్ ముక్కలు, ఉప్పు, నీళ్ళు కలిపి బజ్జీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపు కోవాలి. ఈ పిండిని ఉండలుగా చేసి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీయాలి.
ఆ తర్వాత ఓ కళాయిలో కొద్దిగా నూనె వేసి కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరప కాయలు, కరివే పాకు వెయాలి. కొంచం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, గరమ్ మసాలా, ఉప్పు, 2 కప్పుల నీళ్ళు పోసి మరిగించి చిక్కని గ్రేవీ తయారు చేసి అందులో ఇందాక తయారు చేసిన ఉండలు వేసి కలుపుతూ ఉండాలి. దానిని బెల్లం పాకంలో వెయాలి. తర్వాత దించి వేసి కొత్తిమీర చల్లి, నిమ్మకాయ ముక్కలతో అలంకరించాలి. అంతే రుచికరమైన వెజ్ మంచూరియన్ సిద్దం.