Jump to content

వేణు దోనేపూడి

వికీపీడియా నుండి
వేణు దోనేపూడి
వేణు దోనేపూడి
జననంవిజయవాడ, ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాద్ , తెలంగాణ
విశ్వవిద్యాలయాలుమైసూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు
వృత్తిపారిశ్రామికవేత్త, చిత్ర నిర్మాత, ఆటోమొబైల్ ఇంజనీర్
క్రియాశీలక సంవత్సరాలు1996–ప్రస్తుతం
భార్య / భర్తSwetha Donepudi
పిల్లలుSriya Donepudi, Srida Donepudi

వేణు దోనేపూడి (జ. నవంబరు 7) Venu Donepudi ఒక భారతీయ ఆటోమొబైల్ పారిశ్రామికవేత్త, ప్రముఖ మల్టీ బ్రాండ్ కార్ సేవల కంపెనీ కార్జ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌.[1] కృష్ణాజిల్లాలో జన్మించారు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి 1996 లో ఇంజనీరింగ్ పట్టా పుచ్చు కున్నారు. భార్యపేరు శ్వేత . ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తవగానే 1997వ సంవత్సరంలో... అమెరికాకు చెందిన కంపెనీ ఫోర్డ్ మోటార్ కంపెనీలో అనలిస్ట్ గా కెరీర్‌ను ఆరంభించారు. ఆ తరువాత జనరల్ మోటార్స్ లో సీనియర్ ఇంజనీర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వ ర్తించారు. అదే కాలంలో 80+ సంవత్సరాలనుండి కుటుంబ వ్యాపారంమైన చిత్ర నిర్మాణం, ప్రదర్శనలో ప్రసిద్ధి చెందిన అమ్యూజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు అధ్యక్షునిగా వ్యవహరించారు, ఈ సంస్థ ద్వారా సుమారు 100 పైన అంతర్జాతీయ చలన చిత్రాల పంపిణీ చేసారు. ప్రస్తుతం వాహన్ మోటార్స్ 2008 నుంచి స్థాపక మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు [2]

కార్జ్‌

[మార్చు]

మల్టీ బ్రాండ్‌ కార్‌ రిపైర్‌, మెయింటెనెన్స్‌ సంస్థ వాహన్ మొటార్స్ బ్రాండు పేరు కార్జ్‌ ఇప్పటి వరకు 2008లో హైదరాబాద్‌లో తొలి సర్వీస్‌ సెంటర్‌ ప్రారంభించి తెలంగాణ, అంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు, కేరళ, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో 10 లక్షల మంది వినియోగదారులకు సేవలను అందించింది. అపారమైన అనుభవం, సమృద్ధిగా నిధులు, ఘనమైన నేపథ్యం ఉన్న సంస్థల పోటీని తట్టుకొని స్టార్ట్‌పగా మొదలై ఇప్పుడు మల్టీబ్రాండ్‌ కార్‌ రిపేరింగ్‌, మెయింటెనెన్స్‌ సర్వీసుల్లో పేరున్న బ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా కార్జ్‌ గుర్తింపు సంపాదించింది.తొలి వ్యూహాల ప్రకారం, సొంత వర్క్‌షా్‌పల ద్వారానే వ్యాపారాన్ని విస్తరించాలని భావించినప్పటికీ, వ్యాపార నిర్వహణలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఫ్రాంచైజీ పద్ధతిలో విస్తరించడమే మంచిదన్న నిర్ణయానికి సంస్ధ వచ్చింది. ఈ వ్యూహం వల్ల సొంత సర్వీసు సెంటర్స్‌లో ఉండే పరిమితులను అధిగమించడం, వనరుల ఆదాతో పాటు వినియోగదారులకు మరింత చేరువగా వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని కార్జ్‌ భావిస్తోంది.[3]

మూలాలు

[మార్చు]
  1. http://www.andhrajyothy.com/artical?SID=446413[permanent dead link]
  2. https://www.sakshi.com/news/district/nagarjuna-open-a-karz-service-show-room-400883
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-01. Retrieved 2017-12-16.