Jump to content

వేమవరం (భట్టిప్రోలు)

అక్షాంశ రేఖాంశాలు: 16°06′N 80°42′E / 16.10°N 80.7°E / 16.10; 80.7
వికీపీడియా నుండి
వేమవరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వేమవరం is located in Andhra Pradesh
వేమవరం
వేమవరం
అక్షాంశరేఖాంశాలు: 16°06′N 80°42′E / 16.10°N 80.7°E / 16.10; 80.7
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం భట్టిప్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వేమవరం, బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ప్రసాదరావు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగస్వామివారి ఆలయం

[మార్చు]
  1. ఈ గ్రామంలోని శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగస్వామి విగ్రహ ప్రతిష్ఠ, దేవాలయ పునహ్ ప్రతిష్ఠ, పండితుల వేదమంత్రోశ్ఛారణల మధ్య, 2024,ఫిబ్రవరి-6న, వైభవంగా జరిగింది.
  2. ఈ ఆలయంలో, 2014, నవంబరు-3, కార్తీక సోమవారం నాడు, ఏకాదశిని పురస్కరించుకొని, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. పంచామృతాభిషేకం, సామూహిల సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించెదరు.

గ్రామదేవత పోలేరమ్మ తల్లి ఆలయం

[మార్చు]

వేమవరం గ్రామదేవత పోలేరమ్మ తల్లి సంబరాలు 2014,మే-18 ఆదివారం నాడు వైభవంగా జరిగినవి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పొంగళ్ళు సమర్పించారు. మేళతాళాలతో గ్రామోత్సవం చేసి, భక్తుల నుండి హారతులు స్వీకరించారు. భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పేరుగాంచడంతో సూరేపల్లి, తాతవారిపాలెం, కోనేటిపురం తదితర గ్రామాలలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.

ఈ గ్రామంలో రామమందిరానికి ఎదుట నిర్మించిన ముఖద్వారంపై, శ్రీ హనుమత్సమేత సీతా, రామ, లక్ష్మణ విగ్రహాలను, 2015,మార్చి-8వ తేదీ, ఆదివారం నాడు, తొలుత గ్రామంలో ఊరేగించి భక్తులనుండి హారతులు స్వీకరించి, అనంతరం, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆవిష్కరించారు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • డాక్టర్ బెజ్జంకి జగన్నాధాచార్యులు, రచయిత, కవి. పల్నాడు ప్రాంతంలో ఉపాధ్యాయులుగా పనిచేయుచూ, ప్రస్తుతం మాచర్లలో స్థిరపడినారు. ఇటీవల మద్రాసు విశ్వవిద్యాలయంలో 24 గంటల పాటు ఏకథాటిగా జరిగిన కవిసమ్మేళనంలో తన కవితలు, రచనలద్వారా తన సత్తా చాటి "లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్"లో స్థానం సంపాదించుకున్నాడు. పల్నాటి కవుల చరిత్ర., పల్నాటి గేయకవిత, ప్రహ్లాదుడు బాలలబొమ్మల కథ, కాసుబ్రహ్మానందరెడ్డి, ఎత్తుకు పైయెత్తు వంటి రచనలు చేసాడు.

మూలాలు

[మార్చు]