వేడి గాలి బెలూన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hot air balloon in flight.
Hot air balloons shaped like bees.
Hot air balloon shaped as the Abbey of Saint Gall

వేడి గాలి బెలూన్‌లు విమానాలలోని ఒక రకం, మానవుడు ఎగిరేందుకు ఉపయోగించి విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రారంభ రూపం. వేడి గాలి బుడగల ఉపయోగం పురాతన చైనీస్ నుండే మొదలయి ఉండవచ్చు. సాధారణంగా ఒక రకమైన అగ్నితో బుడగలోని గాలిని వేడి చేయటం ద్వారా వేడి గాలి బుడగలు పనిచేస్తాయి.

వేడి గాలి "బరువు" అంతే ఆయతనం (వాల్యూమ్) ఉన్న చల్లని గాలి కంటే తక్కువ, (చల్లగాలి సాంద్రత కన్నా వేడిగాలి సాంద్రత తక్కువ) అంటే చుట్టూ చల్లని గాలి ఉన్నప్పుడు నీటికుండలోని బుడగలు పైకి తేలినట్లుగా వేడిగాలి పైకి వెళ్లుతుంది లేదా తేలుతుంది. వేడి, చల్లని మధ్య వ్యత్యాసం పెద్దగా ఉన్నప్పుడు, సాంద్రతలో కూడా పెద్ద తేడా ఉంటుంది, ఈ వ్యత్యాసం వలనే వేడిగాలి ఉన్న బలమైన బెలూన్ పైకి నెట్టబడుతుంది.

దీని అర్థం ఈ వేడి గాలి బుడగలు చల్లని రోజు, లేదా బెలూన్ లోపలి గాలికి ఎక్కువ వేడిని కలుగజేసినప్పుడు ఎక్కువ బరువును మోసుకెళ్లగలుగుతాయి.

ఫ్రాన్స్ దేశపు పారిస్ లో 1783 నవంబరు 21 న మొదటిసారి పగ్గపుతాడు లేని మానవ విమానం ఎగిరింది, ఇది జీన్-ఫ్రాంకోయిస్ పిలాట్రీ డి రోజియర్, ఫ్రాంకోయిస్ లారెంట్ డి అర్లండెస్ నడిపించిన వేడి గాలి బెలూన్, దీనిని 1782 డిసెంబరు 14 న మోంట్గోల్ఫియర్ సోదరులు రూపొందించారు.

వేడి గాలి బుడగల నిర్మాణంలో అనేక కారకాలు ఉన్నాయి:

 • కప్పుకవచం (ఎన్వలప్)
 • కుట్లు
 • లేపనాలు
 • పరిమాణము
 • వెలువరించే ముఖ ద్వారాలు (వెంట్స్)
 • ఆకారము
 • బుట్ట
 • పొయ్యి
 • ఇంధన టాంకులు
 • సాధననిర్మాణం (ఇంస్ట్రుమెంటేషన్)
 • సంయుక్త ద్రవ్యరాశి