వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్ ఉన్న వలపట్టణం జంక్షన్ ప్రాంతం

భారతదేశం లో ప్లైవుడ్ తయారు చేసే కర్మాగారాలు చాల వుండొచ్చు. కానీ వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్ అనే సంస్థకు ఒక ప్రత్యేక ఉంది. అదేమంటే ఇది భారత దేశంలో వున్న పురాతన ప్లైవుడ్ ఫ్యాక్టరీలలో ఒకటి. అంతే గాక ఇది భారత దేశంలో పాడైన లేదా రద్దయిన కరెన్సీ నోట్లతో ఈ సంస్థ ఫ్లై వుడ్ తయారు చేస్తుంది. అదే దీని ప్రత్యేకత. భారత దేశంలో చలామణిలో వున్న కరెన్సీ నోట్లు కొంత కాలానికి పాడై పోవచ్చు లేదా ప్రభుత్వం కొన్ని కారణాంతరాల వల్ల వాటిని రద్దు చేయవచ్చు. అటువంటి సందర్భాలలో ఆ నోట్లనుముద్రించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ఆ కరెన్సీ నోట్లు చేరిపోతాయి. కుప్పలు తెప్పలుగా వచ్చి చేరే అటువంటి కరెన్సీ నోట్లను వదిలించుకోవడానికి రిజర్వ్ బ్యాంకు వాటిని తగులబెట్టి బూడిద చేసేది. అది వాతావరణ కాలుష్యానికి కారణమయ్యేది.

కేరళలో వున్న రిజర్వ్ బ్యాంకు ఇలా కరెన్సీ నోట్లను తగులబెడుతున్నదని గమనించిన ఈ ప్యాక్టరీ వారు ఈ విషయం గమనించిన స్థానికంగా వున్న వెస్టర్న్ ఇండియా ఫ్లైవుడ్ అనే సంస్థ ఆ పాత నోట్లను కాగితం గుజ్జు(పల్ప్)గా మార్చి హార్డ్ బోర్డులను తయారు చేయడానికి గల అవకాశాలను పరిశీలించదలచి ప్రయోగాలను చేపట్టింది. వారి పరిశోధన ఫలించి, సాధారణ కాగితం కన్నా దళసరిగా వున్న ఈ కరెన్సీ కాగితంతో నాణ్యమైన అట్టల తయారీకి ఉపయోగించ మొదలెట్టారు. రిజర్వ్ బ్యాంకు వారిని సంప్రదించి ఆ చిత్తు కరెన్సీని తమకు ఆమ్మే ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో రద్దయిన పెద్ద నోట్లన్నీ చివరి గమ్యంగా రిజర్వ్ బ్యాంకు శాఖలకు చేరుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు వారు వాటిని ముక్కలుగా చేసి వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్ కంపెనీకి అమ్మేస్తున్నారు. ఆ విధంగా ఈ కంపెనీ రిజర్వ్ బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో ముక్కలు చేసిన రద్దయిన కరెన్సీ నోట్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి అట్టలుగా, హార్డ్ బోర్డ్ షీట్లుగాను తయారు చేసి దేశ వ్యాప్తంగా సరపరా చేస్తున్నది. దీని వలన వాతావరణ కాలుష్యాన్ని ఆపగలగడమే కాకుండా కాగితాన్ని పునర్వినియోగంలోకి తేవడము మంచి విషయమే.

వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్ ప్యాక్టరీ కేరళ రాష్ట్రంలోని కానూర్ జిల్లాలోని వలపట్టణం నది ఒడ్డున ఉంది. ఇది దేశంలో వున్న పురాతన హార్డ్ బోర్డ్ ప్యాక్టరీలలో ఇది ఒకటి. కానీ రద్దయిన కరెన్సీ నోట్లతో హార్డ్ బోర్డులను తయారు చేసే ప్యాక్టరీ మాత్రము మన దేశంలో ఇదొక్కటే. అందుచేత వెస్టర్న్ ఇండియా ప్లైవుడ్స్ అనే లోగో వున్న హార్డ్ బోర్డ్ కనబడితే అది మన కరెన్సీ నోట్లతో తయారు కాబడినదని గుర్తించాలి.[1]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. ఈనాడు ఆదివారం 18.12.2016

వెలుపలి లంకెలు

[మార్చు]