వెలపాటి రామరెడ్డి
Jump to navigation
Jump to search
వెలపాటి రామరెడ్డి | |
---|---|
జననం | |
మరణం | 27 మే 2021 కనకదుర్గ కాలనీ, హన్మకొండ, వరంగల్ జిల్లా |
జాతీయత | భారతదేశం |
వృత్తి | సాహితీవేత్త , రిటైర్డ్ అధ్యాపకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలంగాణ సాయుధ పోరాటం గ్రంథం |
తల్లిదండ్రులు | కేశవరెడ్డి, చిలకమ్మ |
వెలపాటి రామరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన అధ్యాపకుడు, కవి. ఆయన రాసిన తెలంగాణ సాయుధ పోరాటం గ్రంథం ఎంతో ప్రాచుర్యం పొందింది. 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]వెలపాటి రామరెడ్డి తెలంగాణ రాష్ట్రం , వరంగల్ జిల్లా, కొడకండ్ల మండలం , రేగుల గ్రామంలో 4 నవంబర్ 1932లో కేశవరెడ్డి, చిలకమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బిఏ ఇంగ్లిష్ వరకు చదువుకున్నాడు.
ఆయన రచనలు
[మార్చు]- తెలంగాణ కావ్యం
- వీరతెలంగాణ
- తెలంగాణ సాయుధ పోరాటం గ్రంథం
- వెలుగు నీడలు
- తెలంగాణ పద్యమంజరి
- కోటిగాయాల మౌనం తెలంగాణ
- తెలంగాణ నడుస్తున్న చరిత్ర
- నవశకం
- తెలంగాణ శకారంభం
- స్వేచ్ఛ విహంగాలు
- తెలంగాణ భావ తరంగాలు
- తెలంగాణ పద సౌరభం
- రేగుల గ్రామ చరిత్ర
- తెలంగాణ - ఏడో తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశం
- మన శిల్పారామం రామప్ప - ఇంటర్మీడియట్ తెలుగు వాచకంలో పాఠ్యాంశం [3]
మరణం
[మార్చు]వెలపాటి రామరెడ్డి 27 మే 2021లో వరంగల్ జిల్లా, హన్మకొండ, కనకదుర్గ కాలనీలోని తన స్వగృహంలో మృతి చెందాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, తెలంగాణ (31 May 2017). "ప్రముఖులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు". Sakshi. Archived from the original on 6 August 2017. Retrieved 27 September 2021.
- ↑ Andhrajyothy (1 June 2017). "52 మందికి ప్రభుత్వ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
- ↑ Sakshi (27 May 2021). "అక్షర యోధుడు రాంరెడ్డి ఇక లేరు." Sakshi. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
- ↑ Namasthe Telangana (27 May 2021). "సాహితీవేత్త వెలపాటి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం". Namasthe Telangana. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
- ↑ Namasthe Telangana (27 May 2021). "వెలపాటి రామరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం". Namasthe Telangana. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.