వేగం

వికీపీడియా నుండి
(వేగము నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నిర్ధిష్ట దిశలో ఒక వస్తువు యొక్క వడిని వేగం అంటారు. సాధారణ పరిభాషలో వడికి బదులుగా వేగం అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ భౌతిక శాస్త్రంలో, వస్తువు యొక్క స్థానభ్రంశములో జరిగే మార్పు రేటుని వేగం గా నిర్వచిస్తారు. ఇది పొడవు.కాలం (-1) (LT (-1) ) ప్రమాణము కలిగిన ఒక సదిశ రాశి. యస్.ఐ (మెట్రిక్) పద్ధతిలో, వేగాన్ని సెకనుకు మీటర్లు (మీ/సె) తో కొలుస్తారు. వేగం యొక్క అదిశ absolute value (పరిమాణమే) వడి.

వేగం సదిశరాశి కాబట్టి, దీన్ని నిర్వచించటానికి వడి మరియు దిశ రెండు కావాలి. ఉదాహరణకు, "సెకనుకు 5 మీటర్లు" అనేది వడి, సదిశరాశి కాదు. కానీ, "తూర్పు దిశగా సెకనుకు 5 మీటర్లు " అనునది సదిశరాశియైన వేగం. వస్తువులోని స్తానభ్రంశములో మార్పు రేటునే వేగము అంటారు. సరళరేఖా మార్గములో ప్రయాణించే ఒక వస్తువు నిర్ణీత కాలవ్యవధి (t) లో, స్థానభ్రంశము (s) కలిగిన, ఆ వస్తువు యొక్క సగటు వేగాన్ని (v) ఈ దిగువ ఫార్ములాతో సూచిస్తారు:

లేదా వేగము = దూరము / కాలము

ఏదేని ఒక భ్రమణం చేసే వస్తువు కాలాంతరంలో చేసే కోణమే కోణీయ స్థానబ్రంశం. కోణీయ స్థానబ్రంశంలో మార్పు రేటును కోణీయ వేగం అందురు.

జంతువుల వేగం గంటకు[మార్చు]

చిరుతపులి 120 కిలోమీటర్లు

సింహం 80 కిలోమీటర్లు

కుందేలు (అడవి) 72 కిలోమీటర్లు

జీబ్రా 64 కిలోమీటర్లు

పందెం గుర్రం 69.2 కిలోమీటర్లు

సొర చేప (షార్క్) 64 కిలోమీటర్లు

కుందేలు 56 కిలోమీటర్లు

జిరాఫీ 51 కిలోమీటర్లు

ఎలుగు (గ్రీజ్లీ) 48 కిలోమీటర్లు

పిల్లి 48 కిలోమీటర్లు

ఏనుగు 40 కిలోమీటర్లు

తేనెటీగ 18 కిలోమీటర్లు

పంది 18 కిలోమీటర్లు

కోడి 14 కిలోమీటర్లు

గుండుతేలు 0.27 కిలోమీటర్లు

పేడ పురుగు 10.8 కిలోమీటర్లు

చిన్నబల్లి 29 కిలోమీటర్లు

మొసలి 12 కిలోమీటర్లు

పసిరిక 11.26 కిలోమీటర్లు

జెర్రి 7.15 కిలోమీటర్లు

సాలీడు 1.87 కిలోమీటర్లు

రాక్షస తాబేలు 0.27 కిలోమీటర్లు

కుమ్మరి పురుగు 10.8 కిలోమీటర్లు

నత్త 0.048 కిలోమీటర్లు

డాల్ఫిన్ 55.5 కిలోమీటర్లు

సముద్రసింహం 40.2 కిలోమీటర్లు

పెంగ్విన్ 22 కిలోమీటర్లు

సముద్ర తాబేలు 35.2 కిలోమీటర్లు

కంగారు 40 నుండి 50 కిలోమీటర్లు

వేటకుక్క 66.72 కిలోమీటర్లు

రెయిన్ వలస పక్షి 100 నుంచి 170

కాకి 50 కిలోమీటర్లు

తోక లేని గబ్బిళం 51 కిలోమీటర్లు

ఎగిరే చేప 36.72 కిలోమీటర్లు

తూనీగ 36 కిలోమీటర్లు

సీతాకోకచిలుక 25.2 కిలోమీటర్లు

మోనార్క్ బట్టర్ ఫ్లై 27.2 కిలోమీటర్లు

తుమ్మద 18 కిలోమీటర్లు

ఇవి కూడా చూడండి[మార్చు]

జంతువులు జీవితకాలం

జంతువులు గర్భిణీకాలం

మూలాలు[మార్చు]

  • Halliday, David, Robert Resnick and Jearl Walker, Fundamentals of Physics, Wiley; 7 Sub edition (June 16, 2004). ISBN 0471232319.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వేగం&oldid=2006851" నుండి వెలికితీశారు