వేదిక:లినక్స్/ఈ వారపు వ్యాసం
Jump to navigation
Jump to search
| ||
డెబియన్ అనేది ఒక లినక్స్ ఆపరేటింగ్ సిస్టం, ఇది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ ప్రత్యేకంగా గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు కింద ఉన్న సాప్ట్వేర్లు మరియు ఇతర ఫ్రీ సాప్ట్వేర్ల లైసెన్సుల మీద ఉన్న సాప్ట్వేర్ల కూర్పు.లినక్స్ కెర్నలు మరియు గ్ను ఆపరేటింగ్ సిస్టం సాధనాలను వాడటం వలన దీనిని డెబియన్ గ్నూ/లినక్స్ గా వ్యవహరిస్తారు, ఇది గ్నూ/లినక్స్ పంపకాలలో ఒక ప్రజాదరణ పొందిన పంపకం. స్థాపించి వాడుకోవటానికి తయారుగా ఉన్న వేల సాప్ట్వేర్ల ప్యాకేజీలు కలిగిన నిధులను అందుబాటులో ఉండేటట్లు దీనిని పంచుతారు. యునిక్స్ మరియు ఫ్రీ సాప్ట్వేర్ తత్వాలను తప్పనిసరిగా పాటించే పంపకంగా దీనిని వ్యవహరిస్తారు. డెబియన్ను డెస్క్టాపు వలె అదే విధంగా సెర్వర్ ఆపరేటింగ్ సిస్టంగా కూడా వాడుకోవచ్చు. |