Jump to content

వేదిక:ఫోటోగ్రఫి/వ్యాసం

వికీపీడియా నుండి

ఫోటోగ్రఫీ

ఫోటోగ్రఫీ లేదా ఛాయాగ్రహణం (Photography) అనునది కాంతి లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను భద్రపరచటం తో బాటు రసాయనిక చర్యల తో కాంతి సూక్ష్మాలని గుర్తించే ఛాయాగ్రాహక చిత్రం (photographic film) వలన గానీ /ఎలక్ట్రానిక్ ప్రక్రియతో ఇమేజ్ సెన్సర్ (చిత్రాలని గుర్తించే పరికరము) వలన గానీ మన్నికైన చిత్రాలని సృష్టించే/ముద్రించే ఒక కళ/శాస్త్రము/అభ్యాసము. సాధారణంగా ఒక వస్తువు పై ప్రసరించే కాంతిని గాని, లేదా ఒక వస్తువు నుండి వెలువడుతున్న కాంతిని గానీ ఒక కటకం (lens)తో దృష్టి (focus) ని కేంద్రీకరించి, కెమెరా లో ఉండే కాంతిని గుర్తించే ఉపరితలం పై నిర్దిష్ట సమయం వరకూ బహిర్గతం (exposure) చేయటం తో ఆ వస్తువుల నిజ ప్రతిబింబం (real image) సృష్టించటం జరుగుతుంది. దీని ఫలితంగా వైద్యుదిక చిత్ర సంవేదిక (electronic image sensor) లోని ప్రతి ఒక్క చిత్ర కణము (pixel) పై విద్యుచ్ఛక్తి (electrical charge) వైద్యుదిక చర్య (electronical processing) జరిగి తర్వాత ప్రదర్శితమగుటకు, మార్పులు చేసుకొనుటకు సాంఖ్యిక ప్రతిబింబం (digital image) ఫైల్ గా భద్రపరచబడుతుంది.

(ఇంకా…)