వేదిక:తెలంగాణ/2013 52వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.వి.నరసింహారావు

భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఏకైక తెలుగువ్యక్తి అయిన పాములపర్తి వేంకట నరసింహారావు 1921, జూన్ 28న జన్మించారు. ఈయన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందినవారు. పీవీ గా ప్రసిద్ధుడైన ఈయన బహుభాషావేత్త, రచయిత. రాజకీయాలాలలో అపర చాణక్యుడిగా పేరుపొంది, భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. విద్యార్థి దశలోనే స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశించి, 1938లో వందేమాతరం ఉద్యమం నుంచి చురుకుగా పాల్గొన్నారు. 1957 లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, 1971లో ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి 1991లో ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం. సాహిత్యంలో కూడా రాణించి పలు గ్రంథాలను రచించడమే కాకుండా విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలు గ్రాంథానికి సహస్రఫణ్ పేరుతో హిందీలో అనువదించి సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఇన్‌సైడర్ పేరుతో ఆత్మకథ కూడా రచించారు. 2004 డిసెంబర్ 23న పి.వి.నరసింహారావు మరణించారు. (మొత్తం వ్యాసం చూడండి)